-
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
Bheemla Nayak: ఆ సీన్ తొలగించి, పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్ మానేపల్లి వీవీఎస్ఎన్ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సన్నివేశాలని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వివరాల్లొకి వెళితే.. భీమ్లా నాయక్ మూవీలో రానా-పవన్ కల్యాణ్‌ల మధ్య చిత్రీకరించిన ఫైటింగ్ సీన్లో ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను రానా కాలితో తన్నారు. ఇది తమ వర్గాన్ని అవమానించేలా ఉందని మానేపల్లి వీవీఎస్ఎన్ మూర్తి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని(సారె) కాలితో తన్ని దానితో పవన్‌పై దాడి చేసినట్లు చూపించారు. మేము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి సారెను కాలితో తన్నినట్లు చూపించడం మమ్మల్ని కించపరచడమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది’ అని ఆయన అన్నారు. అంతేకాదు ఈ సన్నివేశాన్ని వెంటనే మూవీ నుంచి తొలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సినిమా హీరోలు పవన్ కల్యాణ్, రానా, దర్శక-నిర్మాలు సాగర్ కే చంద్ర, సూర్య దేవర నాగవంశీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు కుమ్మర శాలివాహనులను అవమానపరిచిన పవన్ కల్యాణ్ కుమ్మర శాలివాహనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి: దర్శకుడు
‘‘అయ్యారే’కి డైరెక్షన్ చేస్తున్నప్పుడు సినిమా తీయాలనే తపన తప్ప నాకు ఇంకేం తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’కి పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఆ సినిమా ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ‘భీమ్లా నాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి’’ అని సాగర్ కె. చంద్ర అన్నారు. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సాగర్ కె.చంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లాక్ డౌన్ సమయంలో నిర్మాత నాగవంశీగారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చూడమనడంతో చూశా. ఈ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నాం.. నీకు ఆసక్తి ఉందా? అనగానే ఓకే చెప్పాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్, రానాగార్లు రావడంతో మరింత ఎగై్జటింగ్‌గా ముందుకెళ్లాం. ఈ సినిమా వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో హ్యాపీ. ‘భీమ్లానాయక్’ని త్వరలో హిందీలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నా తర్వాతి సినిమా రీమేక్ కాకుండా స్ట్రైట్ మూవీ చేస్తా.‘భీమ్లానాయక్’ కి ముందు వరుణ్ తేజ్‌తో 14రీల్స్ ప్లస్ బ్యానర్లో ఓ సినిమా ప్రక టించారు. బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అవడంతో ఆగింది.. ఆ కథతోనే సినిమా చేస్తానా? కొత్త కథతోనా? చూడాలి’’ అన్నారు. -
భీమ్లా నాయక్ నుంచి నాలుగో పాట.. 'అడవి తల్లి మాట'
Bheemla Nayak Movie 4th Song "Adavi Thalli Mata" Released: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు, గ్లింప్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగా తాజాగా 'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఫోర్త్ సింగిల్ అయిన 'అడవి తల్లి మాట' పాటను డిసెంబర్ 1న విడుదల చేయాల్సింది. అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట రిలీజ్‌ను ఆపేసారు. చివరికీ ఇవాళ (డిసెంబర్ 4, శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టే ఇవాళ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 'అడవి తల్లి మాట' పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. దుర్గవ్వ, సాహితి చాగంటి తమదైన గాత్రంతో పాడి ఆకట్టుకున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతోంది. -
సంక్రాంతికి భీమ్లానాయక్ రిపోర్ట్, స్పెషల్ వీడియోతో సర్ప్రైజ్
BheemlaNayak: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందిస్తుడటం విశేషం. తాజాగా చిత్రయూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతి బరిలోకి పవన్, రానా మూవీ వస్తోందని వెల్లడించింది. ఈ మేరకు మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్.. క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా మల్టీస్టారర్ మూవీ కూడా సంక్రాంతి విడుదలకు సై అనడంతో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి! Power Star as #BheemlaNayak, will take charge Sankranthi 2022 🔥 Here's a small glimpse from the sets of #ProductionNo12 💫 ▶️ https://t.co/grU9Cd9acz Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli — Sithara Entertainments (@SitharaEnts) July 27, 2021
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement