-
తనపై రెండు కేసులు కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్లు
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది ఉమేష్‌చంద్ర చెప్పారు. దీంతో ఈ వ్యాజ్యాలను మరో న్యాయమూర్తి ముందుంచేందుకు ఫైళ్లను సీజే ముందుంచాలని జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు.. -
వైఎస్సార్సీపీలో చేరిన బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరు రఘురామ కృష్ణం రాజు, తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం విజయదశమి రోజు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కృషి చేయాల్సిందిగా జగన్ వారిని కోరారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి భారీగా అనుచరులు తరలివచ్చారు. సమైక్యాంధ్ర కోసం జగన్‌తో కలిశా: రఘురామ కృష్ణంరాజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే వైఎస్సార్సీపీలో చేరానని రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్ సూచనల మేరకే తాను పదిరోజుల క్రితం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశానన్నారు. అది దసరా సెలవుల తరువాత విచారణకు వస్తుందన్నారు. వచ్చే దసరా నాటికి సమైక్య రాష్ట్ర సీఎం పదవిలో జగన్ ఉంటారని విశ్వాసం వెలిబుచ్చారు. కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోని సమైక్యవాదులు కూడా జగన్‌కు మద్దతిస్తారన్నారు. జగన్ సాహసం, పట్టుదల కలిగిన నేత అని, అందుకే ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానన్నారు. జగన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం: బాలశౌరి వైఎస్సార్ మృతి చెందాక రాష్ట్రం అల్లకల్లోలమై పోయిందని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలంటే జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరమని బాలశౌరి అన్నారు. అందుకే వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అన్నారు. విభజనకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖ ను అలుసుగా తీసుకుని కాంగ్రెస్.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిందని విమర్శించారు. రఘురామ కృష్ణంరాజుతోపాటుగా ఉండికి చెందిన నరసింహరాజు, బాలశౌరితోపాటుగా థామస్‌నాయుడు, దుర్గాప్రసాద్‌లు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఎం.సుచరిత, పార్టీ సీజీసీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎం.నాగార్జున, రావి వెంకటరమణ, రాతంశెట్టి రామాంజనేయులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎల్.అప్పిరెడ్డి, అనూప్ శేషగిరిరావు, రాజేంద్రప్రసాద్, షౌకత్, నసీర్ అహ్మద్, జి.చిన వెంకటరెడ్డి, ఎం.విజయలక్ష్మి, అనసూయ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ిపి.సర్రాజు, గ్రంథి శ్రీనివాస్, జిల్లా నేతలు తోట గోపి, చీర్ల రాధయ్య, మల్లు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement