-
సెలబ్రిటీల న్యూడ్ ఫొటోలు లీక్ చేసి..!
- నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు హాలీవుడ్ టాప్ హీరోయిన్లు, మహిళా సెలబ్రిటీల జీమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి న్యూడ్ ఫొటోలను లీక్ చేసిన వ్యవహారంలో తన పాత్ర కూడా ఉందని ఓ వ్యక్తి న్యాయస్థానం ముందు నేరాన్ని ఒప్పుకొన్నాడు. జెన్నిఫర్ లారెన్స్, కేట్ అప్టన్, కిర్‌స్టెన్ డంస్ట్ తదితరులు వందమందికిపైగా సెలబ్రిటీల అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి నగ్న ఫొటోలను 2014 సెప్టెంబర్‌లో 'ద ఫాప్పెనింగ్' పేరిట ఇంటర్నెట్లో పెట్టడం పెనుదుమారం రేపింది. 4చాన్ అనే ఇంటర్నెట్ ఫోరంలో ఈ ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ వ్యవహారంలో కొంతవరకు తన పాత్ర ఉందని అమెరికా పెన్సిల్వేనియాలోని లాంక్స్టర్కు చెందిన ర్యాన్ కొలిన్స్ అనే వ్యక్తి కాలిఫోర్నియా జిల్లా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. అయితే సెలబ్రిటీల ఫొటోలు ఇంటర్నెట్లో పోస్టు చేయడంగానీ, లీక్ చేయడంగానీ తాను చేయలేదని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని అతను కోర్టుకు తెలిపాడు. అయితే అక్రమంగా ప్రముఖ వ్యక్తుల అంకౌంట్ల యాక్సెస్ పొందిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. ఈ అభియోగం కింద అతనికి 18 నెలల జైలుశిక్ష పడే అవకాశముంది. హాలీవుడ్ హీరోయిన్లకు యాపిల్, గూగుల్ పేరిట బూకటపు ఈమెయిళ్లు పంపి, వారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను అతడు తెలుసుకున్నాడు. ఈ ప్రక్రియను ఆన్లైన్లో 'ఫిషింగ్' అంటారు. ఈ వివరాలతో పలువురి ప్రైవేటు ఈమెయిల్ అకౌంట్లలోకి చొరబడి, వారి నగ్న ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని అతడు లీక్ చేశాడు. సెలబ్రిటీల ప్రైవేటు ఫొటోలు, వ్యక్తిగత సమాచారం లీక్ చేయడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని అతను చెప్తున్నప్పటికీ, ఎఫ్‌బీఐ మాత్రం అతడు చేసింది తీవ్రమైన నేరమని, ఎంతోమంది వ్యక్తిగత జీవితాలతో అతను ఆడుకున్నాడని కోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్ యూజర్లు తమ వ్యక్తిగత అకౌంట్ల పాస్వర్డ్స్ బలోపేతం చేసుకోవాలని, వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే ఏ మెయిల్స్ పట్లనైనా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎఫ్‌బీఐ సూచించింది. -
ఐ డోంట్ లైక్!
క్లబ్‌లు, పబ్బుల్లో కాలక్షేపం చేసే స్వీట్ మోడల్ కేట్ అప్టన్‌కు మందు కొట్టే మగాళ్లంటే అస్సలు గిట్టదంట! వినడానికి వింతగా ఉన్నా... ఈ అమ్మడు మాత్రం సీరియస్‌గానే తన మనసులో మాట బయటపెట్టింది. ‘గడసరి, దురుసుగా ప్రవర్తించే మగాళ్లు నాకు నచ్చరు. మద్యం సేవించిన తరువాత సాధారణంగా వారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో వాళ్లేం చేస్తుంటారో వాళ్లకే అర్థం కాదు. అందుకే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటా’ అంటూ చెప్పుకొచ్చిందీ ఇరవై రెండేళ్ల హాట్ మోడల్. ప్రస్తుతం బేస్‌బాల్ స్టార్ జస్టిన్ వర్లాండర్తో డేటింగ్ చేస్తున్న అమ్మడికి... కట్ అయిన రిలేషన్‌ను మళ్లీ కొనసాగించడంపై అసలు నమ్మకం లేదట! అది వేస్ట్ ఆఫ్ టైమ్ అంటోంది. -
నూడ్ గా ఫోజులివ్వను: కేట్ అప్టన్
లాస్ ఏంజెలెస్: తాను నగ్నంగా ఫోజులివ్వబోనని ప్రముఖ అమెరికా మోడల్ కేట్ అప్టన్ అంటోంది. సోషల్ మీడియా కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను నూడ్ గా ఫోటోలు దిగితే అవి సోషల్ మీడియాలో దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఆమె భయపడుతోంది. నగ్నంగా ఫోజులు ఇవ్వడం ఇష్టమే అయినా, సోషల్ మీడియా కారణంగా ఆ పని చేయలేకపోతున్నానని వాపోయింది 22 ఏళ్ల ఈ అందాల సుందరి. అసలు నగ్నత్వం అనేది ఒక కళ, సౌకుమార్యమైన దేహంతో అందాన్ని ప్రదర్శించడం కూడా ఒక ఆర్టేనని లెక్చర్ దంచింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, కొన్ని బ్లాగుల కారణంగా జాగ్రత్తగా ఉండాల్సివస్తోందని తెలిపింది. అయితే మోడలింగ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేట్ అప్టన్ ఇప్పటికే ఉదారంగా అందాలు ఆరబోసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
మనసున్న ముఖ్యమంత్రి జగన్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement