-
ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ డిస్మిస్
-
ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ డిస్మిస్
► అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం ► సంస్థను ప్రభావితం చేసేందుకేనని విమర్శలు వాషింగ్టన్: సంచలనాలకు, వివాదాలకు కేంద్రంగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలోని అత్యున్నత దర్యాప్తు విభాగమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కొమెను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ట్రంప్ నేరుగా కొమెకు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను కొమెకు పంపించారు. దీనిలో ‘మీరు బ్యూరోను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారనే అమెరికా అటార్నీ జనరల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెను డిస్మిస్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ ప్రకటించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెను తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా అటార్నీ జనరల్ జెఫ్ సెస్సన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోసెన్స్టెయిన్ సంయుక్తంగా ప్రెసిడెంట్‌కు లేఖ రాయడంతో, వారి వినతిని ట్రంప్ ఆమోదించారని సీన్ స్పైసర్ వెల్లడించారు. ఈనిర్ణయం తీవ్ర సంచలనం సృష్టించింది. సరైన సమాచారం ఇవ్వనందునే... రష్యాతో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావితం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే.. క్లింటన్ ఈ–మెయిల్స్ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్‌కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా పదేళ్లు పదవిలో కొనసాగాల్సిన కొమె.. నాలుగేళ్లకే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొమె స్థానంలో ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆండ్రూ మెక్కాబెను యాక్టింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇలా తొలగింపునకు గురైన డైరెక్టర్లలో కొమె రెండో వ్యక్తి. 1993లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న విలియమ్ ఎస్ సెషన్స్‌ను అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తొలగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేపట్టిన దర్యాప్తు ట్రంప్‌కు చుట్టుకుంటుందన్న భయంతోనే కొమెను తొలగించినట్లు సెనెట్ నాయకుడు చుక్ షుమెర్ ఆరోపించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఆటో, బైక్ ఢీ : ఒకరికి గాయాలు
జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్ల మధ్య గొడవ
కుల బహిష్కరణపై విచారణ
డెంగీ నివారణకు కదులుదాం
భార్యపై దాడి చేసిన భర్తపై కేసు
ఆలయ మాన్యాలను పరిరక్షించాలి
18న ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్‌పై అవిశ్వాసం
విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
రోడ్డెక్కిన అన్నదాత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement