-
సందర్శకులతో కిటకిటలాడిన హరీశ్ దత్తత గ్రామం!
సాక్షి, మెదక్: జాతీయస్థాయిలో గుర్తింపు సాధించి.. పలు అవార్డులు ఇబ్రహీంపూర్ మరోసారి సందర్శకులతో కిటకిటలాడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న ఈ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఎన్ఐఆర్డీలో శిక్షణ కోసం వచ్చిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 45 మంది సర్పంచ్ల బృందం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, వివిధ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఇబ్రహీంపూర్లో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే హరీశ్‌రావు చూపించిన స్ఫూర్తి ఆదర్శమని వారు ప్రశసించారు. ఇక్కడి అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. గ్రామాభివృద్ధి విషయంలో ఇబ్రహీంపూర్ ఒక అధ్యయన కేంద్రమని, ఇక్కడ నుంచి పాఠాలు నేర్చుకున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజల ఐక్యత చూస్తే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి దేవయ్య, ఎంపీడీవో సమ్మిరెడ్డి, కార్యదర్శి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్రహీంపూర్.. సూపర్
సాక్షి, సిద్దిపేట: ‘ఊరంటే ఇలా ఉండాలి.. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకం ఇక్కడ అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల్లో ప్రతీ పైసా సద్వినియోగం అవుతోంది. ఉపాధి హామీ పథకం అమల్లో ఇబ్రహీంపూర్ గ్రామం దేశాని కే ఆదర్శంగా నిలిచింది. మీ నాయకుడు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధకు, మీ అందరి ఐక్యతకు అభినందనలు.. మీ గ్రామం నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం’ అని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన చీఫ్ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హరియాణా విధాన సభ స్పీకర్ సహా మొత్తం 61 మందితోపాటు, 25 మంది ఐఏఎస్‌లు సిద్దిపేట నియోజకవర్గంలోని హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి స్వాగతం పలికారు. ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టే 26 పనులు ఇబ్రహీంపూర్లో సంపూర్ణంగా అమలు జరగడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ పని గురించి ఫొటోలు తీసుకున్నారు. హరియాణా స్పీకర్ కుంపర్పాల్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడి పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనడానికి ఇబ్రహీంపూర్ గ్రామం నిదర్శనమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాపురాజయ్య పెయింటింగ్‌లు, మహిళా ప్రతినిధులకు సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకతగా నిలిచే గొల్లభామ చీరలను అందజేశారు. ఐకమత్యంతోనే సాధ్యపడింది.. గ్రామస్తుల ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెడితే దానిని ఇక్కడ అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలోనే నగదు రహిత క్రయవిక్రయాలు అమలు చేసిన గ్రామంగా ఈ ఊరుకు పేరుందని చెప్పారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం సంతోషంగా ఉందన్నారు. కొందరు విదేశీ ప్రతినిధులు కూడా గ్రామాన్ని సందర్శించి వెళ్లారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్రహీంపూర్ గ్రామం గురించి చర్చ జరగడం ఈ గ్రామస్తుల అదృష్టంగా ఆయన అభివర్ణించారు. గ్రామంలోని చిన్నా.. పెద్దా ఐక్యంగా ఉండటం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. భవిష్యత్‌లో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిస్తామని చెప్పారు. -
యువతిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఆ విషయాన్ని ఆదివారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి హత్యపై పోలీసులు గ్రామస్తులను ప్రశ్నిస్తున్నారు. యువతి మృతదేహంలోని సరిగా కాలని శరీర భాగాలను పోలీసులు సేకరించారు. పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement