-
వీడియో: నాణేలతో స్కూటర్ కొనుగోలు.. ఎన్ని వేలో తెలుసా?
అదో బైక్ షోరూం.. వర్కర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన భుజాన ఓ సంచి వేసుకుని షోరూమ్‌కి వచ్చాడు. తనకు ఓ స్కూటర్ కావాలని అక్కడున్న వారిని కోరాడు. దీంతో, అక్కడున్న స్కూటర్లను చూసి ఒకదాన్ని ఓకే చేసుకున్నారు. అయితే, డబ్బులు చెల్లించే సమయంలో అతడు తన వద్ద ఉన్న 10 రూపాయల నాణేలను ఇవ్వడంతో అక్కడున్న వారు ఒకింత ఆశ్చర్యానికి లోనైనా.. అతడి కోరికను చూసి అభినందించారు. ఏకంగా రూ. 90వేలకు సరిపడే 10 రూపాయల నాణేలను లెక్కించి స్కూటర్‌ను అతడికి అప్పగించారు. వివరాల ప్రకారం.. బైక్ కొనుక్కోవడం ప్రతి సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. మరికొందరు డబ్బులను జమ చేసుకుని కొనుగోలు చేస్తారు. అయితే, అసోంకు చెందిన వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం రూ.90 వేలు కూడబెట్టి.. చివరికి తనకు ఇష్టమైన ద్విచక్ర వాహనాన్ని కొని ఇంటికి తీసుకెళ్లాడు. #WATCH | Assam: Md Saidul Hoque, a resident of the Sipajhar area in Darrang district purchased a scooter with a sack full of coins he saved. pic.twitter.com/ePU69SHYZO — ANI (@ANI) March 22, 2023 అసోంలోని దరంగ్ జిల్లాలో సిపజార్‌కు చెందిన మహమ్మద్ సైదుల్ హక్ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. చిన్న షాప్ నడుపుకునే సైదుల్కు స్కూటర్ కొనాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దీంతో, తనకు ఇష్టమైన బైక్ కోసం ఐదారేళ్లుగా డబ్బును జమ చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రతీ రోజు అతడు రూ.10 నాణేలను పోగు చేశాడు. ఇలా 90వేల రూపాయలు పొదుపు చేశాడు. ఇన్ని రోజులు జమ చేసిన నాణేలను కొన్ని డబ్బాల్లో ఓ సంచిలో వేసుకుని షోరూమ్‌కు వెళ్లాడు. అనంతరం, బైక్‌ను కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సైదుల్ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. "I run a small shop in Boragaon area and it was my dream to buy a scooter. I started to collect coins 5-6 years ago. Finally, I have fulfilled my dream. I am really happy now," said Md Saidul Hoque pic.twitter.com/Vj4HsOqI3v — ANI (@ANI) March 22, 2023 అయితే, అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు తన డ్రీమ్ బైక్(కేటీఎం) కోసం చిల్లరను జమచేశారు. రూ.2.85 లక్షలకు సరిపడే రూపాయి కాయిన్స్ పొదుపు చేసి బైక్ కొనుగోలు చేశారు. అలాగే, తమిళనాడులోని సేలాం జిల్లాకు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను జమ చేసి కారును కొనుగోలు చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఇది కూడా చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. షాకింగ్ వీడియో -
బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని మీర్పేట్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న మౌనిష్ ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా మౌనిష్ తల్లిదండ్రులను బైక్ కొనివ్వాలని అడుగుతున్నాడు. ఆర్ధిక కారణాల వల్ల అతని కుటుంబసభ్యులు అందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిష్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement