-
దళిత వర్గమే కానీ... రిజర్వేషన్లు మాత్రం వద్దన్నారు!
ఆమె రాజ్యాంగసభలోని సభ్యురాలైనప్పటికీ కుల ప్రాతిపదికన కేటాయించే రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. మహిళలకూ ప్రత్యేకమైన రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె మరెవరో కాదు.. రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఏకైక దళిత మహిళా రాజ్యాంగ సభ సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని మొత్తం 389 మంది సభ్యులలో 15 మంది మహిళలున్నారు. నాడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు మహిళా సభ్యులు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వీరు మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయలేదు. జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన పుస్తకం 'షీ ది లీడర్: ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో మహిళా రాజకీయ నేతల గురించి లోకానికి అంతగా తెలియని కథనాలను అందించారు. పుస్తకం ప్రారంభంలో 1947, ఆగస్టు 28న షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గం అంశంపై చర్చిస్తున్నప్పుడు.. రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్ అని పేర్కొన్నారు. నాడు సభలో దాక్షాయణి వేలాయుధన్ ఇలా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా నేను ఎటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా లేను. దురదృష్టవశాత్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదం మనపై కొన్ని మచ్చలు మిగిల్చింది. మనం హెచుతగ్గులను చూసి భయపడుతున్నాం. అందుకే ఈ అంశాలన్నింటినీ అంగీకరించవలసి వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును తొలగించలేం. సీట్ల రిజర్వేషన్ కూడా ఒక రకమైన ప్రత్యేక ఎంపిక వంటిదే. అయినా మనం దీనిని సహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అవసరమైన పరిణామం అని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. దాక్షాయణి వేలాయుధన్ ఎవరు? దక్షిణాయణి వేలాయుధన్ 1912, జూలై 15న నేటి ఎర్నాకులం(కేరళ) జిల్లాలోని చిన్న ద్వీపమైన ముళవుకడ్లో జన్మించారు. ఆమె పులయ సమాజానికి చెందినవారు. కుల వ్యవస్థలో వీరి సమాజం అట్టడుగున ఉండేది. ఈ సమాజంలోని వారు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. అంటరానితనం కారణంగా వారు బహిరంగ రహదారులపై నడవడాన్ని కూడా నిషేధించారు. దీనికితోడు ఈ సమాజానికి చెందిన స్త్రీలు తమ శరీరపు పైభాగాన్ని దుస్తులతో కప్పుకోవడాన్ని నిషేధించారు. ఈ విధంగా పులయ సమాజానికి చెందిన మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దళితులకు సంబంధించిన కాయాల్ సమావేశం 1913లో కొచ్చిలో జరిగినప్పుడు వేలాయుధన్ కుటుంబసభ్యులతో పాటు తరలివచ్చారు. అక్కడ వారి సమాజానికి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ఇటువంటి సంఘటనలు వేలాయుధన్ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాయుధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినేట్ అయ్యారు. ఈ కౌన్సిల్ ద్వారా 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు మరోవైపు ఆమె ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్)వారపత్రిక ‘జై భీమ్’లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూవుండేవారు. డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అంబేద్కర్ రాజకీయాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన డిమాండ్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు. దాక్షాయణి వేలాయుధన్ 1978 జూలై 20న తన 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి.. -
అనితకు టికెట్ ఇవ్వొద్దు జనసేన బిగ్ షాక్..!
-
జోనల్ వ్యవస్థను ఒప్పుకోం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభావితమయ్యే వర్గాలతో చర్చించకుండా వాటి పునర్వ్యవస్థీకరణ నిర్ణయం సరికాదని బీజేపీ అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, యువజన సంఘాలతో చర్చించిన తర్వాతనే జోన్లకు తుదిరూపం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర పురోగతిలో సమతౌల్యం లోపించే అవకాశం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఫ్రీ జోనా, ఏడో జోన్ లేదా ఆరో జోన్లో భాగమా అనే అంశం తేలకనే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. -
మన గొప్పలు కాదు... అల్లాహ్ గొప్పలు చెప్పుకోవాలి!
రమజాన్ కాంతులు రమజాన్ ఉపవాసాల విషయంలో కృపాసాగరుడైన అల్లాహ్ పురుషుల కంటె స్త్రీలకే ఎక్కువ రాయితీలు ఇచ్చాడు. స్త్రీలు కష్టాలకు గురి కాకుండా ఉండేందుకు అల్లాహ్ చేసిన మేలు ఇది. అలాగని స్త్రీలు కానీ, పురుషులు కానీ ఉపవాసాలు ఉండడం ద్వారా తామేదో ఘనకార్యం చేశానన్న భ్రాంతి నుంచి బయటపడాలి. ఈ సద్బుద్ధిని, అటువంటి సదవకాశాన్ని అనుగ్రహించిన అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఉపవాసం ఉండి మీరు అల్లాహ్కేదో గొప్ప మేలు చేయలేదు. వాస్తవంగా విశ్వాస భాగ్యంతోపాటు ఉపవాసం పాటించుకునే వెసులుబాటును ఇచ్చి అల్లాహ్ మీకు మేలు చేశాడని గుర్తుంచుకోవాలి. రేపు ప్రళయదినాన మీరు చేసిన నిర్వాకాలకు బదులుగా మీ సత్కర్మలన్నీ బాధితులకు పంచబడతాయి. అప్పుడు మీ వద్ద ఒక్క ఉపవాసం మాత్రమే ఉండిపోతుంది. మీ నిర్వాకం బారిన పడిన బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నా, ఒక్క ఉపవాస పుణ్యం కారణంగా వారందరి బాధ్యతను అల్లాహ్ తీసుకుని మిమ్మల్ని రయ్యాన్ అనే తలుపు గుండా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం మాని అల్లాహ్ గొప్పలు చెప్పుకోండి. ఆయన ఘనతా ఔన్నత్యాలను వేనోళ్ల కొనియాడండి అంటుంది దివ్యఖురాన్. – సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమరీ -
మాటల్లో మృదుత్వం... ఉపవాసి గొప్పతనం!
రమజాన్ కాంతులు పరలోకంలో స్వర్గద్వారాల్లో మనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించే అర్హత పొందటానికి అతి సులభమైన మార్గం రమజాన్ ఉపవాసాలు. అందుకే రమజాన్ ఒక మహత్తరమైన మాసం. దీనిలోని ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఒక నియమానుసారంగా రేయింబవళ్లు గడిపేలా ప్రణాళిక వేసుకోవాలి. అందుకోసం రోజువారీ పనులను బేరీజు వేసుకుని ఏ పని ఏ సమయంలో చేయాలో నిర్ణయించుకుని సాధ్యమైనంత వరకు దాని ప్రకారమే నడచుకోవాలి. చాలామంది మహిళలు తమకు పెద్ద పెద్ద సూరాలు కంఠతా రావని తరావీహ్ నమాజులను అజ్ఞానంతో విడిచిపెడుతుంటారు. అది చాలా తప్పు. కంఠతా వచ్చిన చిన్న చిన్న సూరాలనైనా చదువుకోవచ్చు. నిలబడి చదవలేకపోతే కూర్చొని కూడా చదువుకునే వెసులుబాటు ఉందని గ్రహించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నోటిని అదుపులో ఉంచుకోవాలి. చాడీలు, నోటి దురుసుతనం, కాఠిన్యం, దుర్భాషలకు దూరంగా ఉండాలి. ఉపవాసి గొప్పతనం వారి మాటల మృదుత్వం ద్వారా ఉట్టిపడుతూ ఉండాలి. ఇదే దైవవిశ్వాసానికి చిహ్నం. ఈ సంవత్సరపు రమజాన్ మాసంలో పగలు అధికంగానూ, రేయి తక్కువగానూ ఉంటుంది. అందువల్ల మగ్రిబ్, ఇషా, ఫజ్ర్లు తొందరగా వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఉపవాస వ్రతంలో ఎదురయ్యే బాధలను ఓర్పుతో సహించగలిగితేనే అనంత కరుణామయుడైన అల్లాహ్ ప్రేమామృతాన్ని పొందే అదృష్టం కలుగుతుంది. – తస్నీమ్ జహాన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్‌డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
Advertisement