-
గోవాలో మరో అర్ధరాత్రి డ్రామా
పణజీ: గోవాలో వారం తిరిగేలోపే మరోసారి అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ఎంజీపీ ఎమ్మెల్యేలు మనోహర్ అజ్గావోంకర్, దీపక్ పావస్కర్‌లు గోవా అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ మైఖేల్ లోబోకు మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటలకు అందజేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మరో ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గం నుంచి తొలగించారు. తమ పార్టీ శాసనసభాపక్ష వ్యవహారాల్లో బీజేపీ తలదూరుస్తోందనీ, ఆ పార్టీ కుట్రకు పాల్పడుతున్నందున సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. బీజేపీతో కలిసే పార్టీలకు ఇదే గతి: కాంగ్రెస్ గోవాలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలకన్నింటికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. ‘తన మిత్రపక్షాలకు తానే ప్రమాదకారినని బీజేపీ నిరూపించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ మనుగడే ప్రమాదకరమవుతుందన్న విషయాన్ని ఎన్డీయేలోని పార్టీలు గుర్తించాలి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదో గట్టి హెచ్చరిక’ అని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సునీల్ కవఠాంకర్ అన్నారు. -
బికినీ బీచ్... ఎక్కడోచ్!
చదివేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా ఉంది మన రాజకీయ నాయకుల వ్యవహారం. దేశ సంస్కృతిని కాపాడాల్సిన పాలకులే మన సంప్రదాయాలకు పాతర వేస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి అనవసర విషయాలపై హడావుడి చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ వంటి గురించి పట్టించుకోకుండా 'బికినీ'పై బాగా చర్చించుకుంటున్నారు గోవా రాజకీయ నాయకులు. బికినీలు, మినీస్కర్టులను నిషేధించాలని ఓ మంత్రి అంటే... రాష్ట్రానికి అమితాదాయాన్ని ఆర్జించిపెట్టే అందాల దారిని ఎందుకు మూసివేయాలంటూ మరో మంత్రి అడ్డం వేస్తారు. అసలు బీచుల్లో బికినీలు లేకపోతే రాష్ట్రానికి పర్యాటకులు వస్తారా అంటూ గడుసుగా ప్రశ్నిస్తారు. బికినీలు వల్లే బోల్డు గొడవలు అయిపోతున్నాయని వాటిని నిషేధిస్తేగాని రాష్ట్రం ప్రశాంతంగా ఉండదని కూడా అన్నారు కొందరు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ మరో అడుగు ముందుకేశారు. ఏకంగా 'బికినీ బీచ్' పెట్టేద్దామంటూ బేషైన ఐడియా ఇచ్చారు. బికినీ బీచ్‌కు కొన్ని ప్రత్యేకతలుండాయని కూడా ఆయన సెలవిచ్చారు. బికినీ బీచ్ చుట్టూ ప్రత్యేక కంచె ఏర్పాటు చేయాలట. లోపలకు వెళ్లే వారి నుంచి తలా రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు- 'టూ పీస్' టోల్ టాక్స్ వసూలు చేయాలన్నారు. ఇలా చేస్తే పైసలు రావడంతో పాటు పర్యాటకం కూడా పురోభివృద్ధి చెందుతుందని వివరించారు. లావు మామ్లేదర్ 'బికినీ బీచ్' ప్రతిపాదనపై కాంగ్రెస్‌తో పాటు మహిళా హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు. భామామణులను 'బికినీ బీచ్'లకే పరిమితం చేసి స్వేచ్ఛను హరిస్తారా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ కయ్యిమన్నారు. గోవా బీచుల్లో బికినీలు, మినీస్కర్టులను నిషేధించాలని మంత్రి సుదీన్ దావలికర్ కూడా ఇంతకుముందు విమర్శలపాలయ్యారు. గోవా ప్రజలు సంప్రదాయ పద్దతిలో ధోతిలు ధరించి తిరిగాలని ఆయన సలహాయిచ్చారు. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలంటూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ లేఖ రాశారు. 'టూ పీస్'పై టూమచ్ డిస్కషన్ అంటే ఇదేనేమో!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్‌షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement