-
మాజీ మంత్రి కోళ్ల కన్నుమూత
లక్కవరపుకోట : ఉత్తరాంధ్ర రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు (86) శనివారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి పరిస్థితి విషమించి 12.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఐదు గంట లకు కోళ్ల స్వగ్రామం ఖాసాపేట శివారు ముత్యాలమ్మపాలేనికి ఆయన భౌతిక కాయూన్ని తీసుకువచ్చారు. అప్పటికే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో గ్రామం లో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కిమిడి మృణాళిని, ఎమ్మెల్యేలు ఆర్వీఎస్కే రంగారావు, కేఏ నాయుడు, పి.నారాయణస్వామినాయుడు, బండారు సత్యనారాయణ, వి.రామకృష్ణబాబు, పీలా గోవింద శ్రీనివాసరావు, గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, పడాలఅరుణ, మత్స మణికుమారి, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ బి.రామారావు, ఆర్డీఓ జె.వెంకటరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు గద్దే బాబూరావు, ఆర్పీ భంజ్‌దేవ్‌తో పాటు ద్వారపురెడ్డి జగదీష్, డాక్డర్ పెద్దినాయుడు, వేచలపు చినరామునాయుడు, యల్లపు దమయంతి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కోళ్ల పార్దీవ దేహం వద్ద నివాళులర్పించారు. కోళ్ల మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సమాచారం తెలుసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యే లలితకుమారిని ఫోన్లో పరామర్శించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో... ముత్యాలమ్మపాలెం(లక్కవరపుకోట) : మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో జరిగాయి. కోళ్ల వ్యవసాయ క్షేత్రంలో ఆర్డీఓ జె.వెంకటరావు పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. పెద్ద కుమారుడు రాంప్రసాద్ కోళ్ల చితికి నిప్పటించారు. ముందుగా కోళ్ల పార్దీవ దేహానికి వేదపండితులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కోళ్ల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి... శృంగవరపుకోట/లక్కవరపుకోట : సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కోళ్ల అప్పలనాయుడు సర్పంచ్ స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లాకే రాజకీయ రంగంలో వన్నె తెచ్చారు. అజాతశత్రువుగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. 1951లో ఖాసాపేట పీఏసీఎస్ డెరైక్టర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన కోళ్ల సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా..ఏడుసార్లు గెలిచి ప్రజాభిమానం పొందారు. చంద్రబాబునాయుడు హయూంలో ప్రొటెం స్పీకర్‌గా కూడా పని చేశారు. కోళ్లకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా... ఇటీవల రెండో కుమారుడు మోహన్ మృతి చెందారు. -
మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూత
విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రిచ దాటిన తర్వాత మృతి చెందారు. ఆయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన రెండవ కుమారుడు ఇటీవలే మరణించారు. అప్పలనాయుడు 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 1985, 89లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కొంతకాలం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 199లో ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement