-
మాఫీ పేరుతో రైతులను నిండా ముంచిన బాబు
అమలాపురం : రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతును నిండా ముంచారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, పినిపే విశ్వరూప్ విమర్శించారు. బాబు రుణ మాఫీ మోసాలపై ఈనెల 31న, ఫిబ్రవరి ఒకటో తేదీన పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తణుకులో నిర్వహిస్తున్న దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమలాపురంలో గురువారం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. దీనిలో ముఖ్యఅతిథులుగా చిట్టబ్బాయి, విశ్వరూప్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల రుణాలన్నీ తానే చెల్లిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా రుణమాఫీ సక్రమంగా అమలు చేయకుండా బాబు రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశానంతరం వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయాలంటే రూ.84 వేల కోట్లు అవసరమని, కేవలం రూ. అయిదు వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాపీ ఎలాంటి ప్రకటనా చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రతి కుటుంబానికీ ఇల్లు ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి బాబు దగా చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి రుణమాఫీ సాధ్యం కాదని ఎన్నికలకు ముందే వాస్తవ పరిస్థితిని చెప్పినా బాబు సాధ్యం కాని హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. బాబు బూటకపు హామీలపై జగన్మోహన్రెడ్డి రైతు పక్షాన పోరాడుతున్నారని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కో-ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, పట్టణ, రూరల్ కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జంపన రమేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. బండార్లంకలోని శ్రీరామ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో తొమ్మిది శెట్టిబలిజలపాలాల్లోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సుమారు 500 మంది శనివారం చిట్టబ్బాయి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సంఘ గౌరవాధ్యక్షుడు గుత్తుల రామకృష్ణ, అధ్యక్షుడు కండిబోయిన వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు దంగేటి బుల్లబ్బాయి, దంగేటి మహేష్, దొంగ రాఘవ, అప్పారి శ్రీను, గుత్తుల ఏసుబాబు, దంగేటి సత్తిపండు, వాసంశెట్టి సత్తిపండు, మట్టపర్తి బూరయ్య, దంగేటి వీరవెంకట సత్యనారాయణ, దంగేటి శ్రీను, దంగేటి వెంకట్రావు, కడలి రాజు, దంగేటి చిన్న, రాయుడు రామకృష్ణ, మామిడిశెట్టి గంగాధరరావు, దంగేటి సుబ్రహ్మణ్యంతోపాటు 500మంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి చిట్టబ్బాయి, బాబూరావు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పట్టణ, మండల కన్వీనర్లు ఎం. నాగేంద్ర, పి. శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ కుడుపూడి బాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసరావు, వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం పాల్గొన్నారు.
క్యాబ్ డ్రైవర్‌తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్‌తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement