-
జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?
అందమైన లొకేషన్లలో మత్తెక్కించే.. కైపెక్కించే అమ్మాయిలతో సరదా షికారు. ‘‘ ఏమి హాయిలే హలా’’ అంటూ ఆహ్లాదమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న టైంలో.. ఊహించని విధంగా ఊడిపడే ముప్పు. ఒక్కసారిగా మీద దూకే శత్రువులు.. వాళ్లతో ఫేస్ టు ఫేస్ ఫైట్, ‘ధడేల్’మంటూ పేలే బాంబులు.. దడ్దడ్ అంటూ బుల్లెట్ల వర్షం.. వాటి మధ్య నుంచే కారులో ‘జుయ్’ మంటూ దూసుకుపోతుంటాడు జేమ్స్ బాండ్.. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో హీరోలు మాత్రమే రాయల్ లుక్‌లో కనిపించరు. ఆ సినిమాల్లో కనిపించే ప్రతీదానికి ఓ రిచ్‌నెస్, ప్రత్యేకతలు ఉంటాయి. జేమ్స్ బాండ్ నడిపే కారుకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ కారు బుల్లెట్లను కక్కుతుంది. కత్తులు దూస్తుంది. కొండలు ఎగబాగుతుంది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో దూసుకుపోతుంది. అద్దాలు బద్దలు గొట్టుకుని ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌లోకి పోతుంది. అవసరమైతే గాల్లో అమాంతం ఎగురుతుంది. ఛేజింగ్‌లో బుల్లెట్లను, బాంబులను తట్టుకునే కార్లు బాండ్ బాబుకి శ్రీరామ రక్షగా నిలుస్తుంటాయి. అందుకే బాండ్ బాబు వాడే బ్రాండ్ కార్లకు అంతే క్రేజ్ ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ ఆ కార్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు. బాండ్.. జేమ్స్ బాండ్ పేరుకే ఈ 007 ఏజెంట్.. ఓ గూఢచారి బ్రిటిష్ క్యారెక్టర్. కానీ, ఏళ్లుగా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ వస్తున్నాడు. బాండ్ రోల్లో కనిపించేది ఎవరైనాసరే.. అభిమానులు మాత్రం ఆ క్యారెక్టర్‌ను అతుక్కుపోతుంటారు. జేమ్స్ బాండ్ ఇరవై ఐదవ సినిమా ‘నో టైం టు డై’.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈమూవీ.. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్‌లో రిలీజ్ కానుంది. అమెరికా నుంచి అక్టోబరు 8న కొంచెం ఆలస్యంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా దాదాపు యాభై ఏళ్లుగా బాండ్ వాడిన కార్ల మీద ఓ లుక్కేద్దాం. సన్‌బీమ్ అల్పైన్ బాండ్ ఎక్కువగా లోకల్ మేడ్ కంపెనీ కార్లను ఉపయోగిస్తుంటాడు. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో 1962లో ‘నో డాక్టర్’ నుంచి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ స్పెషల్ కార్లను ఉపయోగిస్తోంది. సన్‌బీమ్ అల్పైన్ కంపెనీ సిరీస్ 2 కారును ఉపయోగించాడు. క్లాసిక్ ఫ్యాషన్‌లో ఈ బ్లూ కలర్ కారులో నటుడు సీన్ కానరీ వెళ్తుంటే.. ఎంతో స్టైలిష్‌గా అనిపించకమానదు. అయితే సినిమాలో బాండ్ పర్సనల్ కారు కాదు. జమైకా ఏజెంట్ జాన్ వేస్ సొంత కారు. బెంట్లీ మార్క్ ఫ్రమ్ రష్యా విత్ లవ్(1963) లో అప్పటికే మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు గడిచిన బెంట్లీ మార్క్ IV కారును ఉపయోగించారు. టయోటా యూ ఓన్లీ లివ్ ట్వైస్(1967)లో జపాన్ ఫస్ట్ సూపర్ కార్ టయోటా 2000 జీటీని ఉపయోగించారు. అయితే సీన్ కానరీ పొడగరి కావడంతో ఆ కారుకు కొన్ని మార్పులు చేసి ప్రత్యేకంగా కారును డిజైన్ చేశారు. మెర్క్యూరీ కూగర్ ఆన్ హర్ మెజెస్టీస్ సీక్రెట్ సర్వీస్(1969)లో ప్రేయసి ట్రేసీ కారును ఉపయోగిస్తాడు బాండ్. అందులో ఆమెది మెర్క్యూరీ కూగర్ ఎక్స్ఆర్-7 మోడల్ కారు. ఫోర్డ్ డైమండ్స్ ఆర్ ఫర్ఎవర్(1971)లో అప్పటిదాకా సినిమాల్లోకెళ్లా బెస్ట్ ఛేజింగ్ సీన్ ఉంటుంది. ఎర్రకలర్ ఫోర్డ్ మస్టాంగ్ మాచ్ 1 మోడల్ కారును అందుకోసం ఉపయోగించారు. ఈ ఛేజ్ సీన్ బాండ్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. డై అనదర్ డే(2002)లో ఐదు దశాబ్దాల కిందటి మోడల్ ఫోర్డ్ ఫెయిర్లేన్ను ఉపయోగించారు. ఏఎంసీ హోర్నెట్ ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్(1974) హోర్నెట్ ఎక్స్ హాట్చ్బ్యాక్ కారును ఉపయోగించారు. మేరీ గుడ్నైట్ను కాపాడే ప్రయత్నంలో బాండ్ చేసే ఛేజింగ్ కోసం ఈ కారును ఉపయోగించారు. లోటస్ ఎస్ప్రిట్ ది స్పై హు లవ్డ్ మీ(1977) కోసం ఎస్ప్రిట్ ఎస్1 కారును ఉపయోగించారు. అయితే సినిమాలో ఇదొక సూపర్ కార్గా చూపించేశారు. నీరు, గాలి, నేల మీద ఛేజ్ సీన్ల కోసం డిజైనింగ్ ఉండడం ప్రత్యేకం. రాకెట్లు సైతం పేల్చేది ఈ కారు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981) కోసం లోటస్ ఎస్ప్రిట్ ఎస్సెక్స్ టర్బో మోడల్ కారును ఉపయోగించారు. సిట్రోయిన్ పాపం.. బాండ్ లోటస్ కారు నాశనం అయ్యాక కొత్త కారును వాడుతుంటాడు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981)లో సిట్రోయిన్ 2 సీవీ కారును ఉపయోగించారు. బజాబ్ ఆర్ఈ ఆటో బాండ్ కేవలం కార్లు మాత్రమే వాడతాడా? అనే అనుమానాలు రావొచ్చు. అవసరమైతే బైకులు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఫస్ట్ టైం బాండ్ కోసం భారత్ ‘దేశీ’ టచ్ ఇచ్చారు. ఆక్టోపస్సీ(1983) సినిమాలో ఓ సీన్లో బాండ్ ఛేజింగ్ బజాజ్ ఆర్ మోడల్ ఆటోలో నడుస్తుంది. రెనాల్ట్ ఏ వ్యూ టు కిల్(1985)లో రెనాల్ట్ ట్యాక్సీని ఉపయోగించారు. రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ 2 మోడల్ కారును ‘ ఏ వ్యూ టు ఏ కిల్’(1985) సినిమా కోసం ఉపయోగించారు. మార్కెట్లోకి వచ్చిన దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ మోడల్‌ను బాండ్ మూవీలో ఉపయోగించారు. బీఎండబ్ల్యూ గోల్డెన్‌ఐ(1995) కోసం బీఎండబ్ల్యూ జీ3 మోడల్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత టుమారో నెవర్ డైస్(1997) కోసం బీఎండబ్ల్యూ 740ఐఎల్ను(750ఐఎల్ బ్యాడ్జ్‌లు) కారును బాండ్ వాడాడు. ఇక 1999లో వచ్చిన ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’ కోసం బీఎండబ్ల్యూ జీ8 మోడల్ కారును ఉపయోగించారు. ఆస్టోన్ మార్టిన్ బాండ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించిన కారు బ్రాండ్ ఇది. సుమారు పది సినిమాలకు పైగా ఈ కారునే బాండ్ క్యారెక్టర్ వాడుతుంది. ‘ది లివింగ్ డేలైట్స్’(1987) అస్టోన్ మార్టిన్ వీ8, గోల్డెన్ ఐ(1995), టుమారో నెవర్ డైస్(1997) కోసం అస్టోన్ మార్టిన్ డీబీ5, డై అనదర్ డే(2002) కోసం అస్టోన్ మార్టిన్ వీ12 వాన్క్విష్, కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008) కోసం డీబీఎస్ వీ12, అస్టోన్ మార్టిన్ డీబీ5 మోడల్ కారును కాసినో రాయల్(2006), స్కైఫాల్(2012) కోసం ఉపయోగించారు. రాబోయే ‘నో టైం టు డై’(2021)లోనూ జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్ కోసం ఈ కంపెనీ కారునే ఉపయోగిస్తున్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి: గన్నులున్న బాండ్ కారు.. ధరెంతో తెలుసా? -
Land Rover : జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.సెప్టెంబర్ 30న విడుదల కానున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది. కేవలం 300 యూనిట్లే డిఫెండర్ వీ8 బాండ్ 300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. 5.0 లీటర్ సూపర్చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 386 కిలోవాట్ పవర్, 625 ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్ డార్క్ గ్రే వీల్స్‌తో ఎక్స్టెండెడ్ బ్లాక్ ప్యాక్, సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డిఫెండర్ 007 రేర్ బ్యాడ్జ్ పొందుపరిచారు. డిఫెండర్ వీ8 90 వేరియంట్ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. చదవండి: ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్! -
ఒక్క కారు ధర 24 కోట్లు.. అంతా బాండ్ మాయ!
జేమ్స్‌బాండ్ సినిమాలో సిల్వర్ కలర్లో తళతళ మెరిసిపోతూ దూసుకెళ్లే కారు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ కారు జేమ్స్‌బాండ్‌కు ఓ ఆయుధం. విలన్లను ఛేజ్ చేయాలన్నా, బుల్లెట్ల వర్షం కురిపించాలన్నా ఇదే. ప్రముఖ కార్ల కంపెనీ ఆస్టన్ మార్టిన్ కేవలం జేమ్స్‌బాండ్ సినిమా కోసమే కొన్నేళ్లుగా కార్లను తయారుచేయడం, వాటిని వేలంలో అమ్మేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. బాండ్ సిరీస్‌లో వచ్చిన 12 సినిమాల్లో దర్శనమిచ్చిన ఈ కారు ఇటీవల విడుదలైన ‘స్పెక్టర్’లో కూడా అభిమానులను కనువిందు చేసింది. కేవలం ఈ సినిమా కోసమే ‘డీబీ 10’ పేరుతో పది కార్లను ఈ సంస్థ తయారు చేసింది. ఒక్కో కారుకి ఆయన ఖర్చు 25 కోట్ల రూపాయలు. ఇటీవల రెండు కార్లను వేలం వేస్తే ఒక కారు3.5 మిలియన్ డాలర్ల (రూ. 24 కోట్లు)కు అమ్ముడుపోయింది. అయితే గతంలో బాండ్ కార్లు పలికిన ధర కన్నా ఇది కాస్త తక్కువే. 1964లో వచ్చిన ‘గోల్డెన్ ఫింగర్’, 1965లో వచ్చిన ‘థండర్‌బాల్’ చిత్రాల్లో కనిపించిన డీబీ 5 కారు ఒక్కోటి ఏకంగా 31 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. తర్వాత ఈ ధరను వేరే బాండ్ కార్లు అధిగమించలేదు. తాజాగా డీబీ 10 కూడా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయడంలో విఫలమైంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement