-
ఆ పాట ఎంత బాగా వచ్చిదంటే..
పటాస్, సుప్రీమ్, ఈడో రకం.. ఆడో రకం, రాజుగారి గది వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్. ప్రస్తుతం ఆయన ‘22’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సాయికార్తీక్‌తో ఇంటర్వ్యూ.. 22 మూవీ ఎలా ఉండబోతుంది? నేను చేస్తున్న మొదటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా `22'. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా నిర్మిస్తున్నారు. బి.ఎ రాజు గారి అబ్బాయి శివ దర్శకుడిగా పరిచమవుతున్నారు. రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లు. కాన్సెప్ట్ చాలా బాగుంది.ఒక కొత్త తరహాలో సినిమా ఉంటుంది. హీరోగా రూపేష్‌కు, దర్శకుడిగా శివకు ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో బి.శివకుమార్ అనుభవం సంపాదించుకున్నారు. సంగీతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది? యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే థ్రిల్లర్ సబ్జెక్టు కాబట్టి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాకి వర్క్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ స్కోప్ ఉంది. హీరో, హీరోయిన్స్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి మంచి ఎలివేషన్స్ కుదిరాయి. డిఫరెంట్ క్రైమ్ కంటెంట్‌తో వస్తున్న ఈ ప్రాజెక్టులో మూడు పాటల్ని దర్శకుడు శివ డిజైన్ చేశాడు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసిన`మార్ మార్ కే` సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే మరో పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నా. ఈ పుట్టినరోజు స్పెషల్? స్పెషల్ అంటూ ఏమీ లేదండి. 22 సినిమా యూనిట్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా 37వ పుట్టినరోజు. నా తొమ్మిదవ ఏట నుండే రిథిమ్ ప్లేయర్ గా పనిచేశాను. తరువాత విజయ్ ఆనంద్ గారి దగ్గర నుంచి దేవిశ్రీ ప్రసాద్ వరకు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర డ్రమ్మర్‌గా పనిచేశాను. తరువాత నేను కంపోజర్‌గా మారి పరిశ్రమలో పదేళ్ల కెరీర్ పూర్తయింది. ఇప్పటివరకూ దాదాపు 75 సినిమాలకు సంగీతం సమకూర్చాను. ‘నాలో చిలిపి కలా.. నీలా ఎదురైందా’ పాట మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పటికి దాదాపు 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇంకా మంచి పాటలందించాలన్న నిశ్చయంతో వున్నా. పదేళ్ల కెరీర్ ఎలా అనిపిస్తుంది? టెక్నీషియన్‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. కెరీర్ పరంగా నాకు సంగీతం మాత్రమే తెలుసు అదే రంగంలో ఉన్నాను. హిట్ కొడితేనే అవకాశాలు వస్తాయి అంటారు. నా విషయంలో అలా లేదు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా పదేళ్లుగా కెరీర్ నడుస్తోంది. నా వరకు ప్రతి సినిమాకు బెస్ట్ ఇస్తూనే వచ్చాను. నేను న్యాయంగా పనిచేస్తాను. ఇక్కడ టైమ్, అదృష్టం ముఖ్యం. 2014 నుంచి 16 వరకూ మూడేళ్లలో 36 సినిమాలు చేసే అవకాశం దొరికింది. ఆడియెన్స్ అభిరుచి ఎలా ఉంది? ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పాటలకు మంచి గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంది. ఎన్నో మార్పులు చూస్తున్నాం. గతంలో ఏదైనా ఒక మార్పు చోటు చేసుకోవాలంటే ఐదేళ్లు పట్టేది. ఇపుడు రెండు, మూడు నెలల్లో మారిపోతోంది. నాకు మెలొడీ పాటలు అంటే చాలా ఇష్టం. అయితే ఎక్కువ మెలోడీలు చేసే అవకాశం రాలేదు. 22లో మంచి మెలోడీగా మదర్ సెంటిమెంట్ సాంగ్ చేశా. అది ఎంత బాగా వచ్చిందంటే ప్రతి సంవత్సరం మదర్స్‌డే కి ఈ పాట ప్లే అవుతుంది. త్వరలో మీరు వింటారు. తదుపరి చిత్రాలు? ప్రస్తుతం ఏకే ఏంటర్‌టైన్‌మెంట్స్‌తో `బంగారు బుల్లోడు`సినిమా చేస్తున్నా. నరేష్‌తో ఒక ప్రాజెక్టు, కొత్త హీరోతో మరొకటి, అలాగే కన్నడంలో రెండు సినిమాలతో బిజీగా వున్నా. -
ఈ బ్రేక్ కోసమే ఏడేళ్లు ఎదురు చూశా!
- సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ‘‘ఇటీవల విడుదలైన ‘పటాస్’ కమర్షియల్‌గా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ బ్రేక్ కోసమే ఏడేళ్లుగా ఎంతో ఓపికగా సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు పెద్ద చిత్రాలకు కూడా అవకాశం వస్తోంది. ‘సాయి మంచి పాటలిస్తాడు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేస్తాడు’ అనే పేరు తెచ్చుకోగలిగాను. ఆ పేరు నిలబెట్టుకుంటాను’’ అని సంగీతదర్శకుడు సాయి కార్తీక్ చెప్పారు. నేడు సాయి కార్తీక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్, ఇతర విశేషాల గురించి సాయి మాట్లాడుతూ - ‘‘మాది ఒంగోలు. మా నాన్నగారు తబలిస్ట్. అమ్మ గాయని. దాంతో నాకూ సంగీతం మీద మమకారం ఏర్పడింది. సంగీతదర్శకుడు కావాలనే ఆశయంతో కోటి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ వంటి సంగీత దర్శకుల దగ్గర ‘లైవ్ డ్రమ్మర్’గా చేశాను. ‘కాల్ సెంటర్’ సినిమాతో సంగీతదర్శకునిగా పరిచయం అయ్యి, ఇప్పటికి దాదాపు 20 చిత్రాలకు పాటలు స్వరపరిచాను. గత రెండేళ్లుగా నా కెరీర్ చాలా బాగుంది. రాంగోపాల్వర్మగారితో ‘రౌడీ’ సినిమా చేయడం, కృష్ణవంశీగారితో ‘పైసా’ చేయడం నా అదృష్టం. ‘ఈ మధ్య కాలంలో నేను చేసిన చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్’ గురించి కూడా అందరూ మాట్లాడుకున్న సినిమా ‘రౌడీ’యే అని వర్మగారు అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. ‘జెండా పై కపిరాజు’, ‘ప్రతినిధి’ బ్యాగ్రౌండ్ స్కోర్ విని, కృష్ణవంశీగారు ‘పైసా’కి అవకాశం ఇచ్చారు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘టాప్ 10’ ఆల్బమ్స్‌లో ‘పైసా’ ఉండటం ఓ ఆనందం’’ అని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement