-
క్రేజీ కాంబినేషన్ ఉన్నా కథే ముఖ్యం
‘‘తొలిప్రేమ’ కథ సెకండాఫ్ సరిగ్గా కుదరలేదని ‘దిల్’ రాజు తప్పుకున్నారు. ఆ కథ నాకన్నా ముందు మా అబ్బాయి బాపినీడు విన్నాడు. తర్వాత వరుణ్ తేజ్‌కి వినిపించారు. కథను, డైరెక్టర్ని వరుణ్ నమ్మారు. ‘ఫిదా’ వంటి లవ్ ఎంటర్టైనర్ తర్వాత మళ్లీ లవ్‌స్టోరీ ఒప్పుకోవడం సాహసమే. అందుకే.. ఈ సక్సెస్ క్రెడిట్ వరుణ్‌కే దక్కుతుంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘తొలిప్రేమ’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నా తొలిప్రేమ నా వైఫే. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘కొత్త డైరెక్టర్‌తో నేను సినిమా చేయను. బాపినీడు వల్లే అది కుదిరింది. మళ్లీ మా బ్యానర్లో కొత్త డైరెక్టర్ సినిమా అంటే బాపినీడు చూసుకుంటాడు. ‘తొలిప్రేమ’ విషయంలో నేను మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చున్నానంతే. మార్పులు చేశాక సెకండాఫ్ విని ‘దిల్’ రాజు ఇంప్రెస్ అయి, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద స్టార్స్ అంతా బిజీగానే ఉన్నారు. వారితో సినిమా అంటే టైమ్ పడుతుంది.మల్టీస్టారర్ సినిమా తీయగలిగే సత్తా డైరెక్టర్‌కి ఉండాలి. రాజమౌళికి ఆ కెపాసిటీ ఉంది. ‘తొలిప్రేమ’తో 24 సినిమాలు పూర్తయ్యాయి. 25వ సినిమా కోసం స్పెషల్‌గా ప్లాన్ చేయడంలేదు. ఎంత క్రేజీ కాంబినేషన్ ఉన్నా కథ ఉండాల్సిందే. నిర్మాత కూడా కథలో ఇన్వాల్వ్ అయినప్పుడే బడ్జెట్‌పై క్లారిటీ ఉంటుంది. ఇండస్ట్రీలో అందరు పెద్ద డైరెక్టర్స్, స్టార్స్‌తో సినిమాలు చేశా. ఒక్క మహేశ్‌బాబుతో తప్ప. ఆయనతో కూడా త్వరలో ప్లాన్ చేస్తా’’ అన్నారు. -
భలే కాంబినేషన్!
ప్రతి సినిమాకీ ప్రయోగాలు చేసే కథానాయకుడు కల్యాణ్‌రామ్. వినోద భరిత చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట జి.నాగేశ్వరరెడ్డి. భారీ చిత్రాలకు కేరాఫ్‌గా చెప్పుకునే నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. మరి వీరి ముగ్గురి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుందంటే? నిజంగా క్రేజీ కాంబినేషనే అని చెప్పాలి. ఇటీవల ‘పటాస్’ విజయంతో మాంచి ఊపుమీదున్నారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘ఇజం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని సమాచారం. ఆ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత నాగేశ్వరరెడ్డి, బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబినేషన్లో కల్యాణ్‌రామ్ కొత్త మూవీ చేయనున్నారనే సమాచారం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే తమ్ముడు జూ.ఎన్టీఆర్‌కు ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్ చిత్రం ఇచ్చారు ప్రసాద్. ఇప్పుడేమో అన్న కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం నాగేశ్వరరెడ్డి స్టయిల్లో వినోద భరితంగా ఉంటుందో... లేక కల్యాణ్ రామ్ స్టయిల్లో విలక్షణంగా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement