-
‘నా పిల్లల తండ్రే ప్రధాని కాబోతున్నాడు’
ఇస్లామాబాద్ : మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది.. పాకిస్తాన్ ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి. కానీ ఈ లోపే అభిమానులు తమ భావి ప్రధానిగా మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రకటించేశారు. మొత్తం 272 స్థానాలకుగాను పీటీఐ 120 స్థానాల్లో ఆధిపత్యంలో కొనసాగుతూ, మ్యాజిక్ ఫిగర్ 137 వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇంకా పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఇప్పటి నుంచే ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇమ్రాన్ మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ కూడా ఉన్నారు. 22 years later, after humiliations, hurdles and sacrifices, my sons’ father is Pakistan’s next PM. It’s an incredible lesson in tenacity, belief & refusal to accept defeat. The challenge now is to remember why he entered politics in the 1st place. Congratulations @ImranKhanPTI — Jemima Goldsmith (@Jemima_Khan) July 26, 2018 పీటీపై పార్టీ ముందంజలో ఉండటంతో జెమిమా ‘22 ఏళ్ల అవమనాలకు ఫలితం ఇది’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జెమిమా చేసిన ట్వీట్లో ‘22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, త్యాగాలు, అడ్డంకులు. వీటన్నింటికి ఫలితం నేడు లభించనుంది. నా కొడుకు తండ్రే ప్రధాని కాబోతున్నారు. ఓటమిని అంగీకరించలేని వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ ఫలితం. ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, దాన్ని సాధించడమే ఇప్పుడు మీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. శుభాకాంక్షలు ఇమ్రాన్ ఖాన్’ అంటూ అభింనందనలు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ తన 42 వ ఏట తన వయసులో సగం ఉన్న(21 ఏళ్లు) జెమిమా గోల్డ్ స్మిత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందే జెమిమా ఇస్లాం మతంలోకి మారారు. వివాహమైన కొద్ది కాలానికే ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివాహమైన తొమ్మిదేళ్ల, 2004లో తర్వాత జెమిమా - ఇమ్రాన్లు విడిపోయారు. -
మహిళల సీనియర్ క్రికెట్ జట్టులో జెమీమా
న్యూఢిల్లీ: దేశవాళీ మహిళల క్రికెట్లో దుమ్మురేపుతున్న యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారి ఎంపికైంది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో పాల్గొననున్న మహిళల జట్టులో 17 ఏళ్ల ఈ ముంబై అమ్మాయి చోటు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. 13 ఏళ్ల వయసులోనే అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జెమీమా రోడ్రిగ్స్ అక్కడ సత్తా చాటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు టోర్నీల్లో సెంచరీలు, డబుల్ సెంచరీలతో ఆకట్టుకుంటున్న జెమీమాను ఇటీవలే బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగిన సిరీస్‌కు ఎంపిక చేశారు. ఆ సిరీస్‌లోనూ ఆమె రాణించడంతో సీనియర్ వన్డే జట్టులో స్థానం కల్పించారు. గతేడాది ప్రపంచకప్‌లో భారత్‌ను రన్నరప్‌గా నిలబెట్టిన హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. భారత మహిళల జట్టు ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలతో పాటు 5 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ప్రస్తుతం వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. -
ఖాన్ వద్దు - కమేడియన్ ముద్దు
జెమీమా ఖాన్ ఎవరో గుర్తుందా? క్రికెట్ మన్మథుడు ఇమ్రాన్ ఖాన్ ను ఏరికోరి పెళ్లాడిన బ్రిటిష్ అందగత్తె ఆమె. హాండ్సమ్ పఠాన్ కోసం బ్రిటన్ వదిలి, పాకిస్తాన్‌కు వచ్చి, అక్కడి పద్ధతి ప్రకారం తలపై ముసుగేసుకుని సంచలనం సృష్టించింది అందాల జెమీమా. ఆ తరువాత ఖాన్ గారి జెనానా నుంచి బయటపడి ఇంగ్లండ్ కి చేరుకుంది. ఇటు ఇమ్రాన్ ఖాన్‌కి క్రికెట్ నుంచి పాలిటిక్స్ పై మనసు మళ్లింది. ఇద్దరూ 'నా దారి నాది. నీ దారి నీది' అనేసుకున్నారు. ఇదంతా అయ్యే సరికి జెమీమాకి ఇద్దరు పిల్లలు. ఇప్పుడు జెమీమా రస్సెల్ బ్రాండ్ అనే బ్రిటిష్ కమేడియన్ ప్రేమలో పడింది. ఇంత లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమంటే ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపిస్తున్నారట. జెమీమా వేలికి రస్సెల్ బహుమతిగా ఇచ్చిన వజ్రపుటుంగరం తళుక్కుమంటోంది. అన్నట్టు రస్సెల్ బాబు కూడా సామాన్యుడు కాదండోయ్! కటీ పెర్రీకి ఈ మధ్యే కటీఫ్ ఇచ్చేశాడట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement