-
omicron variant: విదేశాల నుంచి వస్తే మార్గదర్శకాలివే..
న్యూఢిల్లీ: కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిబంధన విధించింది. మార్గదర్శకాలివే.. ► ప్రయాణికులు తమ వివరాలను, 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి ► ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వాలి ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఈ పరీక్ష కోసం ముందుగానే సువిధ పోర్టల్‌లో బుక్ చేసుకోవచ్చు. ► పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కుపంపిస్తారు. ► నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి. 8వ రోజు ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్‌ని సువిధ వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఆ పరీక్షలో నెగిటివ్ వస్తే మరో వారం పాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ► ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన వారు (అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మంది) కూడా విమానాశ్రయంలో రాండమ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ ఉండాలి ► అయిదేళ్లలోపు చిన్నారులకు పరీక్షల నుంచి మినహాయింపు. పెరిగిన ఎట్ రిస్క్ దేశాల జాబితా ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా. -
నాలో ‘యాంగ్రీ మేన్’ అలానే ఉన్నాడు!
అమితాబ్ వయసు సెవెన్టీ ప్లస్. నటుడిగా ఆయన వయసు ఫార్టీ ఫ్లస్. నాలుగు దశాబ్దాల కెరీర్లో అమితాబ్ బచ్చన్ పలు రకాల పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘యాంగ్రీ యంగ్ మేన్’ పాత్రల్లో ఆయన ఒదిగిపోయిన వైనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఏడు పదుల వయసులో ఈ తరహా పాత్రలు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ విషయం గురించి అమితాబ్ స్పందిస్తూ - ‘‘స్కూల్, కాలేజ్ డేస్‌లో ఉండే ఎనర్జీ శాశ్వతంగా మనతో ఉండదు. అది వాస్తవమే. నేనొకప్పుడు ‘యాంగ్రీ యంగ్ మేన్’ పాత్రలను సునాయాసంగా చేసేవాణ్ణి. రిస్కీ ఫైట్స్‌ని అవలీలగా చేసేవాణ్ణి. ఇప్పుడు చేయలేను. ‘యంగ్' గా లేకపోయినా కానీ, నాలో యాంగ్రీ మేన్ మాత్రం అలానే ఉన్నాడు. యాంగ్రీ అంటే.. కేవలం ఫైట్స్ చేయడం మాత్రమే కాదు. దర్శకులు శక్తిమంతమైన డైలాగ్స్ చెప్పించి, యాంగ్రీ మేన్‌ని బయటికి తీసుకురావచ్చు. ఒకవేళ అలాంటి కేరక్టర్‌తో ఏ దర్శకుడైనా వస్తే.. ఇన్నాళ్లూ ఫైట్స్ చేసి నాలో యాంగ్రీ మేన్‌ని చూపించాను. ఇప్పుడు మరో కోణంలో చూపిస్తా’’ అని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement