-
'రవిశాస్త్రి హాట్ సీట్లో ఉండాలి'
టీమిండియా డైరక్టర్‌గా రవిశాస్త్రి కొనసాగాలని పాకిస్తాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా డైర్టకర్గా రవిశాస్త్రి పదవీకాలం పూర్తయిందని, బీసీసీఐ అధికారులు కొత్త కోచ్‌ను నియమించేందుకు యోచిస్తున్నారని తెలిసింది. రవిశాస్త్రి సుముఖంగా ఉంటే ఆయన హాట్ సీట్లో కొనసాగాలి' అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. టి-20 ప్రపంచ కప్‌తో రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. టీమ్ డైరక్టర్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాక జట్టులో ఆత్మస్థయిర్యాన్ని నింపాడని అక్రమ్ కితాబిచ్చాడు. టీమిండియాకు గతంలో విదేశీ కోచ్‌లు పనిచేశారని, డంకెన్ ఫ్లెచర్ కోచ్‌గా ఉన్నప్పడు భారత్ వరుసగా 8 టెస్టు మ్యాచ్‌లలో పరాజయం చవిచూసిందని గుర్తు చేశాడు. రవిశాస్త్రి వచ్చాక భారత్ మళ్లీ పుంజుకుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై టి-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిందని చెప్పారు. బీసీసీఐ అధికారులు ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ, రవిశాస్త్రి పదవి నుంచి వైదొలిగితే విస్మయం చెందుతానని అక్రమ్ పేర్కొన్నాడు. -
మా అట శైలి మారదు!
►గత ఏడాదిగా ఎంతో శ్రమించాం ► నిలకడగా విజయాలు దక్కుతాయి ► భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఇంటర్వ్యూ భారత క్రికెట్ జట్టు డెరైక్టర్‌గా రవిశాస్త్రి బాధ్యతలు స్వీకరించి ఏడాదైంది. ఈ సమయంలో కొన్ని చక్కటి విజయాలు సాధించిన జట్టు, మరికొన్ని సార్లు విజయానికి చేరువగా వచ్చింది. అన్నింటికి మించి సీనియర్ల అండ లేని యువ జట్టులో స్ఫూర్తి నింపుతూ వారిని ప్రోత్సహిస్తున్న శాస్త్రి పనితీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. ఫలితంగా ఆయనతో పాటు మరో ముగ్గురు సహాయక కోచ్‌లకు కూడా టి20 ప్రపంచ కప్ వరకు పొడిగింపు దక్కింది. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌తో మొదలు పెట్టి పలు సిరీస్‌లతో టీమిండియా బిజీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన, అంచనాలపై రవిశాస్త్రి వివరంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... టీమ్ డెరైక్టర్‌గా అనుభవం: గతంలో ఆటగాడిగానే కాకుండా క్రికెట్‌కు సంబంధించి వేర్వేరు విషయాల్లో నా అనుబంధం కొనసాగింది. అయితే ఈ బాధ్యత మాత్రం చాలా ప్రత్యేకం. సరిగ్గా చెప్పాలంటే నాకు చాలా సంతృప్తినిచ్చిన పని ఇది. ప్రతిభ గల ఆటగాళ్లు, సరైన సహాయక సిబ్బంది అండగా ఉండటంతో ఈ సవాల్‌ను నేను స్వీకరించగలిగాను. దీనిని మరింత సమర్థవంతంగా నిర్వర్తించేదుకు ప్రయత్నిస్తా. శ్రీలంకలో సిరీస్ విజయం: ఇది మా ఏడాది శ్రమకు దక్కిన ఫలితం. ఇవన్నీ రాత్రికి రాత్రి జరిగిపోవు. వ్యవస్థను చక్కదిద్దాల్సి ఉంటుంది. ఆటగాళ్లందరి మదిలో గెలుపు భావన వస్తే మెల్లగా ప్రభావం కనిపిస్తుంది. టెస్టులకు సంబంధించి ఇదంతా ఆస్ట్రేలియాలో ప్రారంభం అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో కొనసాగి శ్రీలంకతో కనిపించింది. సహాయక సిబ్బంది: నా దృష్టిలో ముగ్గురూ ముగ్గురే. వీరంతా జనానికి కొత్త కావచ్చేమో కానీ చాలా కాలంగా, అండర్-19 స్థాయినుంచే భారత క్రికెట్ వ్యవస్థలో భాగంగా ఉన్నారు. శిక్షణలో చక్కటి అనుభవం ఉంది. భరత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్ అన్నప్పుడు అతనెవరు అన్నవాళ్లే ఇంకా ముందే తీసుకోవాల్సింది అంటున్నారు. వారు క్రికెటర్ల మనసెరిగి వారితో బాగా కలిసిపోయారు. ఆటగాళ్లు కూడా వారిపై నమ్మకముంచారు. జట్టు సభ్యులనుంచి మంచి ఫలితాలు రాబట్టేందుకు ఈ ముగ్గురు నిజాయితీగా శ్రమించడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయి. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్: దక్షిణాఫ్రికా ప్రపంచ నంబర్‌వన్ జట్టు. వారిపై ఒత్తిడి పెంచాలంటే మనం చాలా నిలకడగా ఆడాల్సి ఉంటుంది. అయితే మా ఆట శైలిలో ఎలాంటి మార్పూ ఉండదు. ఆసీస్, లంక సిరీస్‌లలో చూస్తే ఎంత చిన్న తేడాతో ఓటమి, గెలుపు వచ్చాయో కనిపిస్తుంది. ఆధిక్యం ప్రదర్శించి కూడా ప్రత్యర్థిని మళ్లీ కోలుకోకుండా చేయాలంటే ఎంతో ఓపిక అవసరం. ఆస్ట్రేలియా, లంకతో తొలి టెస్టులో అది మాకు లేకుండా పోయింది. ఆ తర్వాత మెరుగవడం వల్లే లంకతో సిరీస్ గెలిచాం. ఇషాంత్ బౌలింగ్: తాను పూర్తి ఫిట్‌గా లేనంటూ స్వయంగా ప్రపంచకప్‌నుంచి తప్పించుకోవడం బాధాకరమే అయినా ఇషాంత్ తీసుకున్న నిర్ణయం సరైందే. తగిన విశ్రాంతితో అతను మరింతగా శ్రమించాడు. తన లోపాలపై దృష్టి పెట్టి సవరించుకున్నాడు. తన బౌలింగ్ బలమేమిటో అతనికి అర్థమైంది. దానిని అతను కొనసాగిస్తాడనే నమ్ముతున్నా. శ్రీలంకతో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇషాంత్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు లేకపోవడం దురదృష్టకరం. అశ్విన్ ప్రదర్శన: అశ్విన్‌కు వ్యోమగామికి ఉండే తెలివితేటలు ఉన్నాయి. తన తెలివికి ఓపికను జోడించి అతను భారత జట్టును పరుగెత్తిస్తున్నాడు. శ్రీలంకలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అతనే. సంగక్కరను నాలుగు సార్లు అవుట్ చేసిన తీరు అశ్విన్ ఏమిటో చూపిస్తుంది. ఇకపై ఇలాంటి ప్రదర్శనలు ఇంకా చాలా రానున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు: గొప్ప జట్టు సిద్ధమవుతోందనడానికి ఇది సూచన! ఎందుకంటే జట్టులో గాయాలు ఉన్నా ఎలాంటి సమస్య లేకుండా ఇతర ఆటగాళ్లు ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారంటే విశేషమే కదా. ఎవరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా శాశ్వతం కాదనే సందేశం అందరికీ వెళ్లిపోయింది. జట్టు అవసరాలకు అనుగుణంగానే ఆడాల్సి ఉంటుంది. ఆటగాళ్లు కూడా తన వల్ల కాదనో లేదా ఫలానా స్థానంలో ఆడలేననే సాకులు వెతకలేరు. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా ఎక్కడ ఆడించినా సఫలమయ్యారు. దీని వల్ల జట్టు సభ్యులలో గందరగోళం ఏర్పడుతుందనే మాటను నేను నమ్మను. నిజానికి శ్రీలంకలో వరుస గాయాల వల్ల స్థానాలు మార్చాల్సి వచ్చింది కానీ అదే తప్పనిసరి కాదు. ఒక సారి అంతా ఫిట్ అయితే దానిపై స్పష్టత వస్తుంది. అయితే ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమనే భావన బ్యాట్స్‌మెన్‌కు రావడం సంతోషకరం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement