-
40 కోట్లు చెల్లించాలంటూ దిగ్గజం మైక్ టైసన్‌పై సివిల్ దావా
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తనకు 5 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఒక మహిళ కోర్టులో సివిల్ దావా వేయడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. 1992లో లిమోసిన్ నగరంలో ఒక పబ్‌లో 18 ఏళ్ల మోడల్‌పై బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం కేసులో దోషిగా తేలిన టైసన్ మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసులో పౌర నష్టపరిహారాన్ని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం సదరు మోడల్.. కోర్టులో సివిల్ దావా సమర్పించారు. 1992లో నైట్‌క్లబ్‌లో మైక్ టైసన్‌ను కలిసినప్పుడు ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె తన సివిల్ దావాలో పేర్కొంది. టైసన్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నానని బాధిత మోడల్ చెప్పారు. తనకు 5మిలియన్ డాలర్ల( సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఇక 1966వ సంవత్సరంలో బ్రూక్లిన్ నగరంలో జన్మించిన టైసన్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా అవతరించాడు. బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌గా నిలిచిన మైక్ టైసన్ పంచ్‌ల దాటికి ప్రత్యర్థులు వణికిపోయేవారు. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! బుమ్రా విషయంలో రోహిత్ శర్మ కీలక అప్డేట్ -
మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను: విజయ్
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కథలో లోపాలున్నా విజయ్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అతని రెండేళ్ల కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించిన మైక్ టైసన్ గురించి విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనను చాలా సందర్భాల్లో తిట్టాడని, ఆ బూతుల్ని తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపాడు. అయితే అవన్నీ టైసన్ కేవలం ప్రేమతోనే అన్నాడని చెప్పుకొచ్చాడు. 'ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తాడు. కానీ పెద్ద సంఖ్యలో జనాల్ని చూస్తే మాత్రం భయపడతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చిన క్రమంలో ఆయన్ని చూడటానికి గుంపులుగా వచ్చిన జనాల్ని చూసి హోటల్ నుంచి బయటికి కూడా రాలేదు' అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. -
మైక్ టైసన్ బర్త్‌డే, స్పెషల్ వీడియోతో విషెస్ తెలిపిన ‘లైగర్’ టీం
ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం, లెజెండరి ఆటగాడు మైక్ టైసన్ లైగర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన చిత్రంలో ఆయన ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే నేడు మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా లైగర్ టీం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. గురువారం(జూన్ 30)మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ టీం ఒక్కొరుగా ఆయనకు బర్త్‌డే విషెస్ చేబుతున్న వీడియోను తాజాగా పూరీ కనెక్ట్స్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. చదవండి: టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఇందులో నిర్మాత కరణ్ జోహార్, హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మి కౌర్, ఇతర నటీనటులతో పాటు చివరగా పూరీ జగన్నాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మైక్ టైసన్, హ్యాపీ బర్త్‌డే అంటూ కరణ్ ఆయనను కొడియాడాడు. ఈ వీడియోలో టైసన్‌కు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా సెట్స్‌లో ఆయన సందడి చేసిన కొన్ని ఆసక్తికర సీన్స్‌తో ఈ వీడియోను మలిచింది చిత్రం బృందం. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేక్షకులను, మైక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో లైగర్ థియేటర్లలో అలరించనుంది. చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్ Team #LIGER Wishes the LEGEND, The One & Only @MikeTyson a very Happiest Birthday! Await to witness the BIG CLASH on the Big Screens 👊🏾 https://t.co/3KLUcGxbFc@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18#LigerOnAug25th pic.twitter.com/03dY12k0v3 — Puri Connects (@PuriConnects) June 30, 2022 -
అభిమాని ఓవరాక్షన్.. చితక్కొట్టిన మైక్ టైసన్, వీడియో వైరల్
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 'లైగర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక టైసన్ బాక్సింగ్ పంచులకే కాక ఆయన సినిమాలకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగానే సెలబ్రిటీలు అంటేనే క్రేజీ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు కనపడగానే ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్ కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం సెలబ్రిటీలకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు ఎదురైంది. దీంతో సహనం కోల్పోయిన టైసన్ సదరు యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్ విమానంలో వెళ్తుండగా ఆయన వెనుక సీట్లో కూర్చున్న యువకుడు టైసన్‌ను చూసి తెగ ఎగ్జయిట్ అయ్యి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో టైసన్ కూడా అతనితో నవ్వుతూనే మాట్లాడాడు. కానీ సదరు యువకుడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటంతో టైసన్ అభ్యంతరం చెప్పాడు. కాసేపు సైలెంట్‌గా ఉండమని కోరాడు. అయినప్పటికీ అతను వినిపించుకోకుండా నస పెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టైసన్ సీట్లో నుంచి లేచి వెనకున్న యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. టైసన్ పంచింగ్ పవర్‌కి సదరు యువకుడి తలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ #miketyson seemed to lose his cool on a #plane on Wednesday night ... repeatedly #punching a man in the face after the guy had apparently annoyed him. Video Footage: TMZ pic.twitter.com/xiy9zgdrhd — 𝘽𝙚𝙨𝙩 𝙀𝙣𝙩𝙚𝙧𝙩𝙖𝙞𝙣𝙢𝙚𝙣𝙩 𝙀𝙫𝙚𝙧🥊🔥 (@NoPlugMedia) April 21, 2022 -
నాపై దయ చూపినందుకు ధన్యవాదాలు: బాక్సింగ్ దిగ్గజం
ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసిన మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. డబ్బింగ్ డన్ అంటూ ‘‘నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి’’ అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్’ రిలీజ్ కానుంది. The final bell has rung!🔔The legend @MikeTyson has completed his dubbing for #Liger.#VaatLagaDenge pic.twitter.com/LTG9tOHVCV— Dharma Productions (@DharmaMovies) April 1, 2022 చదవండి: నువ్ ఏడ్చే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్‌పై కంగనా కామెంట్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement