-
ఓన్లీ సూపర్‌స్టార్
1970లలో బొంబాయి మొత్తంలో 10 ఇంపాలా కార్లు ఉంటే వాటిలో ఒకటి జూనియర్ మెహమూద్ది. 1960–70ల మధ్య సినిమాల్లో జూనియర్ మెహమూద్ ఒక సూపర్స్టార్లా వెలిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అతని ప్రాభవం వైరల్‌గా ఉండేది. శుక్రవారం జూనియర్ మెహమూద్ కన్నుమూశాడు. అభిమానులు అతని పాత పాటలను, సన్నివేశాలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. ‘హమ్ కాలే హైతో క్యా హువా దిల్ వాలే హై’... పాట ‘గుమ్నామ్’ (1965)లో పెద్ద హిట్. కమెడియన్ మెహమూద్ ఈ పాటకు డాన్స్ చేశాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత 1968లో అదే పాటకు ‘బ్రహ్మచారి’లో జూనియర్ మెహమూద్ డాన్స్ చేశాడు. అతని అసలు పేరు నయీమ్ సయీద్. అప్పటికి అతనికి ఏడెనిమిదేళ్లు కూడా లేవు. తనను ఇమిటేట్ చేసిన నయీమ్ సయీద్‌కు మెహమూద్ ‘జూనియర్ మెహమూద్’ అనే బిరుదు ఇచ్చి ఆశీర్వదించాడు. చనిపోయే వరకూ నయీమ్ అసలు పేరుతో కాకుండా జూనియర్ మెహమూద్గానే గుర్తింపు పొందాడు. 1968–70ల మధ్యకాలంలో జూనియర్ మెహమూద్ సూపర్‌స్టార్‌గా వెలిగాడు. సినిమాకు లక్ష రూపాయలు తీసుకునేవాడు. 1969లో రోజుకు 3000 రూపాయలు చార్జ్ చేసేవాడు. రాజేష్ ఖన్నా, జితేంద్ర, సంజీవ్ కుమార్లాంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేశాడు. ఇంపాలా కారులో తిరిగేవాడు. ఇతను స్టార్ అయ్యే ముందు వరకూ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతని తండ్రి రైల్వే డ్రైవర్. కాని ఆ తర్వాత జూనియర్ మెహమూద్ సంపాదనతో అందరూ స్థిరపడ్డారు. రిలీజైన సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే జూనియర్ మెహమూద్తో పాట తీసి యాడ్ చేసి ఆడించిన సందర్భాలున్నాయి. శుక్రవారం 67 ఏళ్ల వయసులో జూనియర్ మెహమూద్ ముంబైలో కన్నుమూశాడు. భారతీయ చలనచిత్ర చరిత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్‌ను చూసిన జూనియర్ మెహమూద్‌ను అభిమానులు తలచుకుని అతని సినిమా సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. -
మెహమూద్ ఇంటి ఉప్పు
అమితాబ్ బచ్చన్, కమెడియన్ మెహమూద్ ఇంట్లో చాలాకాలం ఆశ్రయం పొందాడని చాలామందికి తెలీదు. అమితాబ్ కెరీర్ తొలిరోజుల్లో మెహమూద్ అతడ్ని తన ఇంట్లో ఉంచుకున్నాడు. తను నిర్మాతగా తీసిన ‘బాంబే టు గోవా’ సినిమాలో హీరో అవకాశం ఇచ్చి పైకి రావడంలో సహకరించాడు. అమితాబ్ స్టార్ అయ్యాక కూడా చెల్లెలు అతడ్ని సొంత సోదరుడిగా భావిస్తూ అతని బాగోగులు చూసేది. అంత క్లోజ్‌గా ఉన్న మెహమూద్, అమితాబ్ ఆ తర్వాత మాటలే లేని దూరాన్ని పాటించారు. ఇండస్ట్రీ అంటే అంతే!
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరోయిన్‌తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు
ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement