-
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: క్లే కోర్టు సీజన్‌లోని తొలి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో మోంటెకార్లో ఓపెన్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. తన భాగస్వామి రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్)తో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–1, 7–5తో జెమీ సెరాటని (అమెరికా)–ఆండ్రియా సెప్పి (ఇటలీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాదల్ 6–1, 6–3తో బెడెన్ (స్లొవేనియా)పై అలవోకగా గెలిచాడు. తొమ్మిదో సీడ్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–5తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. -
అగస్సీ సరసన జొకోవిచ్
ప్రపంచ టెన్నిస్ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమచేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ ఫైనల్లో జొకోవిచ్ 3-6, 6-3, 7-6 (7/5)తో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఫెడరర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ మూడో సెట్లో 4-5తో వెనుకబడ్డాడు. పదో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకొని ఉంటే ఫెడరర్‌కు టైటిల్ దక్కేది. అయితే పదో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత టైబ్రేక్‌లోనూ పైచేయి సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 9 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఫెడరర్‌కు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 4 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఎండగంట పడకుండా..
పోలింగ్ నిబంధనలు పాటించాల్సిందే..
తస్మాత్ జాగ్రత్త
తప్పక చదవండి
- ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement