-
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా? ఈ ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడేం చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్‌నైట్ స్టార్డడమ్ సంపాదించుకుంది అరుణ. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. చటంబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తాచాటింది. అయితే హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే బిజినెస్‌మ్యాన్ మోహన్గుప్తను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికి నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇందులో వంటలు, హెల్తీ లైఫ్, వర్కవుట్స్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్‌లోకి రావడంతోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) -
నువ్వు పట్టుచీర కడితే...
సినిమా పాటను ఒక కావ్యస్థాయికి తీసుకెళ్లడం ప్రతిసారీ జరగదు. చిక్కటి కవిత్వం జాలువారిన అరుదైన వ్యక్తీకరణలు కొన్నిసార్లు చెవులకు మహా ఇంపుగా వినబడతాయి. అట్లాంటి ఒక భావన ‘సీతాకోకచిలుక’ చిత్రం కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ‘అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే’ గీతంలోని ఒక చరణంలో ఆయన రాసిన ఈ పాదాల్లో ఎంత కవిత్వం ఉంది! ప్రేయసిని ఇంతకంటే పొగడటం ఏ ప్రియుడికైనా సాధ్యమా! ‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ. దీనికి సంగీతం సమకూర్చింది ‘మైస్ట్రో’ ఇళయరాజా. పాడింది వాణీ జయరాం, ఇళయరాజా. 1981లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు భారతీరాజా. కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించారు. ఒకేసారి షూటింగ్ ప్రారంభించిన ఈ ద్విభాషా చిత్రంలో, తమిళంలో ఇదే అర్థం వచ్చే పంక్తులు ఉండటమూ, వాటి కర్త వైరముత్తు అని ఉండటమూ విశేషం. అయితే ఈ భావానికి ఎవరు అసలు కర్త అనేది పరిశోధకులు తేల్చాల్సిన అంశం. -
సీతాకోక చిలుక
33 ఏళ్ల క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగిన అలీకి అవార్డు తీసుకుంటున్నానన్న ఆనందం కంటే హైదరాబాద్‌లో అడుగుపెట్టానన్న సంతోషంతోనే మనసు నిండిపోయింది. రద్దీలేని చార్మినార్ వీధులు, పంజగుట్ట షాన్‌బాగ్ హోటల్లోని ఇడ్లీసాంబార్, రాత్రిపూట స్నేహితులతో బిర్యానీ... ఇలా హైదరాబాద్‌తో తనకున్న ముప్పై ఏళ్ల అనుబంధం... భవిష్యత్తులో భాగ్యనగరం కోసం తను కనే కల...అన్నింటినీ గుర్తుచేసుకుంటున్నప్పుడు అలీలోని ఓ హైదరాబాదీ బయటకొచ్చాడు. ‘‘సీతాకోకచిలుక సినిమాకి నాకు ‘స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవార్డు’ వచ్చింది. ఆ చిన్నవయసులో ప్రభుత్వ అవార్డు వచ్చిందని తెలియగానే చాలా సంతోషపడ్డాను. ఆ అవార్డు ప్రదానం హైదరాబాద్‌లో అని తెలియగానే ఎగిరి గంతేయాలనిపించింది. హైదరాబాద్‌ని అప్పటివరకూ సినిమాల్లో చూడ్డమే గాని ఎప్పుడూ రాలేదు. ప్రభుత్వం అవార్డుతో పాటు మద్రాసు నుంచి హైదరాబాద్‌కి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చారు. దాంతో మొదటిసారి హైదరాబాద్‌కి విమానంలో వచ్చి ఇంకొంత గొప్పగా ఫీలయ్యాను. బేగంపేటలో విమానం దిగి నేను, నాన్న నేరుగా సికింద్రాబాద్ దగ్గరున్న డెక్కన్ కాంటినెంటల్ హోటల్‌కి వెళ్లాం. ఇప్పుడు ఆ హాటల్ స్థానంలో కిమ్స్ ఆసుపత్రి ఉంది. తర్వాత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుని సాయంత్రం వేళలో చార్మినార్ చూడ్డానికి వెళ్లాం. అవార్డుతోపాటు మొదటిసారి హైదరాబాద్‌లో చూసిన అద్భుతమైన విశేషాలనూ వెంటబెట్టుకుని మా స్వస్థలం రాజమండ్రి వెళ్లాను. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 33 ఏళ్లవుతుంది. ఇప్పటికీ ఆ రోజు నేను చూసిన దృశ్యాలు నా కళ్లముందుంటాయి. ఇల్లుకొని 20 ఏళ్లు... 1994లో మద్రాసు నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చాను. శ్రీనగర్‌కాలనీలో ఫ్లాట్ కొన్నాను. అప్పటివరకూ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు మద్రాసులో రెలైక్కడం, పనైయ్యాక వెళ్లిపోవడం. హైదరాబాద్‌లో షూటింగ్‌ని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో పరిసరాలను కూడా అంతే ఇష్టపడేవాడ్ని. ముఖ్యంగా పంజగుట్ట సెంటర్లోని షాన్‌బాగ్ హోటల్. మద్రాసులో సాంబార్ఇడ్లీ అలవాటు కదా మాకు...అలాంటి టిఫిన్ ఒక్క షాన్బాగ్లోనే ఉండేది. షూటింగ్ అయ్యాక సాయంత్రం వస్తూ వస్తూ నాంపల్లి దగ్గర ఒక ఇరానీ చాయ్ కొట్టి రూమ్‌కి చేరుకునేవాళ్లం. చాయ్... చాయ్ మామూలుగా ఏ ప్రాంతంవారైనా పొద్దున, సాయంత్రం వేళలో టీలు తాగుతారు. మన హైదరాబాద్‌లో అర్ధరాత్రి కూడా చాయ్ తాగే అలవాటు ఉంటుంది. అప్పట్లో ఇక్కడ మా స్నేహితులు రాత్రి పదిగంటలకు బిర్యానీ తిని వెంటనే చాయ్ తాగేవారు. ‘ఇదెక్కడి అలవాటురా బాబు...’ అంటే ‘తిన్నది మంచిగ అరుగుతదిరా బై..’ అనేవారు. ముందు పేర్లు పెట్టినా...తర్వాత మెల్లగా నాకూ అలవాటైపోయింది. హైదరాబాద్‌లో చాయ్ తాగడానికి ఫలానా టైం ఉండదని అర్థమైంది. నిజాం గోడతో ఎండ్... అప్పట్లో అన్నపూర్ణ స్డూడియో తర్వాత హైటెక్‌సిటీ వెళ్లే దారిలో పెద్ద గోడ ఉండేది. నిజాం కాలం నాటి గోడ. ఆ గోడపై నా ‘పిట్టలదొర’ సినిమా వాల్‌పోస్టర్‌ని అతికించారు కూడా. తర్వాత రోడ్లు వెడల్పు చేసేపనిలో భాగంగా ఆ గోడను పడగొట్టేశారు. ఆ గోడ దాటాక ఏమీ ఉండేవి కావు. బంజారాహిల్స్‌లో కొందరు డబ్బున్న లంబాడాలు ఉండేవారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాలయితే మొత్తం కొండలూ గుట్టలే. విశేషమేమిటంటే... పాతికేళ్లక్రితమే మన హైదరాబాద్‌లో అద్భుతమైన ఇళ్లు ఉండేవి. ఆ రోజుల్లోనే అమితాబ్‌బచ్చన్ లాంటివారు హైదరాబాద్ వచ్చినపుడు ఇంత ఖరీదైన ఇళ్లు మా ముంబైలోనే లేవని చెప్పారట. నిజమే... మన సిటీలో ఉన్నన్ని ఖరీదైన ఇళ్లు, నిజాంనాటి అద్భుతమైన కట్టడాలు దేశంలో ఇంకెక్కడా లేవు. ఫలక్నుమప్యాలెస్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో వచ్చి ఇక్కడున్న తలుపులకు బంగారు గొళ్లాలు ఉండేవని చెప్పారు. పదేళ్లకిందట కూడా అక్కడి పరిసరాల్లో బంగారు నాణాలు దొరికాయని వార్తలొచ్చాయి. నిజాం పాలన సంగతి పక్కన పెడితే ఈ భాగ్యనగరాన్ని సొంత ఇంటిలా నిర్మించాడనడంలో సందేహం లేదు. చెత్తను మాయం చేస్తేగాని... హైదరాబాద్ గురించి నేనేదైనా కలగనాలంటే... ఒక్కటే కల. చెత్త కనిపించని నగరాన్ని చూడాలని. కేరళలో ఎవరింటి చుట్టుపక్కల చెత్తను వారే వారానికొకసారి కాల్చేస్తుంటారు. ప్రభుత్వ అధికారులు చీపుళ్లు పట్టుకొచ్చి మనింటి ముందు ఊడ్చాలనే ఆలోచన అక్కడి ప్రజలకుండదు. దాంతో ఏ వీధి చూసినా శుభ్రంగా కనిపిస్తుంది. మన నగరవాసులకు కూడా అలాంటి ఆలోచన రావాలి. గోడపై నుంచి చెత్త విసిరేయడంతో మన పని ముగిసిపోయిందను కుంటున్నాం. ఫలితం...వర్షాకాలం వచ్చిందంటే...ప్లాస్టిక్ బాటిల్స్, కాగితాలు, పనికి రాని వస్తువులతో నాలాలన్నీ మూసుకుపోయి మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తుంది. ఈ విషయంలో మన ప్రవర్తనలో మార్పు రావాలి. హైదరాబాద్‌ని అందమైన నగరంగా మాత్రమే కాదు.. శుభ్రమైన నగరమని కూడా చెప్పుకోవాలి. - భువనేశ్వరి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
తప్పక చదవండి
- పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
Advertisement