-
హెడ్ కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల జులుం!
కణేకల్లు: ‘వాళ్లు ఎవరనుకొంటున్నావ్.. టీడీపీ లీడర్లు.. మా వాళ్లు మమ్మల్ని పలుకరించేందుకు వస్తే అడ్డుకొంటావా..? గంట టైమ్ ఇస్తే మా ప్రతాపమేంటో చూపిస్తాం...’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతిచౌదరి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు కణేకల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుపై జులుం ప్రదర్శించారు. మంత్రి ఉషశ్రీచరణ్ భానుకోట వద్ద సుజలాన్ కంపెనీ భుములను ఆక్రమించారని ఇటీవల దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి శనివారం జిల్లా టీడీపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లాలని యత్నించారు. టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని నోటీసుల ద్వారా సూచించి పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నం, గోళ్ల వెంకటేశులు తమ వాహనాల్లో భానుకోటకు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కణేకల్లు టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా హెచ్‌సీ శ్రీరాములు వారిని అడ్డుకుని అందరూ కాకుండా ఒక్కొక్కరుగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారంతా ఒకే సారి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఉన్నం, వెంకటేశు బయటికొచ్చి పోలీసులపై నానా యాగీ చేశారు. ఏఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..
సాక్షి, కణేకల్లు (అనంతపురం): కాలేజీకని వెళ్లి కనిపించకుండాపోయిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి ఆత్మహత్యతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం మేరకు... గెనిగెర గ్రామానికి చెందిన స్రవంతి (17) కణేకల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. తన స్నేహితుడు ఇటీవల పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి స్రవంతి పూర్తి డిప్రెషన్లో ఉంది. స్నేహితుడు లేని జీవితం శూన్యంగా అనిపించింది. శుక్రవారం కాలేజీకని సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై కణేకల్లు–బళ్లారి రోడ్డు వద్దనున్న బస్టాప్ వరకు వెళ్లింది. అయితే అక్కడి నుంచి కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పుస్తకాలు బస్టాప్ వద్దనున్న ఆలయం ముందు కనిపించడంతో ఆమె కోసం గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు. స్రవంతి శుక్రవారం రోజే హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం యర్రగుంట వద్ద మృతదేహం బయటపడింది. తల్లిదండ్రులు తమ కూతురేనని గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి) -
రికార్డులకెక్కిన ‘షర్మస్’ క్రికెట్ స్టేడియం
సాక్షి, అనంతపురం: తక్కువ ఖర్చుతో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించవచ్చని నిరూపించాడు కణేకల్లు కుర్రాడు. తన ప్రతిభకు పదను పెట్టి ‘ఎస్’ ఆకారంలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని శ్రీ విద్యానికేతన్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మనేగర్ షర్మస్.. గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా మినీ క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించాలో ఆలోచించాడు. ప్రస్తుతమున్న స్టేడియాలకు భిన్నంగా ‘ఎస్’ ఆకారంలో నాలుగు ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తూ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నమూనా రూపొందించాడు. దీని కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అనంతరం తన డెమో గురించి వివరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారికి మెయిల్ పంపగా.. వారు ఇటీవల దాన్ని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు షర్మస్కు మెడల్, సర్టిఫికెట్ పంపారు. ఈ డెమాతో షర్మస్ పలు రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా స్టేడియం నిర్మాణ పేటెంట్ హక్కును కూడా పొందాడు. మంVýæళవారం కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్పర్సన్ ఉషారాణి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ కమ్ కాలేజీ కరస్పాండెంట్ రవికుమార్ అభినందించారు. స్టేడియం ప్రత్యేకతలు ఇలా.. ► క్రికెట్ రెండు వైపుల మాత్రమే(టూఎండ్స్) ఆడాలి. ► షర్మస్ స్టేడియంను 360 డిగ్రీలో నిర్మించడం వల్ల నాలుగు వైపులా ఆడొచ్చు. ► వర్షం వస్తే మ్యాచ్ ఆగినా.. వెంటనే ప్రారంభంమయ్యేలా చర్యలు. ► వర్షపు నీరు వెళ్లేందుకు కింద గ్రాస్‌కు రంధ్రాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ సిస్టమ్. ► హీటింగ్ ప్యాడ్స్ ఉంచడంతో అరగంటలో గ్రౌండ్ అంతా డ్రై అయిపోతుంది. దీంతో వెంటనే ఆటనుప్రారంభించవచ్చు. ► స్టేడియంలో ఎక్కువ మంది కూర్చునేలాæ ఆడియన్స్, వీఐపీ, ఫ్లేయర్స్ కోసం కంపార్ట్మెంట్స్ ఏర్పాటు. ► లోయర్ కంపార్ట్మెంట్, మిడిల్ కంపార్ట్మెంట్, అప్పర్ కంపార్ట్మెంట్ల ఏర్పాటు. ► మిడిల్ కంపార్ట్మెంట్ ఫైబర్ గ్లాస్‌తో ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీల కోసం ఈ గ్యాలరీ రూపొందించి ఏసీ ఏర్పాటు చేసేలా ప్లాన్. ► పైభాగంలో ప్రొటెక్టివ్ వాల్ నిర్మించడం వల్ల సూర్య కిరణాలు స్టేడియంలో పడవు. దీంతో ఆటకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపిన మెడల్, సర్టిఫికెట్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు నేను రూపొందించిన స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తొలుత నాకు ఎస్ ఆకారంలో మినీ స్టేడియం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. గూగుల్‌లో సెర్చ్ చేశాక ఇలాంటి స్టేడియం ఎక్కడా లేదని తెలిసింది. ఆ తర్వాతే నా మేథస్సుకు పదును పెట్టి ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నిర్మించాను. నా ప్రాజెక్ట్ వర్క్, స్టేడియం నమూనాను ఢిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ ద్వారా పంపాను. వాస్తవానికి వారు వచ్చి విజిట్ చేయాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా వారు రాలేదు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు నేను రోటరీ చేయించి ప్రాజెక్ట్ తీరును వివరిస్తూ పంపాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అంగీకరించారు. నాకు మెడల్, సర్టిఫికెట్‌ను కూడా పంపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మెయిల్లో కూడా అప్లోడ్ చేశారు. – మనేగర్ షర్మస్ -
షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..
సాక్షి, కణేకల్లు: కూలి పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద మహిళకు కరెంట్ బిల్లు షాకిచ్చింది. ప్రతి నెలా రూ.100 బిల్లు వస్తుండగా.. ఈ నెల ఏకంగా రూ.1,49,034 రావడంతో ఆమె నోటి నుంచి మాట రాలేదు. కణేకల్లులోని మోడల్ స్కూల్ పక్కనే నివాసముంటున్న కురుబ కామాక్షమ్మ పరిస్థితి ఇది. ఇంత బిల్లు తానెప్పుడు చెల్లించాలో అర్థం కాక లబోదిబోమంటూ, తనకు న్యాయం చేయాలని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఏఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య కారణంగా చోటు చేసుకున్న ఈ తప్పిదాన్ని సరిచేసి, వినియోగించిన యూనిట్ల మేరకే బిల్లు వసూలు చేస్తామని భరోసానిచ్చారు. చదవండి: (కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!) -
మనసు చలించింది...
సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్‌రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్ (సప్తగిరి చిన్న) ఫేస్బుక్లో హలో యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్ ద్వారా చూసిన ఫీడ్ ది హంగర్ ఫర్ కేఎస్కే ఆర్గనైజేషన్ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్కే టీమ్ ఎవరు వీరు.. హైదరాబాద్‌లోని రివ్లోన్ కాస్మోటిక్ కంపెనీలో సౌత్ ట్రైనర్‌గా కావ్య, సేల్స్ మేనేజర్‌గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement