-
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు
ముంబై : ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇక అబ్బాయి తల్లిదండ్రులైతే, తమ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిలిచి మరీ పిల్లను ఇస్తారంటూ తెగ భరోసాతో ఉండేవారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా తమ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండును అనుకుంటూ జల్లెడ వేసి మరీ సాఫ్ట్వేర్లను వెతికి పట్టుకుని తమ కూతురికిచ్చి కట్టబెట్టేవారు. అయితే తాజాగా ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న లేఆఫ్స్ బెడద, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు తెచ్చిపెడుతోంది. మ్యారేజ్ మార్కెట్లో వారికి ఉన్న పాపులారిటీ అంతకంతకు పడిపోతుందని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ట్రెండ్లు వెల్లడిస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న భారీగా ఉద్యోగాల కోత, ఆటోమేషన్ ప్రభావం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత కల్లలవుతున్న డాలర్ కలలు వీరి డిమాండ్‌కు గండికొడుతున్నాయి. ముఖ్యంగా అరేంజ్ మ్యారేజ్‌ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందట. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కూతురి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్నే అల్లుడిగా కోరుకునేవారు, ఇప్పుడు ఉద్యోగంఎప్పుడు ఊడుతుందో తెలియని వారికి పిల్లను ఎలా ఇచ్చేది అంటూ వెనుకకు జంకుతున్నారని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, బిజినెస్ అల్లుళ్ల కోసం అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువగా కాల్ చేస్తున్నారని తెలిసింది. 2017 ప్రారంభం నుంచి ఐటీ ప్రొఫిషనల్స్ ను అమ్మాయిలు తక్కువగా కోరుకుంటున్నారని షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో షాదీ.కామ్ కూడా ఒకటి. ఇక అమెరికాలో సెటిలైన జీవిత భాగస్వాములను కూడా అమ్మాయిలు తక్కువగా చూస్తున్నారని చెప్పారు. ఈ ట్రెండ్ నవంబర్ నుంచి కొనసాగుతుందన్నారు. ఈ తగ్గింపు నవంబర్‌లో 11 శాతముంటే, ఫిబ్రవరికి వచ్చే సరికి ఇదీ మరింత తగ్గి 15 శాతానికి చేరుకుందని గౌరవ్ తెలిపారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసే వారు స్వదేశ బాటపడుతున్నారు. షాదీ.కామ్‌లోనే కాక, జీవన్‌సాథి.కామ్‌లో కూడా ఇదే ట్రెండ్. దీంతో ఐటీ ప్రొఫిషనల్స్‌కు లేఆఫ్స్ ఇబ్బందులు మాత్రమేకాక, కొత్త కష్టాలు వస్తున్నట్టు తెలిసింది. -
పెళ్లిళ్ల మార్కెట్..
శని, ఆదివారాల్లో ఊర్లలో సంతలు పెట్టడం అలవాటే.. అయితే.. ఇదే రోజుల్లో చైనాలోని షాంగైలోని పీపుల్స్ పార్క్ వద్దకు వెళితే.. అక్కడ మనకు పెళ్లిళ్ల సంత కనిపిస్తుంది! ఇలా వేలాది సంఖ్యలో కాగితాలు వేలాడదీసి కనిపిస్తాయి. పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి బయోడేటాలు ఈ కాగితాల్లోనే ఉంటాయి. వారి వయసు, ఎత్తు, రాశి, ఆదాయం, ఫోన్ నంబర్, తమకు కారు లేదా అపార్ట్మెంట్ ఉందా? వంటి వివరాలన్నీ ఇందులో రాసి ఉంటాయి. అమ్మాయిలు లేదా అబ్బాయిల తాలూకు తల్లిదండ్రులు, బంధువులు ఈ మ్యారేజీ మార్కెట్‌కు వచ్చి.. కాగితాల్లో వివరాలు చూసుకుంటూ పోతారు. తగిన వారు లభిస్తే.. అందులో ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదిస్తారు. తర్వాత షరా మామూలే.. ఇరు కుటుంబాల వారు కలవడం.. మాట్లాడుకోవడం.. పీపీపీ.. డుండుండుం అంటూ పెళ్లి బాజాలు మోగడం వంటివి చకచకా జరిగిపోతాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement