-
దైవం... ప్రేమ స్వరూపం
చింతన మానవుని ప్రేమ షరతులతో కూడుకున్నది. అందుకే అనేక సందర్భాలలో అది విఫలం అవుతుంది. కానీ దేవుని ప్రేమ అనంతమైనది, షరతులు లేనిదీ. ‘నాకు లాభం కలిగితే అందులో కొంత నీకు చెల్లిస్తాను’ అని దేవునికి ప్రతిఫలం ఇవ్వజూపేవారు మనలో కొందరుంటారు. అయితే దేవుడు మన నుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ సర్వ సృష్టి, సకల సంపదలు దేవునివే. ఆయన కలుగజేస్తే ఉద్భవించినవే. భగవంతుడు ప్రేమమయుడని భగవద్గీత, పురాణాలు అభివర్ణిస్తున్నాయి. దుర్మార్గుల పట్ల కూడా దేవుడు తన ప్రేమను కనబరిచి, వారు త్వరగా సన్మార్గంలోకి రావాలని ఆశిస్తాడు. తండ్రి తన బిడ్డల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని సరి చేయాలని చూస్తాడు తప్ప, నాశనం చేయాలనుకోడు. మతం పేరిట నేడు కొందరు హింసకు పాల్పడుతున్నారు. ఈ హింస, ద్వేషం, అరాచకత్వం అన్నీ దుష్ట లక్షణాలు. దైవానికి సంబంధించినవి కావు. ఒకవేళ ద్వేషం దేవుని లక్షణమైతే, ఈ పాటికి సర్వ ప్రపంచం ఆయన ఉగ్రతకు నాశనమై ఉండేది. దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ఒకరి పట్ల ఒకరం ప్రేమగా మెలిగినప్పుడు ఆయనకు మనం అత్యంత ప్రీతిపాత్రులం అవుతాం. - యస్. విజయ భాస్కర్ -
తిరిగిరాని క్షణం... కాంతికన్నా వేగం!
సృష్టిలో, మనకు తెలిసినంత వరకు అత్యంత వేగంతో ప్రయాణించేది ‘కాంతి’. సెకనుకు లక్షా ఎనభై ఆరు వేల మైళ్ల వేగంతో అది ప్రయాణిస్తుంది. అయితే సూర్యునిలో తరచు సంభ విస్తుండే సునామీని మించిన అగ్ని తుపానులు, మహావిస్ఫోటాలు కలిగినప్పుడు ఉద్భవించే అతి సూక్ష్మ ధూళి కణాలైన ‘న్యూట్రినో’లు... వేగంలో కాంతితో పోటీపడి మరీ ఈ విశ్వంలోకి దూసుకెళ్తాయని ఇటీవల ‘నాసా’ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు! అయితే వీటన్నిటినీ మించి వేగంగా ప్రయాణించినట్టనిపించేది మరొకటుందనిపిస్తుంది. అదే ‘గతించిపోయిన కాలం’. సూర్యుడు ఆవిర్భవించి నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలైందని శాస్త్రజ్ఞుల అంచనా. అంటే ఇప్పటికి క్షణికంలో అన్ని కోట్ల సంవత్సరాలు గతించిపోయాయన్న మాట. నిమిషానికి అరవై సెకన్లు. సెకనును వంద కోట్ల భాగాలుగా విభజించినప్పుడు దానిని ‘నానో సెకను’ అంటారు. మీరు ఈ వాక్యం చదివే లోపు కొన్ని లక్షల నానో సెకన్లు గతించి పోతాయి. వాటిలో ఒక్క సెకనును కూడా వెనక్కు లాగే శక్తి మనకు లేదు. కనుక మానవ జీవితం నూరు సంవత్సరాలైనా, అంతకు మించినా, అది కాలయానంలో అతి సూక్ష్మమైన, అణువు కన్నా సంక్షిప్తమైనదని చెప్పాలి. మనకు ముందు కొన్ని వేల, లక్షల తరాలు గతించి పోయాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతుంటాయి: ‘మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, అది అప్పుడే పూసి, సమసిపోయే గడ్డిపువ్వు లాంటిది’ అని. జీవితకాలం ఇంత సంక్షిప్తమైనప్పుడు, స్వార్థపూరితంగా జీవించి ప్రయోజనం ఏమిటి? బైబిల్లో ఇలా ఉంటుంది: ‘అన్యాయంగా మీరు సంపాదించుకున్న వాటికి మీ పేర్లు, పిల్లల పేర్లు పెట్టుకుంటారు కానీ చివరకు అవి అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ నీతియుక్తంగా లభిస్తాయి. అంతకుమించిన నిత్యజీవానికి, పరలోక రాజ్యానికి మీరు వారసులవుతారు’ అని. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి. - యస్.విజయ భాస్కర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement