-
విజృంభించిన ఉనద్కత్.. ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్ర
Vijay Hazare Trophy 2022 Saurashtra VS Karnataka: విజయ్ హజారే ట్రోఫీ 2022లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటకపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌరాష్ట్ర.. జయదేవ్ ఉనద్కత్ (4/26), ప్రేరక్ మన్కడ్ (2/34) విజృంభించడంతో కర్ణాటకను 171 పరుగులకే (49.1 ఓవర్లు) కుప్పకూల్చింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో సమర్థ్ (88) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 172 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత కోలుకుని 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జే గోహిల్ (61) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (33), ప్రేరక్ మన్కడ్ (35), అర్పిత్ వసవద (25 నాటౌట్), చిరాగ్ జానీ (13 నాటౌట్) తలో చేయి వేసి జట్టును గెలిపించారు. ఇదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు), అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో మహారాష్ట్ర జట్టు 12 పరుగుల తేడాతో అస్సాంపై విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన అస్సాం లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రిషవ్ దాస్ (53), శివ్‌శంకర్ రాయ్ (78), స్వరూపం పుర్కాయస్తా (95) అర్ధశతకాలతో రాణించి, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన మహారాష్ట్ర రేపు (డిసెంబర్ 2) జరుగబోయే ఫైనల్లో తొలి సెమీస్ విన్నర్ సౌరాష్ట్రతో తలపడనుంది. -
టమోటా నుంచి సోలార్ పవర్
న్యూఢిల్లీ: వంటకాల్లో విరివిగా ఉపయోగించే టమోటాలతో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు సోలార్ సెల్‌ను తయారు చేశారు. ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్‌లో ఉపయోగిస్తున్న సిలికాన్ సెల్స్ కన్నా ఇది ఎంతో చవకైనదని వారు తెలియజేశారు. టమోటా నుంచి తీసిన రసాయనాలకు కార్బన్, టైటానియం డైఆక్సైడ్ మిశ్రమాన్ని కలిపి ఓ పల్చటి ఫిల్మ్‌ను తయారు చేశామని, ఆ ఫిల్మ్ ఎండపడే విండో కిటీకీ అద్దానికి అతికించామని, ఆ ఫిల్మ్ నుంచి ఓ వైరును లాగి దాన్ని విద్యుత్ బల్బ్‌కు అమర్చగా ఆ బల్బ్ దేదీప్యమానంగా వెలిగిందని ఈ పరిశోధనల్లో పొల్గొన్న ప్రొఫెసర్ నికేశ్ షా వివరించారు. ఈ టమోటా సోలార్ సెల్‌కు తాము భారత ప్రభుత్వం ‘కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్’ నుంచి పేటెంట్ కూడా పొందామని చెప్పారు. ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్‌లో సిలికాన్ సెల్స్‌ను ఉపయోగిస్తున్నారని, సిలికాన్ ధర ఎక్కువవడమేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, అదే టమోటా అయితే మన వద్దనే విరివిగా దొరుకుతుందని నికేశ్ తెలిపారు. వాణిజ్యపరంగా టమోటా సెల్స్‌ను ఉత్పత్తి చేసినట్టయితే దాదాపు సిలికాన్ సెల్స్కన్నా దాదాపు 75 శాతం ఖర్చు తక్కువవుతుందని ఆయన చెప్పారు. తాము కనిపెట్టిన ఈ కొత్త విధానం ద్వారా పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు తదుపరి చర్యలు తీసుకుంటున్నామని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం, వీవీ ఇంజనీరింగ్ కాలేజ్‌కి చెందిన నానో టెక్నాలజీ విభాగం అధిపతి జయసుఖ్ మార్కానా తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement