-
అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ
Indian-origin professor Neeli Bendapudi: భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వచ్చిన బెండపూడి ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!) ఈ మేరకు పెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా పేర్కొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఆమె అకాడమీలో దాదాపు 30 సంవత్సరాలుగా మార్కెటింగ్ విభాగంలో బోధించడమే కాక కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. పైగా ఆమె తన వృత్తిని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది. అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ.."పెన్ స్టేట్ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్ స్టేట్ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం" అని అన్నారు. (చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!) -
హ్యాపీ బర్త్‌డే బరాత్!
ఆదర్శం పుట్టిన రోజూ పండగే అందరికీ! అందరికీనా? అభాగ్యులకు మాత్రం అన్ని రోజుల్లాగే అదొక రోజు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పూనుకుంటుంది. ఇదేమిటో తెలుసుకునే ముందు అభిజిత్ బాజ్‌పాయ్ గురించి తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఢిల్లీలో ఒకరోజు కారులో వెళుతుంటే దూరంగా ఒక దృశ్యం కనిపించింది. కొందరు వీధిబాలలు చిరిగిపోయిన బర్త్‌డే క్యాప్లతో, ఖాళీ కేక్బాక్స్లతో ఆడలాడుకుంటున్నారు. ఈ దృశ్యం అభిజిత్‌ను బాగా కదిలించింది. ‘‘పాపం ఈ పిల్లలకు బర్త్‌డేలు ఉండవు’’ అనుకున్నారు. ఆ రోజంతా ఆఫీసులో ఇదే విషయం గురించి ఆలోచించారు. ఇంటికి వెళ్లిన తరువాత తన ఆలోచనను భార్య సోనమ్‌తో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో అషిలా, లైలా అనే వీధి బాలల పుట్టిన రోజును ఒక వేడుకలా జరిపారు. తాము చేసిన పని గురించి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టారు అభిజిత్. అద్భుతమైన స్పందన మొదలైంది. ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పేరుతో ఒక బృందం తయారైంది. ఈ బర్త్‌డే బరాత్ వీధిబాలలకు పుట్టిన రోజు వేడుకలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తుంది. ఆ రోజు ఆ పిల్లలు ఆటలు ఆడతారు. పాటలు పాడుతారు. బర్త్‌డే కేకు కోస్తారు. కానుకలు తీసుకుంటారు. ఆ రోజంతా ఆనందంలో మునిగి తేలుతారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బరాత్ ఉద్దేశం డబ్బులు ఖర్చు చేయడం కాదు... వీధి బాలల కోసం కాస్త సమయాన్ని కేటాయించడం. ఆ కాసేపైనా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కావడం’’ అంటున్నారు అభిజిత్. వీధిపిల్లలకే కాదు... క్యాన్సర్ బాధిత పిల్లలకు కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంది ‘హాపీ బర్త్‌డే బరాత్’ ‘హాపీ బర్త్‌డే బరాత్’ ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది. ఇప్పుడు ఢిల్లీలోనే కాదు పుణే, ముంబై, కోల్‌కతా, సూరత్, చెన్నై... మొదలైన ప్రధాన పట్టణాల్లో ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’లు జరుగుతున్నాయి. పేద పిల్లల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ‘‘ఈ పిల్లలకు తమ పుట్టిన తేదీ తెలియదు. వయసు తెలియదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు. బర్త్‌డే జరుపు కోలేదు. పుట్టిన రోజు పేరుతో మేము చేస్తున్న ఈ వేడుక వల్ల ఆ రోజు వారి కళ్లల్లో కనిపించిన సంతోషపు వెలుగును ఎప్పటికీ మరిచిపోలేం’’ అంటున్నాడు ముంబైకి చెందిన శరద్ జైన్. ‘‘మామూలు పిల్లలు ఎలాగైతే తమ బర్త్‌డే రోజు స్పెషల్‌గా ఫీలవుతారో... బర్త్‌డే బరాత్ రోజు వీధిబాలలు కూడా అలాగే ఫీలవుతారు. ఆ సమయంలో వారి కళ్లల్లోని ఆనందాన్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది’’ అంటాడు కునాల్. ఆదివారం వచ్చిందంటే సినిమా హాళ్ల వైపు పరుగులు తీసే ప్రీతి పరేఖ్, సలోనీ వర్మలు తొలిసారిగా ‘హ్యాపీ బర్త్‌డే బరాత్ పార్టీ’కి హాజరయ్యారు. వారి స్పందన ఇలా ఉంది... ‘‘మా సన్డే ఫన్ డేగా మారిపోయింది. ఈసారి మేము కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండదలుచుకోలేదు. మేము కూడా ఇలాంటి బర్త్‌డే పార్టీలు చేయాలనుకుంటున్నాం’’ ఈ వీధి బాలల్లో చాలామంది ఫుట్‌పాత్‌లు, చౌరస్తాల దగ్గర చిన్న చిన్న వస్తువులు అమ్ముతారు. బర్త్‌డే పార్టీ వల్ల వారికి వచ్చే చిన్న ఆదాయానికి నష్టం రాకుండా వారి చేతుల్లో ఉన్న వస్తువులను తామే కొనుగోలు చేస్తున్నారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు. విశేషమేమింటే ఈ బర్త్‌డే పార్టీలకు హాజరవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ‘‘బర్త్‌డే గురించి వినడమేగానీ ఇంతకు ముందు ఎప్పుడూ నా బర్త్‌డే జరుపుకోలేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కేకు ఎంతో రుచిగా ఉంది. ఈ రోజు నాకు చాలా మంచి రోజు’’ అంటున్నాడు రవి. సిగ్నల్స్ దగ్గర బెలూన్లు, పూలు అమ్మడం ద్వారా రవి రోజుకు కనీసం వంద రూపాయలు సంపాదిస్తాడు. ఆ మొత్తం ఇవ్వడంతో పాటు రవికి కొత్త బట్టలు, షూస్ కొనిచ్చారు ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ సభ్యులు. వీధి పిల్లలు, అనాథలు కేకు రుచి ఎప్పుడూ చూడకపోవచ్చు. అయితే ‘హ్యాపీ బర్త్‌డే బరాత్’ పుణ్యమా అని తీయటి కేకు రుచి మాత్రమే కాదు... అంతకంటే తీయటి ‘ప్రేమ’ను రుచి చూస్తున్నారు!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement