-
గాంధీ విగ్రహం వద్ద రోజా మౌనదీక్ష
♦ ఉదయం నుంచి గాంధేయ మార్గంలో నిరసన ♦ రోజాకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం ♦ న్యాయం జరిగేవరకు అండగా ఉంటామన్న పార్టీ అధినేత జగన్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.. తనను రెండోరోజు శనివారం కూడా శాసనసభలోకి అనుమతించకపోవడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఫుట్‌పాత్‌పై మౌనదీక్ష చేపట్టారు. ఎండలో దీక్ష చేపట్టిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను నిమ్స్‌కు తరలించారు. ఉదయం 8.45 గంటలకు నల్ల దుస్తుల్లో వచ్చి అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోజాను గేటు 2 సమీపంలో మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు, మార్షల్స్‌కు వాగ్వాదాం జరిగింది. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, తనను లోపలికి అనుమతించాలని ఆమె కోరారు. అందుకు మార్షల్స్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఆమె తాను ఎందుకు సభలోకి రాకూడదో రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా మార్షల్స్ లోపలికి అనుమతించకపోవడంతో రోజా అక్కడే బైఠాయించారు. నిరసనకు దిగిన ఆమెకు పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, వి.కళావతి, పి.పుష్పశ్రీవాణి, వి.రాజేశ్వరి, గౌరు చరితారెడ్డి మద్దతుగా నిలిచారు. ఉదయం 9 గంటలకు రోజా అసెంబ్లీ బయట గాంధీజీ విగ్రహం ఎదురుగా ఫుట్‌పాత్‌పై మౌనదీక్ష చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వంపై గాంధేయ మార్గంలో నిరసన తెలిపిన ఆమెకు సంఘీభావంగా మహిళా ఎమ్మెల్యేలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లడంతో రోజా ఒంటరిగానే దీక్ష కొనసాగించారు. అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడిన తర్వాత ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, సర్వేశ్వరరావు, కోన రఘుపతి, కొరుముట్ల శ్రీనివాసులు వచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఆమెకు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత మహిళా ఎమ్మెల్యేలు వచ్చి రోజా వద్ద కూర్చున్నారు. వాళ్లతోపాటు ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, నారాయణస్వామి, జంకె వెంకటరెడ్డి, పి.రాజన్నదొర, ముత్యాలనాయుడు, చిర్ల జగ్గిరెడ్డి, సి.రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, సుజయ్ కృష్ణరంగారావు, ముస్తాఫ, ఐజయ్య కూడా రోజాకు మద్దతుగా అక్కడే కూర్చున్నారు. పార్టీ నేతలు, కుటుంబసభ్యుల పరామర్శ బీపీ, సుగర్ లెవెల్స్ పడిపోయి అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోజాను పార్టీ నేతలు, కుటుంబసభ్యులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డ్డి, గిడ్డి ఈశ్వరి, రోజా భర్త సెల్వమణి, కుమారుడు కౌషిక్, కుమార్తె అన్షు ఆమెను పరామర్శించారు. వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు డాక్టర్ గణేశ్ తదితరులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.ఆస్పత్రికి తెచ్చినప్పుడు ఆమెకు బిపీ 150-90, సుగర్ లెవల్స్ 61 ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు చెప్పారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయి సొమ్మసిల్లిన రోజా ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం 11.45 గంటలకు రోజా సొమ్మసిల్లిపోయారు. ఆమె అస్వస్థతకు గురవడంతో సహచర శాసనసభ్యులు ఆందోళన చెందారు. ఆమెకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెం బ్లీ ఆవరణలోని 108 వద్ద నుంచి బీపీ టెస్టర్, స్టెతస్కోప్ తెప్పించి రోజాను పరీక్షించారు. అదే సమయంలో రోజాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాసరెడ్డిని అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. రోజాను నిమ్స్‌కు తరలించాలని 108 సిబ్బందిని కోరారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని ఆయన రోజాకు ధైర్యం చెప్పారు. -
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం దద్దరిల్లింది. ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు ఎంతకూ వెనక్కి తక్కకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సభ మూడోసారి ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. రోజాను సభకు అనుమతించాలంటూ నినాదాలు చేయగా పరిస్థితిని కంట్రోల్ చేయలేని పక్షంలో సభను సోమవారానికి వాయిదావేశారు. అంతకుముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభకు నల్ల దుస్తులతో వచ్చి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం, రోజాను ఎందుకు అనుమతించడం లేదంటూ పదే పదే అడుగుతున్న క్రమంలో రెండు సార్లు సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement