-
సెల్ఫ్ డ్రైవింగ్ ఓలీలో జాలీగా...
3డీ ప్రింటెడ్ సెల్ఫ్ డ్రైవింగ్ మినీ బస్ "ఓలీ"ని లోకల్ మోటార్స్ ఆదివారం ఆవిష్కరించింది. 12 సీట్ల సామర్థ్యంతో ఆవిష్కరించిన ఈ బస్ ఐబీఎమ్ వాట్సన్ కాగ్నిటివ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ తో రూపొందిన మొదటి వాహనం. అరిజొనాకు చెందిన స్టార్టప్ లోకల్ మోటార్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాన్ బి. రోగర్స్ ఈ బస్ ను అమెరికా రాజధాని వాషింగ్టన్ సిటీల్లో ప్రవేశపెట్టారు. టెక్ పార్టనర్ గా ఐబీఎమ్ ఈ సంస్థకు సహకరించింది. 30 పైగా సెన్సార్లను ఈ వెహికిల్ లో పొందుపరిచారు. దీంతో ప్యాసెంజర్లతో ఓలీ కమ్యూనికేట్ అయ్యేలా ఇది ఓ ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడనుంది. ప్రయాణికుల ఎక్కిన దగ్గర్నుంచి గమ్యస్థానాల్లో దిగే వరకు ఓలీతో సంప్రదింపులు జరుపుతుండొచ్చు. ప్యాసెంజర్లు ఎక్కినప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు ఓలీ స్పందన ఇచ్చేలా ఈ వాట్సన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలతో స్థానిక గమ్యస్థానాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు, చారిత్రాత్మక ప్రదేశాల గురించి ప్యాసెంజర్లు ఓలీకి ప్రతిపాదించవచ్చు. స్మార్ట్, సురక్షితమైన, సుస్థిరమైన ప్రయాణాన్ని ఓలీ ఆఫర్ చేస్తుందని లోకల్ మోటార్స్ సీఈవో రోగర్స్ తెలిపారు. ఇక కంపెనీ నుంచి రూపొందే అన్ని వాహనాలకు ఈ వాట్సన్ టెక్నాలజీతోనే తీసుకొస్తామని రోగర్స్ పేర్కొన్నారు. -
11 గంటల్లో త్రీడీ బస్సు తయార్..!
ఇక్కడ కనిపిస్తున్న మినీబస్సు పేరు ‘ఒల్లి’. అమెరికాలోని వాషింగ్టన్లో గురువారం నుంచి రోడ్డుపై కెక్కింది. ఈ బస్సును కేవలం 11 గంటల్లో తయారు చేయవచ్చు! విద్యుత్తుతో పనిచేస్తుంది కాబట్టి మోటర్‌ను తెచ్చుకుంటే చాలు.. మిగిలిన పనంతా త్రీడీ ప్రింటర్ చూసుకుంటుంది. కేవలం పది గంటల్లో ఈ మినీ బస్సుకు అవసరమైన అన్ని భాగాలను ప్రింట్ చేసేసి ఇస్తుంది. గంట టైమ్‌లో ఈ విడిభాగాలన్నింటినీ అసెంబ్లింగ్ చేసి బస్సును రోడెక్కించవచ్చట! 12 మంది ప్రయాణించేందుకు వీలున్న ఒల్లీ ఒక సెల్ఫ్ డ్రైవర్ మినీబస్సు. అంటే డ్రైవర్ ఉండడు. ఐబీఎం అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ‘వాట్సన్’ పుణ్యమా అని ఒల్లీతో మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్లే మాట్లాడొచ్చు... ‘‘మధ్యాహ్నం 3.30కి అబిడ్స్ దగ్గర పికప్ చేసుకో’ అని స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా చెప్పేయవచ్చు. ప్రస్తుతానికి ఇది వాషింగ్టన్ డీసీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో లాస్‌వెగాస్, మియామీల్లోనూ సేవలు ప్రారంభించవచ్చునని దీని తయారీదారులైన ‘లోకల్ మోటార్స్’ ప్రతినిధులు అంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement