-
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్
-
కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు
హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ చేతులను శుభ్రపరుచుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులను కూడా దీనిని పాటించాలని కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విసిరిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్వీకరించారు. ఈ సందర్భంగా క్యాథరిన్‌కు ధన్యవాదాలు తెలిపిన సింధు.. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ చేతులను సరైన విధంగా శుభ్రపరుచుకోవాలన్నారు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా సారథి విరాట్ కోహ్లి, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. అలాగే తను చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చదవండి : కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు పాకిస్తాన్లో తొలి కరోనా మరణం -
సంపాదనలో ఒక రూపాయి
ఆ అబ్బాయికి మొదటిజీతం ఏం చేయాలో అర్థంకాలేదు. కారణం...ఏదో ఒక మంచి పనికి ఖర్చుపెట్టాలని అతడి కల. తోటి స్నేహితులతో ఆలోచించాడు. పుట్టింది ఖమ్మంలోనైనా ఉద్యోగరీత్యా పునేలో ఉండాల్సివచ్చింది. మంచిపని సొంతూళ్లోనే కాదు ఎక్కడైనా చేయచ్చనుకున్నాడు. స్నేహితుల్ని వెంటబెట్టుకుని పునేలో అనాథపిల్లలుండే భారత సమాజ సేవ కేంద్రానికి వెళ్లాడు. స్కూలుకి వెళ్లడానికి ఇబ్బందిపడుతున్న అనాథవిద్యార్థులకు వ్యాన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆపనితో తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఆ అబ్బాయి పేరు...శ్రీకళ్యాణ చక్రవర్తి. ప్రస్తుతం ‘సేఫ్ హ్యాండ్స్’ పేరుతో సేవలు చేస్తున్న ఈ యువకుడితో మరో ఆరుగురు చేయి కలిపారు. ఐదు వేళ్లు... చేతికి ఐదువేళ్లున్నట్టే సేఫ్ హ్యాండ్స్‌లో కూడా ఐదు విభాగాలున్నాయి. అక్షర, సుహృత, వైద్య, ఉద్దార, ప్రదాత. అక్షర పేరుతో పదో తరగతి పాసైన పేద విద్యార్థుల్ని ఇంటర్ చదివిస్తున్నారు. చదివించడం అంటే ఫీజులు కట్టడం కాదు... వారి వెంటబడి చదివించడం. మంచి మార్కులు వచ్చేవరకూ ఊరుకోరు. ఇంటర్ పూర్తయ్యాక వారికి సేఫ్హ్యాండ్స్ తరపున సర్టిఫికెట్ ఇచ్చి స్టూడెంట్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పర్సనల్ కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. సుహృత పేరుతో అనాథపిల్లలకు బట్టలు, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యం కింద ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం, కళ్లద్దాలు, డెంటల్ కిట్లు పేదలకు ఇస్తుంటారు. మూడోది ఉద్దార...మూడేళ్లక్రితం మహబూబ్‌నగర్‌లో వరదతాకిడి వల్ల చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఒక గ్రామాన్ని సేఫ్హ్యాండ్స్ దత్తత తీసుకుని పూర్తిగా బాగుచేసింది. చివరిది ప్రదాత. అంధబాలలకు బ్రెయిలీ కిట్లు పంచడం దీని లక్ష్యం. ఇలా ఐదు అంశాలపై సేఫ్హ్యాండ్స్ నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది. సంస్థ భాగస్వాములు ఏడుగురే అయినా సభ్యులు నలభైమందివరకూ ఉన్నారు. ఈ సంస్థ ఉండేది ఖమ్మం జిల్లాలో అయినా అవసరాన్ని బట్టి చుట్టుపక్కల జిల్లాల్లో కూడా దృష్టిపెడుతుంది. తమ సంపాదనలో ఒక రూపాయి సమాజంకోసం అంటున్న ఇలాంటి యువకుల సంఖ్య రోజురోజుకీ పెరగాలి.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement