-
బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే వారం ఐపీవో చేపట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్లోబల్ దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్సన్ సాధించిన నేపథ్యంలో బెక్టర్స్ ఫుడ్ సన్నాహాలు వేగవంతమైనట్లు తెలియజేశాయి. బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు కంపెనీ బన్స్ సరఫరా చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ బెక్టర్స్ క్రీమికా పేరుతో ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. 2018లోనూ.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ త్వరితగతిన అనుమతులు సంపాదించింది. ఒక ప్రయివేట్ రంగ కంపెనీగా 29 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ సాధించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 15కల్లా ఐపీవో ప్రారంభమయ్యే వీలున్నట్లు తెలియజేశాయి. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. తాజా ఇష్యూలో భాగంగా సీఎక్స్ పార్టనర్స్, గేట్‌వే పార్టనర్స్ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దిగ్గజాలతో పోటీ లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
పిజ్జా మజాలు...
దిబ్బరొట్టెకు కాస్త పొగరెక్కువ... పెనం మీద వేస్తే మధ్యకు ఉబ్బుతుంది... డబుల్రొట్టె కూడా అంతే... కాల్చాక డబులవుతుంది... పొగరు విగరెప్పుడూ వగరే కదా! దిబ్బరొట్టెలోని దిబ్బకు కాస్త థిమ్మిసా కొట్టి... డబుల్ రొట్టెను సింగిల్ చేస్తే... వచ్చిన వినయరూపమే పిజ్జా... వినయమనే ఆభరణమొక్కటే నచ్చక... పిజ్జా సాస్తోనూ, వెజ్జీ వ ర్క్స్తోనూ అలంకరించారు. అవే టాప్స్... టాప్స్‌తో భూషించాక టాప్‌గా ఉండకుండా ఎలా ఉంటుంది? అందుకే టాపింగ్స్‌తో టాప్‌గా ఉండే పిజ్జాలు తయారుచేసుకోండి. పిజ్జా మేనమామ మన దిబ్బరొట్టే... దాని పుట్టింటి నిజానిజాలు మనకూ తెలుసు... అందుకే... అప్పుడప్పుడు మాత్రమే... పిజ్జా చేసుకోండి... మజాగా ఉండండి... వెజ్జీ వర్క్స్ కావలసినవి: లెట్యూస్ ఆకులు - కప్పు, చెర్రీ టొమాటోలు - 2; ఫెటా చీజ్ - టేబుల్ స్పూను, పర్మెజాన్ చీజ్ - టీ స్పూను తయారీ: పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక వాటి మీద ముందుగా ఫెటా చీజ్, పర్మెజాన్ చీజ్ వేయాలి. చెర్రీ టొమాటో ముక్కలు, లెట్యూస్ ఆకులు అందంగా అమర్చి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి. పిజ్జా బేస్ కావలసినవి: మైదా - కప్పు ఉప్పు - చిటికెడు బేకింగ్ సోడా/ఈస్ట్ - చిటికెడు నీరు - పావు కప్పు; మోజరెల్లా చీజ్ - తగినంత తయారీ: ఒకపాత్రలో మైదా, బేకింగ్ సోడా/ఈస్ట్, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి. చపాతీ మాదిరిగా ఒత్తి బేకింగ్ ట్రేలో ఉంచాలి. పిజ్జా సాస్‌ను పొరలా పూయాలి. (అంచుల్లో అంగుళం మేర మాత్రం వదిలేయాలి) మోజరెల్లా చీజ్ పూయాలి. మనం ఎంచుకున్న వస్తువులతో టాపింగ్ చేసి అవెన్‌లో ఉంచి సుమారు 30 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. పెప్పరోనీ కావలసినవి: ల్యాంబ్ పెప్పరోనీ సలామీ - 10 ముక్కలు థైమ్ - చిటికెడు తయారీ: పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక ముందుగా చిటికెడు థైమ్ చల్లాలి. ల్యాంబ్ పెప్పరోనీ సలామీ స్లైసులను వరుసక్రమంలో అందంగా అమర్చి అవెన్‌లో అరగంటసేపు ఉంచి దించేయాలి. మార్గెరిటా కావలసినవి: తులసి ఆకులు - పావు కప్పు తయారీ: ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు.పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక దాని మీద ఈ తులసి ఆకులు అందంగా అమర్చి, అవెన్‌లో ఉంచి అరగంటయ్యాక తీసేయాలి. పిజ్జా సాస్ కావలసినవి: టొమాటో ముక్కలు - కప్పు తులసి ఆకులు - 10 ఉప్పు - చిటికెడు మిరియాలపొడి - చిటికెడు ఒరిగానో - పావు టీ స్పూను ఉల్లి తరుగు - పావు కప్పు వెల్లుల్లి రేకలు - 5 (సన్నగా కట్ చేయాలి) తయారీ: టొమాటో తొక్కలను జాగ్రత్తగా తీసి సన్నగా కట్ చేసుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి లేత గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, తరిగి ఉంచుకున్న టొమాటో ముక్కలు, ఉప్పు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. మిరియాలపొడి, ఒరిగానో, తులసి ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. పిరిపిరి చికెన్ కావలసినవి: గ్రిల్డ్ చికెన్ (బోన్‌లెస్) - పావుకప్పు చికెన్ సాసేజ్ - పావు కప్పు చికెన్ సలామీ - పావు కప్పు ఉల్లిచక్రాలు - అరకప్పు కరివేపాకు - నాలుగు రెమ్మలు పిరిపిరి సాస్ - టీ స్పూను తయారీ: పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక గ్రిల్డ్ చికెన్, చికెన్ సాసేజ్, చికెన్ సలామీ వరసగా వేయాలి. వాటి మీద ఉల్లి చక్రాలు, కరివేపాకు, పిరి పిరి సాస్ వేసి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి. హార్వెస్ట్ వెజిటబుల్స్ కావలసినవి: చెర్రీ టొమాటోలు - 10 ఆలివ్స్ - 5 రెడ్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు ఎల్లో క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు గ్రీన్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు పుదీనా ఆకులు - కప్పు తులసి ఆకులు - 5 ఉల్లి తరుగు - పావు కప్పు తయారీ: పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక వాటి మీద ముందుగా రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, గ్రీన్ క్యాప్సికమ్ తరుగు వరుసగా అమర్చాలి. పైన పుదీనా ఆకులు, తులసి ఆకులు, ఉల్లితరుగు వేసి, చివరగా ఆలివ్స్, చెర్రీ టొమాటో ముక్కలు పేర్చి, అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరువాత తీసేయాలి. బెల్జియన్ మీట్ కావలసినవి: గ్రిల్డ్ చికెన్ (బోన్‌లెస్) - పావు కప్పు; చికెన్ మోర్టడెల్లా - పావు కప్పు; చికెన్ సలామీ - పావు కప్పు టర్కీ హ్యామ్ - పావు కప్పు; ఉల్లితరుగు - అర కప్పు; ఆలివ్స్ - 5; తులసి ఆకులు - 5 జలపెనోస్ - 10 ముక్కలు తయారీ: పిజ్జా తయారీకి ఉపయోగించే వస్తువులతో పిజ్జా తయారుచేశాక దాని మీద ముందుగా గ్రిల్డ్ చికెన్, చికెన్ మోర్టడెల్లా, చికెన్ సలామీ వేయాలి. టర్కీ హ్యామ్ వేసి సమానంగా పరచాలి. ఉల్లితరుగు, తులసి ఆకులు, ఆలివ్స,జలపెనోస్ ముక్కలతో అందంగా అలంకరించి అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి. నోట్: ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ సూపర్మార్కెట్లో దొరుకుతాయి. చెఫ్: టి. వరుణ్ కర్టెసీ: రుచి అండ్ ఐడొనీ; రోడ్ నెం.10, బంజారాహిల్స్, హైదరాబాద్ సేకరణ: డా. వైజయంతి ఫొటోలు: మోర్ల అనిల్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement