-
రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా!
సాక్షి, జడ్చర్ల టౌన్: ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా.. చచ్చినాక నవ్వలేమురా.. ఎంత ఏడ్చినా బతికిరామురా.. అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన గీతం అక్షరసత్యం. అసలు ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. మీ సందేహం సబబే. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం అందుకే ఆ ఉపోద్ఘాతం. నవ్వు గురించి చెబుదామనిపించి అలా ఆ గీతంతో మొదలుపెట్టాం. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నవ్వుల దినోత్సవం ఏర్పాటయ్యింది. నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కాస్త నవ్వుకుంటూ నవ్వు వెనకాల ఉన్న చరిత్రను తెలుసుకుందాం పదండి. నవ్వులకూ ఓ శాస్త్రం నవ్వడం వల్ల శరీరంలో కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు మానసిక వైద్యశాస్త్రంలో జిలోటాలజి అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. మహబూబ్‌నగర్, జడ్చర్లలో.. మహబూబ్‌నగర్, జడ్చర్లలోనూ లాఫింగ్ క్లబ్‌లు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ క్లబ్‌లు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. క్లబ్ సభ్యులు ప్రతిరోజు పరిమితంగా కలుసుకోవడం, హాయిగా జోకులు వేసుకుంటూ నవ్వడం చేస్తున్నారు. నవ్వడం, నవ్వించడం ఓ కళగా క్లబ్ సభ్యులు చెబుతుంటారు. యోగాసనాలు వేశాక చివరగా రెండు నిమిషాలు తప్పనిసరిగా లాఫింగ్ థెరపీ చేస్తుంటారు. తద్వారా అప్పటి వరకు యోగాసనాలతో మానసిక, శారీరకమైన అలసట నుంచి బయట పడేందుకు అలా చేస్తుంటారు. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు ► నవ్వు యోగా కామెడీ కాదని ఆరోగ్య శ్రేయస్సు కోసం నిర్వహించే వ్యాయామ ప్రక్రియగా చెబుతున్నారు. ► నవ్వడం వల్ల శారీరక విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నవ్వడం వల్ల అలా నవ్విన వ్యక్తికి 45 నిమిషాలపాటు కండరాలు సడలించబడి ఒత్తిడిని తగ్గిస్తుంది. ► నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి హార్మోన్లు తగ్గి రోగనిరోధక కణాలు పెరుగుతాయి. ► నవ్వు రక్తనాళాల పనితీరు మెరుగుపరచడం వల్ల రక్తప్రసరణ పెరిగేలా చేసి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ► రోజుకు 10 నిమిషాలు నవ్వడం వల్ల శరీరంలోని 40 కేలరీల కొవ్వును కరిగిస్తుంది. కోపాన్ని తగ్గింపజేసి ఆయుష్షును పెంచడానికి దోహదపడుతుంది. -
ఒక నిమిషంలో 37 జోకులు!
విశాఖపట్నం: ఒక్క నిమిషంలో 37 జోకులు... 10 గంటలు ఏకధాటిగా 40 వైవిధ్య పాత్రాభినయాలు ఆహుతులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. లాఫర్స్ ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానవనంలోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఆదివారం ఈ కార్యక్రమానికి వేదికైంది. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు లిమ్కా రికార్డు కోసం ఒక నిమిషం నిడివిలో అత్యధిక జోకులు చెప్పి నవ్వులు పూయించారు. ఏ వర్గాన్నీ నొప్పించని, క్లుప్తమైన కొంటె ప్రశ్న, చిలిపి సమాధానం తరహాలో బుల్లెట్ ట్రైన్ వేగంతో ఒక నిమిషం జోకుల పర్వం దూసుకెళ్లింది. ఉదయం 9.52 గంటల నుంచి 9.53 వరకు 37 జోకులతో నవ్వులు కురిపించారు. ఆ వెంటనే 10 గంటలు ఏకబిగిన సుమారు 40 వైవిధ్యమైన పాత్రలను అభినయిస్తూ రంగారావు చేసిన నవ రసావిష్కారం ఆబాలగోపాలాన్నీ కట్టిపడేసింది. సిరి షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏయూ వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, రంగస్థల, సినీ రచయిత, నటుడు కాశీవిశ్వనాథ్, స్టీల్ ప్లాంట్ జీఎం (మెయింటెనెన్స్) ఓఆర్ రమణి, డీజీఎం(ఐసీ) ఎస్ఎస్టీ సామీ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్‌పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement