-
తెరవకుండానే చదివేస్తుంది!
రోబో సినిమాలోని చిట్టి తరహా రోబోట్‌ని నిజ జీవితంలో మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పుస్తకంలో పేజీలు తెరవకుండానే అందులోని విషయాలను తెలుసుకునేందుకు ఓ వినూత్నమైన స్కానర్‌ను తయారు చేశారు. ఇది దాదాపు 9 పేజీల కట్టలో ఉండే అక్షరాలను ఒకేసారి గుర్తించగలదు. మైక్రో తరంగాలు, పరారుణ కాంతికి మధ్యలో ఉండే టెరాహెర్జ్ రేడియోధార్మికత సాయంతో ఈ స్కానర్ పనిచేస్తుంది. కాగితానికి, దానిపై ఉన్న అక్షరాలకు మధ్య ఉన్న తేడాలను ఈ కాంతి గుర్తించగలదు. 2 కాగితాల మధ్య ఉండే సూక్ష్మమైన గాలిపొర ద్వారా ఈ టెరాహెర్జ్ కాంతి ప్రసారమైనప్పుడు వచ్చే మార్పులను సెన్సార్ల ద్వారా గుర్తిస్తారు. ఈ వ్యవస్థ పనిచేసేందుకు అవసరమైన కంప్యూటర్ అల్గారిథమ్స్‌ను ఎంఐటీ, జార్జియా టెక్ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. -
వ్యోమనౌకలకు ‘మైక్రోవేవ్’ ఇంధనం!
వాషింగ్టన్: అంతరిక్షంలో వ్యోమనౌకలు దూసుకుపోతున్నాయి.. చంద్రుడి మీదకి, భూమి మీదకి వస్తూ, వెళుతున్నాయి.. కానీ వాటి నుంచి ఎలాంటి శబ్దం లేదు.. మంటలు, పొగ, ఉష్ణం వంటివేవీ విడుదల కావడం లేదు.. అసలు వాటిలో ఇంధనమే లేదు.. ఇదేంటి? ఆ వ్యోమనౌకలు ఎలా ప్రయాణిస్తాయని అంటారా? కేవలం ‘మైక్రో తరంగాలు’.. అంటే రేడియోల్లో కార్యక్రమాలను ప్రసారం చేయడానికి వినియోగించే తరంగాలు! ఈ మైక్రో తరంగాలను వినియోగించి వ్యోమనౌకలకు శక్తినిచ్చే ఇంజన్ డిజైన్‌ను నాసా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒక ప్రత్యేకమైన చాంబర్లోకి మైక్రో తరంగాలను ప్రయోగిస్తే... అవి అందులోని అన్ని అంచుల మధ్య బంతిలా అటూ ఇటూ పరావర్తనం చెందడంతో శక్తి ఉత్పన్నమవుతుంది. దీనిని ‘మైక్రోవేవ్ థ్రస్టర్ సిస్టమ్’గా పేర్కొంటున్నారు. ఇందులో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేయడం కోసం సౌరశక్తిని వినియోగిస్తారు. దీనివల్ల ఎలాంటి సాంప్రదాయ ఇంధనాలూ అవసరం లేకుండా వ్యోమనౌకలు పనిచేస్తాయి. కృత్రిమ ఉపగ్రహాలు కక్ష్యలోనే ఉండేలా నియంత్రించేందుకు, గ్రహాంతర ప్రయాణాలకు ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని నాసా శాస్త్రవేత్తలంటున్నారు. అన్నింటికన్నా విశేషం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందటే 2000వ సంవత్సరంలో రోజర్ షాయర్ అనే శాస్త్రవేత్త ‘ఎమ్డ్రైవ్’ పేరుతో ఇదే తరహా ఇంజన్ నమూనాను రూపొందించారు. కానీ అది పనికిరాని పరిశోధన అంటూ.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొట్టిపారేయడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement