-
శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్ దంపతులు
-
నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇది
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడిపడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమా చేశాం. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్రిటిక్స్ రివ్యూస్ చదివాను. వారు ఫీల్ అయ్యింది రాశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. కొందరు ఆడియన్స్ కూడా ఫోన్ చేశారు. సినిమాలో ఫస్ట్‌హాఫ్ భాగుందని, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయని చెప్పారు. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సుధాకర్. ‘‘ఈ సినిమాలో కొత్త శర్వాను చూశాం. ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్‌లో శర్వా నటన అద్భుతం. హనుగారు బాగా తీశారు. ఇందులో నాకు డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు నటుడు శత్రు. ‘‘ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సెన్సిబుల్ అండ్ మ్యూజికల్ హిట్ మూవీ. ఇందులో సూర్య పాత్రలో శర్వా, వైశాలి పాత్రలో సాయిపల్లవి బాగా నటించారు. హీరోయిన్ స్నేహితురాలు శాలిని పాత్రలో నటించే అవకాశం నాకు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. సుధాకర్‌గారు మరిన్ని విజయాలు అందుకోవాలి’’ అన్నారు కల్పిక. -
నచ్చితే వాళ్ళతో నటించడానికి రెడీ..
తమిళసినిమా: కాలానికి తగ్గట్టుగా మారకుంటే నిలదొక్కుకోవడం కష్టం అంటోంది నటి కాజల్‌అగర్వాల్. ఈ ఉత్తరాది బ్యూటీ బాణీ మార్చింది. అందుకే ఇంకా కథానాయకిగా తన స్థానాన్ని పదిల పరచుకుంటోందని చెప్పవచ్చు. నటిగా ఈ అమ్మడి వయసు దశాబ్దన్నరను పూర్తి చేసింది. అయినా నాయకిగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్నానే ఉంది. ప్రస్తుతం అయితే గత ఏడాది కాజల్ నటించిన 4 చిత్రాలు తెరపైకి వచ్చాయి. అందులో విజయ్‌తో నటించిన మెర్శల్, అజిత్‌కు జంటగా నటించిన వివేకం వంటి తమిళ చిత్రాలు, చిరంజీవి సరసన నటించిన ఖైదీ నంబర్ 150, రానాతో నటించిన నేనేరాజు నేనేమంత్రి వంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడి జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అవకాశాలు పలచబడ్డాయి. తమిళంలో ప్యారీస్ ప్యారీస్ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో యువ నటుడు శర్వానంద్‌తో రొమాన్స్ చేయడానికి ఒకే చెప్పింది. ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు యువ హీరోలతో నటించడంలో ఆంతర్యం తన మార్కెట్‌ను నిలుపుకునే ప్రయత్నంలో భాగమేనంటున్నారు సినీ వర్గాలు. అయితే ఆ బ్యూటీ ఏమంటుందో చూద్దాం! నేను అందంగా ఉంటానని అందరూ అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే నేనూ అను నిత్యం శ్రమిస్తుంటాను. 15ఏళ్లుగా నటిస్తున్నాను. ఇప్పటికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అదృష్టం లేకపోతే ఇదంతా జరగదు. నేను పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నన్ను ఉత్తరాదికి చెందిన నటిగా భావించకుండా ఈ రెండు భాషల ప్రేక్షకులు తమ భాష అమ్మాయిగా ఆదరిస్తున్నారు. ఇది నేను చేసుకున్న భాగ్యం. ప్రస్తుతం తమిళంలో ప్యారీస్ ప్యారీస్ చిత్రంలో నటిస్తున్నాను. ఇది హిందీలో మంచి విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్. ఇక తెలుగులో శర్వానంద్‌కు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను. ఇప్పటి వరకూ ప్రముఖ హీరోలతో నటించిన మీరు ఇప్పుడు యువ నటులతో నటించడానికి అర్హులేనా అని అడుగుతున్నారు. కాలానికి తగ్గట్టు మారితేనే ఇక్కడ నిలబడ గలం. నేనూ అదే మార్గంలో పయనిస్తున్నాను. కథ, పాత్ర నచ్చితే యువ కథానాయకులతో నటించడానికి నేను సిద్ధమే అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
చూడకపోతే చూడండి... చూస్తే మళ్లీ చూడండి
‘‘వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నా. ‘మహానుభావుడు’ సినిమా ద్వారా వైజాగ్ ప్రజల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమా చూడకపోతే చూడండి.. చూస్తే మళ్లీ చూడండి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ దసరా సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం థ్యాంక్స్ మీట్‌ని వైజాగ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దసరావళి కార్యక్రమంలో థ్యాంక్స్ మీట్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మారుతి, శర్వానంద్ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివాళ్లే. ఈ చిత్రం హిట్ అయినందుకు సో హ్యాపీ’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని మరచిపోయేలా ‘మహానుభావుడు’ చిత్రానికి విజయం అందించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాని అందరూ ఇంకా బాగా ఆదరించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘‘నా రెండో చిత్రం ‘మహానుభావుడు’. మా చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు మెహరీన్. ‘‘మా సినిమా సక్సెస్ ఎనర్జీ మమ్మల్ని వైజాగ్ వచ్చేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్, సహనిర్మాత ఎస్కెఎన్ పాల్గొన్నారు. -
తల్లిపాత్ర పోషిస్తున్న నిత్యామీనన్
చిన్న వయసులో తల్లిపాత్ర పోషించాలంటే హీరోయిన్లు ససేమిరా అంటారు. కానీ, నిత్యామీనన్ మాత్రం తాను ఆ పాత్రను చేయడానికి సిద్ధం అంటూ ముందుకొచ్చింది. త్వరలో ఆమె చేయబోతున్న ఓ తెలుగు సినిమాలో తల్లి పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తనుంది. ఇప్పటికే దాదాపు అన్ని దక్షిణభారత భాషల్లోను నటించి, తెలుగులో కూడా మంచి హిట్లు సాధించిన ఈ మళయాళ కుట్టి.. 'ఓనమాలు' దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో తల్లి పాత్ర పోషించబోతోంది. ఐస్ క్రీం సినిమాలో నటించిన తేజస్వి ఈ సినిమాలో నిత్య కూతురిగా నటిస్తుందట. సినిమా స్క్రిప్టు వినగానే నిత్యామీనన్ చాలా ఆనందంగా, ఆసక్తిగా స్పందించిందని, ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిందని చిత్రం యూనిట్ వర్గాలు తెలిపాయి. ఏదో మూసపాత్రలు చేసుకుంటూ గ్లామర్ ఒలికించడం కాకుండా.. విభిన్నమైన పాత్రలు చేయడం తనకు ఇష్టమని, ఇలాంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయంటూ వెంటనే ప్రాజెక్టు ఆమోదించిందని అన్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇంతకుముందు ఏమిటో ఈ మాయ సినిమాలో చేశారు. ఇప్పుడు రెండోసారి ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా ఓ క్రీడాకారుడి పాత్ర పోషిస్తాడట.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement