-
విధి ఆటలో నటినయ్యా
తాప్సీ మంచి నటి మాత్రమే కాదు బహుభాషా ప్రావీణ్యురాలు. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ చిత్రం జాతీయ అవార్డును పొందింది. అలాంటిది తాప్సీకి అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే. టాలీవుడ్‌లోనూ ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఝుమ్మంది నాదం ప్రజాదరణ పొందింది. అయినా అక్కడ కూడా తాప్సీ క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయారు. ఆమె సహ నటీమణులు కాజల్ అగర్వాల్, తమన్న ఆ తరువాత పరిచయమైన సమంత, శ్రుతిహాసన్ వంటి వారు టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. వీరి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. తాప్సీకి మాత్రం ఆశించిన అవకాశాలు లేవు. ప్రస్తుతం ఈమె లారెన్స్ సరసన నటిస్తున్న ముని-3 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. తన కెరీర్ గురించి ఆలోచనలో పడ్డ తాప్సీ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ తాను మంచి అందగత్తెనే. అభినయంలో ఎవరికీ తీసిపోను అన్నారు. అయినా ఆశించిన అవకాశాలు లేవనే బాధను వ్యక్తం చేశారు. అసలు తాను చక్కగా చదువుకుని ఏదైనా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఆశించానన్నారు. తలరాత నటిని చేసింది. సినిమాకు వచ్చి తాను చాలా పెద్ద తప్పు చేశానని అనుకుంటున్నాననే ఆవేదన వ్యక్తం చేశారు. నటినయినందుకు చింతిస్తున్నాను. ఇతరుల కంటే అందం, ప్రతిభ వున్నా తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదు. ఇది నిజంగా బాధాకరమేనని తాప్సీ పేర్కొన్నారు. -
ఆ రెండు సినిమాల్నీ ఒకే టికెట్‌పై చూపించనున్నా!
లారెన్స్... సినీ నృత్యాలను కొత్త పుంతలు తొక్కించిన పేరిది. కొన్నేళ్ల పాటు దక్షిణాదిలో అగ్రశ్రేణి నృత్యదర్శకునిగా వెలుగొందిన ఘనత ఆయనది. మాస్, ముని, డాన్,కాంచన సినిమాలతో దర్శకునిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. త్వరలో ‘గంగ’తో మన ముందుకు రానున్న ఆయన దర్శకునిగా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం... ‘కాంచన’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారేంటి? త్వరగా సినిమా తీసేసి... త్వరగా విడుదల చేసేసి, మంచి హిట్ సాధించాలని.. ఎవరికుండదు చెప్పండి. కానీ... నా టైమే బాలేదు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను. దాంతో ‘గంగ’ (ముని-3) షూటింగ్‌కి పెద్ద విరామమే వచ్చేసింది. అనారోగ్యమేంటి? ‘స్టైల్’ చిత్రంలో మీరు చూసే ఉంటారు. క్లైమాక్స్‌లో ప్రభుదేవాగారిని భుజాలపై ఎక్కించుకొని డాన్స్ చేస్తాను. ఆ సినిమా కోసం నేను చేసిన ఆ సాహసమే నాకు కష్టాలు తెచ్చిపెట్టింది. అప్పుడే.. నొప్పి చేసి డాక్టర్‌కి చూపించుకుంటే... మెడ చేరువలో ఉన్న వెన్నెముక భాగంలో ఇబ్బంది ఏర్పడిందని తేల్చారు. మూడు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. వైద్యుల మాట లక్ష్యపెట్టకుండా నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. ‘కాంచన’ దాకా ఎలాంటి ఇబ్బందీ తెలీలేదు. ‘గంగ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందనగా... ఒక్కసారిగా లొకేషన్లో పడిపోయాను. పరీక్షలు నిర్వహించాక, నా నిర్లక్ష్యం వల్ల గాయం ఇంకాస్త డిస్ట్రబ్ అయ్యిందని తేలింది. అందుకే... ఈ దఫా ‘అయిదు నెలలు విశ్రాంతి’ అన్నారు. దాంతో ‘గంగ’ షూటింగ్ ఆపేసి, విశ్రాంతి తీసుకుంటున్నాను. మరి... మళ్లీ రంగంలోకి దిగేదెప్పుడు? ‘గంగ’ క్లైమాక్స్ మినహా పూర్తయింది. త్వరలోనే పతాక సన్నివేశాలు తీసేస్తాను. డిసెంబర్లో సినిమా విడుదల చేస్తాం. ‘కాంచన’లో స్ల్పిట్ పర్సనాలిటీ అద్భుతంగా పండించారు కదా. ఇందులో అలాంటి ప్రయోగం ఏమైనా ఉందా? ఇందులో ఏకబిగిన ఏడు కేరక్టర్లలో కనిపిస్తా. ఆ వివరాలు ఇప్పుడే బయట పెట్టలేను. అది తెరపై చూస్తేనే బావుంటుంది. ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా తీస్తామన్నారు కదా? అవును.. అజయ్‌దేవగణ్ హీరో. అయితే శరత్‌కుమార్ పోషించిన పాత్రకు సరైన స్టార్ కోసం చూస్తున్నాం. ‘గంగ’ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రయోగం చేయనున్నాను. ఆ తర్వాత బాలీవుడ్లో ‘కాంచన’ తీస్తా. ఏంటా ప్రయోగం? ‘ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు’.... ఈ అయిదు నెలల విశ్రాంతి సమయంలో నాకొచ్చిన ఓ వెరైటీ ఆలోచన ఇది. ఇంట్రవెల్ వరకూ గంటన్నర పాటు ఓ సినిమా. ఇంట్రవెల్ తర్వాత గంటన్నర పాటు మరో సినిమా. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపించాలనుకుంటున్నాను. కథలు కూడా రెడీ చేశాను. తొలి గంటన్నర సినిమా పేరు -‘ముసలోడు’. రెండో గంటన్నర సినిమా పేరు - ‘ది లేటెస్ట్’. రెండింటికీ దర్శకుణ్ణీ, హీరోనూ నేనే. ‘ముసలోడు’లో హీరోయిన్గా ఆండ్రియాను ప్రయత్నిస్తున్నాను. ‘ది లేటెస్ట్’లో మాత్రం లక్ష్మీరాయ్ కథానాయికగా నటిస్తారు. ఆ సినిమాలు ఏ తరహాలో ఉంటాయి? ‘ముసలోడు’ సందేశాత్మకంగా ఉంటుంది. ఓ విధంగా ‘కాంచన’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లాంటి భావన కలుగుతుంది. అలాగని వినోదానికి దూరంగా ఉండదు. రెండు పాటలు, ఒక ఫైట్ కూడా ఉంటాయి. ఇందులో నేను ముసలివాడి గెటప్‌లో కనిపిస్తా. ఇక ‘ది లేటెస్ట్’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో అత్యాధునికంగా కనిపిస్తా. రెండు కథలకూ అస్సలు సంబంధం ఉండదు. తొలి సినిమా కాగానే ‘శుభం’ కార్డ్ పడిపోతుంది. తర్వాత టైటిల్స్‌తో రెండో సినిమా మొదలవుతుంది. ఈ వెరైటీ ఆలోచన ఎలా వచ్చింది మీకు? డాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడే కొత్తదనం కోసం పాకులాడేవాణ్ణి. కొత్త కొత్త స్టెప్స్ సృష్టించేవాణ్ణి. దర్శకుడయ్యాక కూడా ఆ బుద్ధి పోలేదు. ఒక్కసారి హాలీవుడ్ సినిమాలు చూడండి. గంటన్నరలో అన్నీ చెప్పేస్తున్నారు వాళ్లు. మనం మాత్రం ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు. అందుకే ఈ కొత్త ప్రయత్నం చేయనున్నాను. నేను ‘కాంచన’ చేయగానే... ఇప్పుడు అందరూ హారర్ కామెడీ వైపు చూస్తున్నారు. రేపు ఈ ట్రెండ్ కూడా మొదలవుతుందేమో. అంతా రాఘవేంద్రస్వామి దయ. మరి కొరియోగ్రఫీ? చేస్తున్నానుగా.. అది అదే.. ఇది ఇదే. తుది శ్వాస విడిచేవరకూ డాన్స్‌ను నేను విడిచిపెట్టను. ఈ విశ్రాంతి పుణ్యమా అని కుటుంబానికి కొన్నాళ్లయినా దగ్గరగా ఉన్నారు కదా? అవునండీ... నా ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా ఉంది. నాకు టెన్త్ చదివే కొడుకున్నాడు తెలుసా! బుర్రా నరసింహ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement