-
'గాడ్జెట్ ఆఫ్ ది ఇయర్' ఈ స్మార్ట్‌ఫోన్‌కే!
సాక్షి, న్యూఢిల్లీ : గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ నుంచి కోలుకున్న శాంసంగ్, ఎంతో శక్తివంతంగా, అన్ని అంశాల పరంగా మెరుగ్గా గెలాక్సీ నోట్ 8ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్ కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 'గాడ్జెట్ ఆఫ్ ది ఇయర్' గా అవార్డు దక్కించుకుంది. ఇక్కడ జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2017 లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ అవార్డను సొంతం చేసుకుంది. రూ.67,000కు ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోట్ 8 రాకతో, భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో తమ ఆధిపత్య స్థానాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్టు శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సి చెప్పారు. తమ కృషికి ప్రతీక ఈ ప్రతిష్టాత్మక అవార్డని అభివర్ణించారు. గెలాన్సీ నోట్ 8 ఫీచర్లు.. ఇండస్ట్రీలోనే తొలి ఇన్ఫినిటీ డిస్ప్లే 6.3 అంగుళాల డిస్ప్లే 1440 x 2960 పిక్సెల్స్ రెజుల్యూషన్ 6జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 64 బిట్ ఎక్సీనోస్ 8895 ఆక్టా-కోర్ ఎస్ఓసీ ఐరిస్ స్కానర్, ఫేస్ఐడీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్, నెంబర్ లాక్, పాటరన్ లాక్ 12 మెగాపిక్సెల్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ -
బంపర్ ఆఫర్లతో నోట్8 ప్రీ-ఆర్డర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్ ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు పోటాపోటీగా.. వీటి విడుదల రోజే స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్, గెలాక్సీ నోట్8ను భారత్‌లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫాబ్లెట్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్‌కు వచ్చింది. సెప్టెంబర్ 21 వరకు ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ చేపడుతోంది. సెప్టెంబర్ 21 నుంచే శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వినియోగదారుల చేతుల్లోకి కూడా వచ్చేస్తోంది. ప్రీ-ఆర్డర్ల సందర్భంగా గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ బంపర్ ఆఫర్లను వినియోగదారులకు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై 4000 రూపాయల క్యాష్‌బ్యాక్, ఉచితంగా వైర్లెస్ ఛార్జర్, 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, 448జీబీ రిలయన్స్ జియో డేటాను అమెజాన్ ఆఫర్ చేయనుంది. నోట్ 8 ప్రీ-ఆర్డర్‌పై ఒక్కసారి స్క్రీన్ రీప్లేస్మెంట్ గ్యారెంటీని కూడా అమెజాన్ అందించనుంది. హెచ్డీఎఫ్సీ కార్డుహోల్డర్స్‌కు రూ.4000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై 1000 రూపాయల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు... 6.3 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్సెట్ 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 12ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
గెలాక్సీ నోట్8కి భారీగా ప్రీ బుకింగ్స్
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్8కు భారీగా ప్రీ-బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 12న భారత్‌లో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి, ఇప్పటికే 2.5 లక్షలకు పైగా కస్టమర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఇదే రోజు శాంసంగ్ ప్రత్యర్థి కంపెనీ ఆపిల్ కూడా తన 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను భారత్‌లో లాంచ్ చేస్తుండగా... ఆపిల్ కాలిఫోర్నియా, కూపర్టినోలోని తన కొత్త క్యాంపస్ స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఐఫోన్ 8ను లాంచ్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8కు వెల్లువెత్తుతున్న ప్రీ-బుకింగ్స్‌లో 1.5 లక్షలు అమెజాన్ నుంచి వచ్చాయి. మిగతా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు శాంసంగ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఐఫోన్ లాంచ్ గురించి తెలిసిన శాంసంగ్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తుందని, స్మార్ట్ఫోన్లకు ఎంతో ప్రతిష్టాత్మకమైన మార్కెట్ భారత్‌లో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తుందని తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్, ఆగస్టులో దక్షిణ కొరియాలో లాంచైంది. బిక్స్బీ ఇంటెలిజెంట్ అసిస్టెంట్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్, ఐరిస్ స్కానర్‌తో ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు... 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్ 64/128/256 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్. -
గెలాక్సీ నోట్ 8 వచ్చేసింది..
న్యూఢిల్లీ: గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్‌తో తర్వాత, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను బుధవారం రాత్రి విడుదలైంది. న్యూయార్క్ వేదికగా స్పెషల్ ఈవెంట్లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ని అన్ని అంశాల పరంగా ఎక్కువ శక్తిమంతంగా, మెరుగ్గా కంపెనీ తీర్చిదిద్దింది. ఈ గెలాక్సీ నోట్ 8 ధర రూ.61,500/-గా తెలుస్తోంది. మార్కెట్లు, వేరియంట్లను బట్టి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ఫోన్ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో భారత మార్కెట్లోకి రానుంది. శాంసంగ్‌కు భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ డివైజ్‌ల మాదిరే ఈ ఫోన్ వెనుకవైపు మెటల్ గ్లాస్‌తో రూపొందుతుంది. గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు - కార్నింగ్ గెరిల్లా గ్లాస్ 5 బ్యాక్ ప్యానల్ - 6.3 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే - క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ - ఆండ్రాయిడ్ ఎన్ - 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్స్ల్ ఫ్రంట్ కెమెరా - 6జీబీ ర్యామ్ - 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ - 3300ఎంఏహెచ్ బ్యాటరీ
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement