-
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
ఎక్కువ కాలం శృంగారం నిరాకరిస్తే.. విడాకులివ్వచ్చు
వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు భర్తకు శృంగారం నిరాకరిస్తే.. అది మానసిక క్రూరత్వమే అవుతుందని.. అలాంటి సందర్భాల్లో విడాకులు ఇవ్వొచ్చని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. గత నాలుగున్నరేళ్లుగా తన భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదని, తనను మానసికంగా హింసిస్తోందని, ఆమెకు ఎలాంటి శారీరక ఇబ్బందులు లేకపోయినా అలా చేస్తోందని.. అందువల్ల తనకు విడాకులు మంజూరుచేయాలని కోరుతూ ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టులో అతడి ఆరోపణలను ఖండించినా, హైకోర్టు మాత్రం అతడికి విడాకులు మంజూరుచేసింది. ఈ కేసులో భర్త తాను తన భార్య వల్ల మానసిక క్రూరత్వానికి గురైనట్లు పూర్తిగా నిరూపించారని.. ఒకే ఇంట్లో ఉం టున్నా సుదీర్ఘ కాలంగా అతడికి సంసార సుఖం లేదని, పైగా ఆమె ఎలాంటి శారీరక వైకల్యంతో బాధపడకపోయినా ఎలాంటి కారణం లేకుండా నిరాకరించారని అందువల్ల విడాకులు ఇవ్వడానికి పూర్తి కారణాలున్నాయని జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇంతకుముందు దిగువకోర్టులో తాను దాఖలుచేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేయడంతో ఆ తీర్పును సవాలుచేస్తూ సదరు భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తమకు 2001 నవంబర్ 26న హర్యానాలో పెళ్లయిందని, తమకు 10, 9 ఏళ్ల వయసున్న ఇద్దు కొడుకులున్నారని భర్త చెప్పాడు. తర్వాత కొంత కాలం నుంచి తన భార్య ఇంటి పనులు చేయడం మానేసిందని, రానురాను ఆమె ప్రవర్తన భరించలేనంతగా మారడంతో తాను, తన పిల్లలు చాలా ఇబ్బందులకు గురయ్యామని చెప్పారు. దాంతో అదే ఇంట్లోని మరో పోర్షన్లో వేరేగా ఉండమని తన తల్లిదండ్రులు తనకు సలహా ఇచ్చారన్నారు. గత నాలుగున్నరేళ్లుగా భార్య తనను దగ్గరకు కూడా రానివ్వడంలేదని వాపోయారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement