-
చైతన్య భారతి: అణుశక్తిమాన్
ఒకసారి ఒక పాత్రికేయుడు, హోమీ భాభాతో ఆయన వివాహం గురించి అడిగారు. అప్పుడు ఆయన, ‘‘నేను సృజనాత్మకతను పెళ్లాడాను’’ అని చెప్పారు. నిపుణులైన వ్యక్తుల చుట్టూ ఉత్కృష్టమైన సంస్థలను సృష్టించడం ఆయన శైలి. అందుకు తగ్గట్లే, ట్రాంబేలో ఏర్పాటు చేసిన అణుశక్తి సంస్థకు ఆయన పేరు కలిసి వచ్చేలా ‘బార్క్’ (భాభా అణు పరిశోధనా కేంద్రం) అని పేరు పెట్టారు. భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి రూపశిల్పి అయిన హోమీ జహంగీర్ భాభా ఇంజనీరింగ్ డిగ్రీ చదవడం కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. నిజానికైతే విజ్ఞాన శాస్త్రంలో ప్రాథమిక పరిశోధన చేయడం అంటే ఆయనకు పంచప్రాణాలు. 1939 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి.రామన్ దగ్గర పని చేశారు. ‘‘ప్రపంచంలో ముందంజలో నిలవదలిచిన ఏ దేశమూ మౌలిక లేదా దీర్ఘకాలిక పరిశోధనను నిర్లక్ష్యం చేయలేదు..’’అని భాభా ఒకసారి అన్నారు. భారతదేశాన్ని అణుశక్తి సంపన్న దేశంగా తీర్చిదిద్దడానికి తొలి చర్యగా ఆయన ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్) ను స్థాపించారు. 1945లో ఆరంభమైన ఈ సంస్థ మౌలిక విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యానికి కృషి చేసింది. ఇక, 1948లో భారతదేశ అణుశక్తి కార్యక్రమానికీ ఆయనే రూపకల్పన చేశారు. ఆయన కృషి ఫలితంగా భారతదేశం దాదాపు 50 ఏళ్ల క్రితమే ఓ పరిశోధక అణు రియాక్టర్‌ను డిజైన్ చేసింది. అణుశక్తి కార్యక్రమంతో పాటు తొలినాళ్లలో దేశ అంతరిక్ష కార్యక్రమానికి బీజం వేసి, పెంచి పోషించడంలో కూడా హోమీ భాభా కీలక పాత్ర వహించారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి గట్టి మద్దతు, అమోదముద్ర లభించడంతో దేశాన్ని అణుశక్తియుత దేశంగా మార్చాలన్న భాభా కల నెరవేరింది. భాభా బహుముఖ పార్శా్వలున్న వ్యక్తి. సంక్లిష్ట గణితం గురించి ఆయన ఎంత ధారాళంగా మాట్లాడతారో, పాశ్చాత్య సంగీతంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాల గురించీ అంతే ధారాళంగా మాట్లాడతారు. ఆయన స్వతహాగా చిత్రకారుడు, భవన నిర్మాణ శిల్పి కూడా. ఇక ఆయన వేసిన వర్ణ చిత్రాలు టి.ఐ.ఎఫ్.ఆర్., బార్క్ ప్రాంగణాలలో ఎల్లప్పుడూ ప్రదర్శనకు ఉంటాయి. భారత అణుశక్తి కార్యక్రమం కీలకమైన దశలో ఉండగా, విధి ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించింది. 1966లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఈ భరతజాతి ముద్దు బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. – శ్రీకుమార్ బెనర్జీ, భాభా అణు పరిశోధనా కేంద్రంలో పూర్వపు డైరెక్టర్ (చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు) -
విశ్లేషణం: మనసున్న మాంత్రికుడు
న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్న ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ సినిమాల మీద మక్కువతో తివిక్రమ్ శ్రీనివాస్‌గా మారి... ‘స్వయంవరం’ లాంటి చిన్న సినిమాకు మాటల రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టి... నువ్వే-నువ్వే సినిమాతో దర్శకుడి అవతారమెత్తి... అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది?... సినిమాలతో తన ‘త్రివిక్రమ’ స్వరూపాన్ని చూపించాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన ప్రభావమేమో మాటల తూటాలతో ఆంధ్ర ప్రేక్షకులను మాయ చేసేస్తున్నాడు. మరి ఈ మాటల మాంత్రికుడి మనస్తత్వమేమిటి? మనసు మనిషి... సినిమాల్లో మాటల తూటాలు పేల్చే త్రివిక్రమ్ బయట మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు... ఈ మధ్యనే కొంచెం కొంచెం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... కూర్చుని ఉంటే కాళ్లు ఆడిస్తూ ఉంటాడు. నిల్చున్నా చాలా ఈజ్‌గా ఉంటాడు. తల కొంచెం కుడివైపుకు వంచి, తలాడిస్తూ మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఆయనది అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని చెప్తుంటాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు. మనుషుల గురించి తెలుసుకుంటారు. నచ్చినవారితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వారితో బంధాలకు, బాంధవ్యాలకు ప్రాధాన్యతనిస్తుంటారు. వారితో గడపడానికి ఇష్టపడతారు. గట్టిగా మాట్లాడేవాళ్లంటే ఇష్టపడరు. అందుకేనేమో త్రివిక్రమ్‌కు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌తో అంతగా అనుబంధం కుదిరింది. సునీల్‌తో స్నేహం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యక్తిత్వమున్నవారు బాగా సెన్సిటివ్‌గా ఉంటారు. విషయాలను పర్సనల్‌గా తీసుకుంటారు. త్రివిక్రమ్ ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోవడం, తరచుగా కన్నీరు తుడుచుకోవడం మనం గమనించవచ్చు. అలాగే తరచూ నవ్వుతుంటారు. సూటిగా చూస్తూ మాట్లాడతారు. ఇవన్నీ ఆయన ఎలాంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా వ్యవహరిస్తారని చెప్తుంటాయి. ఆయన మాట్లాడేటప్పుడు స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. మాటల్లో ఒక ఫ్లో, ఒక నిజాయితీ కనిపిస్తుంది. మాటలకు చేతుల కదలికలకు మధ్య చక్కని సమన్వయం కనిపిస్తుంది. రెండూ కలిసి ఒక డ్యూయట్లా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చేతులు ఓపెన్‌గా ఉంటాయి. ఇది ఆయన ఓపెన్నెస్ను చూపిస్తుంది. నిర్ణయాలు కొంచెం నిదానంగా తీసుకోవడం, పనులను వాయిదా వేయడం ఈ మనస్తత్వమున్నవారి బలహీనతలు. అందుకేనేమో త్రివిక్రమ్ సినిమాలు తక్కువగా తీస్తుంటారు. మాటల్లోనూ మనసుంది మాటల గురించి చెప్పకుండా త్రివిక్రమ్ గురించి చెప్తే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. ఏ సినిమాకు కథ రాస్తున్నా, ఎలాంటి కేరెక్టర్‌కు డైలాగ్స్ రాస్తున్నా అందులో రచయిత వ్యక్తిత్వం తప్పకుండా ప్రతిఫలిస్తుంది. త్రివిక్రమ్ సినిమాలు, ఆయన రాసే మాటల్లో ఎక్కడా ద్వంద్వార్థాలు లేకపోవడం, అసభ్యత కనిపించకపోవడం ఆయన పాటించే విలువలకు దర్పణంగా నిలుస్తాయి. పిల్లను ఇచ్చేటప్పుడు డబ్బులు ఉన్నోడా? లేనోడా? అని కాదు, మనసున్నోడా, చెడు అలవాట్లు లేనోడా? అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. ఎక్కడ నెగ్గాలో కాదురా... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. లాజిక్‌లు ఎవరూ నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్లకన్నా బాబాలే బాగా ఫేమస్. ... ఈ మాటల్లో త్రివిక్రమ్ నమ్మే విలువలు, ఆయన సంస్కారం కనిపిస్తాయి, సమాజం పట్ల అవగాహన, అనురక్తి, సెటైర్ వినిపిస్తాయి. అంతేనా... ‘‘సింహం పడుకుంది కదా అని జూలుతో జడెయ్యకూడదురా... అలాగే పులి పలకరించిందికదా అని పక్కన నిలబడి ఫొటో తీయించుకోకూడదురోయ్...’’ అంటూ హాస్యాన్ని కూడా పండించగడు. - విశేష్, సైకాలజిస్ట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement