-
'ప్రణీత దగ్గర సెల్ ఫోన్ లేదు'
బెంగళూరు: జోధ్పూర్ నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని ప్రణీత మెహతా(21) మరణంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. సముద్రపు అలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతే సెల్ఫీ తీసుకుంటూ ఆమె మృతి చెందిందని తప్పుగా రిపోర్ట్ చేసింది. రాజస్థాన్ కు చెందిన ప్రణీత తన ఫ్రెండ్స్ తో కలిసి మే 29న కర్ణాటకలోని గోకర్ణ బీచ్ కు వచ్చింది. ఒడ్డున రాయిపై కూర్చునివున్న ఆమెను సముద్రపు అల లోపలకు లాక్కుపోయింది. దీంతో సముద్రంలో మునిగి ఆమె మృతి చెందింది. 300 అడుగుల లైట్ హౌస్ పైకిఎక్కి సెల్ఫీ తీసుకుంటూ ఆమె ప్రాణాలు కోల్పోయిందని మీడియాలో వచ్చింది. దీనిపై ప్రణీత స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ప్రణీత దగ్గర అసలు సెల్ ఫోనే లేదని, అందరి ఫోన్లు బ్యాగులోనే పెట్టామని ఆమె స్నేహితురాలు ప్రత్యూష మెహతా వెల్లడించింది. ప్రణీత ఫోను ఇప్పటికీ తన దగ్గరే ఉందని తెలిపింది. దీంతో మీడియా సంస్థలు లెంపలు వేసుకున్నాయి. ప్రణీత కుటుంబానికి క్షమాపణ చెప్పాయి. -
యువతి ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి
బెంగళూరు: సెల్ఫీ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లతో స్వీయచిత్రాలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎగబాకుతోంది. తాజాగా రాజస్థాన్ కు చెందిన లా స్టూడెంట్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానికి గురై మృతి చెందింది. జోధ్పూర్ నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న ప్రణీత మెహతా(21) అనే విద్యార్థిని తన స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్ కు వచ్చింది. గోకర్ణ బీచ్ లో 300 అడుగుల లైట్ హౌస్ పైకిఎక్కి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి పడిపోయింది. అక్కడే ఉన్న జాలర్లు ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత ఆమె మృతదేహాన్ని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు. ముంబై, గోవా వెళ్లొచ్చిన తర్వాత ప్రణీత, ఆమె స్నేహితులు ఇక్కడకు వచ్చారు. ప్రపంచంలో అత్యధికంగా సెల్ఫీ మరణాలు ఇండియాలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2015లో 27 సెల్ఫీ మరణాలు సంభవించాయి.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
Advertisement