-
'చీరల పంపిణీ అట్టర్ ఫ్లాప్'
హైదరాబాద్: బతుకమ్మ చీరల పేరుతో తెలంగాణ మహిళా లోకాన్ని ప్రభుత్వం అవమాన పరిచిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చేనేత చీరలు ఇస్తామని చెప్పి నాసిరకం చీరల అంటగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదు. చీరల కోసం లైన్లో నిలబడిన మహిళలు ఈ నాసిరకం చీరలను చూసి బేజారయ్యే దగ్ధం చేస్తున్నారు. చీరల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ కుంభకోణంపై సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. రాష్ట్ర మహిళాలోకానికి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
'పిట్ట కథలతో మోసం చేస్తున్నారు'
సాక్షి, హైదరాబాద్: పిట్టకథలు, మాయమాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలను ఇచ్చి నెరవేర్చకపోవడంతో దళితులు, యువకులు తీవ్ర ఆవేదనకు, మనస్థాపానికి గురై ప్రాణత్యాగాలకు పాల్పడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ది దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని, ఆ భూమికోసం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిముందు ప్రాణత్యాగాలకు పాల్పడాల్సిన దుస్థితి ఎందుకని కృష్ణసాగర్‌రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్పై పెట్టుకున్న ప్రజల ఆశలన్నీ అడియాశలయ్యాయని, గులాబీ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అబద్దాలేనని విమర్శించారు. హామీల సాధనకోసం పోరాడుదామని, ఆత్మత్యాగాలకు పాల్పడొద్దని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే రసమయి ప్రజలకు వివరణ ఇవ్వాలని కృష్ణసాగర్‌రావు డిమాండ్ చేశారు. గతంలో ఉన్న 10 జిల్లాల్లో పరిపాలన సాధ్యంకాని ముఖ్యమంత్రి కేసీఆర్ 31 జిల్లాలను ఎందుకు చేశారో అర్థంకావడం లేదన్నారు. నిర్మలా సీతారామన్‌కు రక్షణశాఖ బాధ్యతలను అప్పగించడంద్వారా మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందన్నారు. ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరుతున్నదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement