-
షెల్ చేతికి బీజీ గ్రూప్
70 బిలియన్ డాలర్ల డీల్ లండన్: దిగ్గజ సంస్థ రాయల్ డచ్ షెల్ తాజాగా చమురు, గ్యాస్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. బ్రిటన్‌కు చెందిన పోటీ సంస్థ బీజీ గ్రూప్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 70 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.2 లక్షల కోట్లు). ఈ డీల్ ద్వారా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే స్వతంత్ర సంస్థల్లో అతి పెద్ద కంపెనీగా రాయల్ డచ్ షెల్ ఎదగనుంది. అగ్రస్థానంలో ఉన్న అమెరికన్ కంపెనీ ఎక్సాన్ మొబిల్ తర్వాత రెండో స్థానానికి చేరనుంది. ఒప్పందం ప్రకారం మంగళవారం నాటి బీజీ షేరు క్లోజింగ్ ధర 910.4 పెన్స్‌పై 50 శాతం ప్రీమియంను షెల్ చెల్లించాల్సి ఉంటుంది. విలీనానంతరం ఏర్పడే కంపెనీలో బీజీ షేర్హోల్డర్లకు 19 శాతం వాటాలు దక్కుతాయి. 2016 తొలినాళ్లకి డీల్ పూర్తి కాగలదని షెల్ సీఈవో బెన్ వాన్ బ్యూర్డెన్ తెలిపారు. ముడి చమురు రేట్లకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 60 డాలర్ల దిగువకి పడిపోయిన తరుణంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. 1998లో చమురు సంక్షోభం ఏర్పడి క్రూడ్ రేటు బ్యారెల్‌కు 12 డాలర్లకు పడ్డపుడు అమొకో సంస్థను బీపీ ... మొబిల్ కార్పొరేషన్‌ను ఎక్సాన్... టెక్సాకోను షెవ్రాన్, పెట్రోఫినాను టోటల్ ఎస్ఏ కొనుగోలు చేశాయి. దశాబ్ద కాలంలో తొలి భారీ డీల్: చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి గడచిన రెండు దశాబ్దాల్లో ఇది అత్యంత భారీ డీల్. అలాగే వివిధ రంగాలవారీగా చూస్తే గత పదేళ్లలో ఇంత పెద్ద స్థాయి కొనుగోలు ఇదే ప్రథమం. 2000లో గ్లాక్సో వెల్కమ్ కంపెనీ బ్రిటన్ కి చెందిన స్మిత్కై్లన్ బీచామ్ను 44.4 బిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసిన తర్వాత .. దాన్ని మించే డీల్ ఇదే. అయితే, 1999లో మానెస్మన్ ఏజీని కొనుగోలు చేసేందుకు వొడాఫోన్ ఎయిర్టచ్ 202.8 బిలియన్ డాలర్లు వెచ్చించిన ఒప్పందం యూరప్‌లోకెల్లా అత్యంత భారీ డీల్. -
కదిలే దీవి... ఈ ఓడ
ప్రపంచంలో అతి పెద్ద నౌక ఏదంటే... మెర్స్క్ కంపెనీకి చెందిన మెక్కిన్నే మోలరే. ఇది ప్రయాణం మొదలెట్టి 5 నెలలే అయింది. కానీ అంతలోనే ఆ రికార్డును చెరిపేయటానికి ఇంధన దిగ్గజం రాయల్ డచ్ షెల్ రెడీ అయిపోయింది. ఇది తయారు చేస్తున్న ప్రిల్యూడ్ విస్తీర్ణం... నాలుగు ఫుట్ బాల్ మైదానాలంత. పొడవు 488 మీటర్లు. బరువు 6 లక్షల టన్నులపైనే. ఖర్చు మన కరెన్సీలో రూ.73వేల కోట్లు. 2017 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్న ఈ నౌక... ఓ కదిలే దీవి. సముద్ర గర్భంలో వెలికితీసే గ్యాస్‌ను పైప్లైన్ల ద్వారా తీరానికి చేరుస్తారు. కాకపోతే పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రిల్యూడ్ గ్యాస్ క్షేత్రం... తీరానికి 125 మైళ్ల దూరంలో ఉంది. అందుకని గ్యాస్ రవాణాకు ఓ కదిలే ఎల్ఎన్జీ కేంద్రాన్ని నిర్మించాలని షెల్ కంపెనీ భావించింది. ఆ మేరకు పుడుతున్నదే ప్రిల్యూడ్ నౌక. ఇక్కడ వెలికితీసే గ్యాస్‌ను ప్రిల్యూడ్లో నిల్వచేసి... బోట్ల ద్వారా ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తారు. ‘‘కదపడానికి వీల్లేని పైప్లైన్ల వంటి స్థిరమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించే బదులు ఇలాంటి నౌకలతో చాలా లాభం ఉంటుంది. ఒకవేళ ఆ క్షేత్రంలో గ్యాస్ పూర్తయిపోతే ఓడను మరో క్షేత్రానికి తరలించుకుపోయే వెసులుబాటు ఉంటుంది’’ అనేది నిపుణుల మాట. ఇవీ... ప్రిల్యూడ్ విశేషాలు అమెరికాలో అత్యంత ఎత్తయిన భవంతుల్లో ఒకటైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (381 మీటర్లు), మలేసియాలోని పెట్రోనాస్ టవర్స్ (452 మీటర్లు) కన్నా పొడవైనది. 3,000 కిలోమీటర్ల మేర పొడవుండే ఎలక్ట్రికల్ కేబుల్స్‌ని దీన్లో ఉపయోగిస్తారు. దీన్ని నిలిపేచోట తీవ్రమైన గాలులు వీస్తుంటాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడేలా ప్రిల్యూడ్ని డిజైన్ చేశారు. పదివేల ఏళ్లకొకసారి వచ్చే తుపాన్లు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, 65 అడుగుల ఎత్తున ఎగిసిపడే అలలను సైతం ఇది తట్టుకోగలదట. ముంబై లాంటి రెండు పెద్ద నగరాలకు, లేదా హాంకాంగ్ వంటి అత్యంత భారీ నగరానికి విద్యుత్ ఇవ్వగలిగేంత గ్యాస్‌ను ప్రిల్యూడ్ ఉత్పత్తి చేస్తుందని అంచనా. అమెరికాలో అతి పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కన్నా ఆరు రెట్లు పెద్దది. రవాణాకి వీలుగా ఉండేలా... దీన్లో గ్యాస్‌ని ఫ్రీజ్ చేసి మైనస్ 161 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేస్తారు. 600 రెట్లు కంప్రెస్ చేస్తారు. వారానికోసారి ఓ భారీ ట్యాంకర్ ఈ గ్యాస్‌ని తీసుకెడుతుంది. జపాన్, చైనా, కొరియా తదితర దేశాలకు ఈ గ్యాస్ ఎగుమతి అవుతుంది. 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. పాతికేళ్ల తర్వాత ప్రస్తుత క్షేత్రంలో గ్యాస్ అయిపోతుంది. మెరుగులు దిద్ది మరో క్షేత్రానికి తీసుకెడతారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement