-
నంబర్ 2
సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ అనే ట్యాగ్ ఇక ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె కథానాయికగా నటించిన ‘కేదార్నాథ్’ చిత్రం విడుదలైంది. సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు సారా నంబర్ 2. ఒక్క సినిమా రిలీజైతేనే నంబర్ 2 ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఆమె నంబర్ 2గా నిలిచింది గూగుల్ సెర్చ్‌లో అన్నమాట. ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బాలీవుడ్ కథానాయికల్లో సారా నంబర్ టూ. ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంకా చోప్రా నిలిచారు. ఇక రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది హిందీ రీమేక్. -
దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం
-
దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం
ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం కురుస్తోంది. ఆసియా మార్కెట్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లలోని ప్రధాన సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ రెండూ ఎలాంటి వెనకడుగు లేకుండా బుల్‌రన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్ళ జోరుతో సెన్సెక్స్ 32609 వద్ద నిఫ్టీ ఆల్ టైంహైని నమోదు చేసింది. నిఫ్టీ 10,110 దాటేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 25వేల మార్క్‌కు చేరువలో ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ హైని తాకింది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్, హెచ్ సీఎల్ టెక్నాలసీజ్ హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎల్ అండ్‌టీ, ఐడియా, ఐటీసీ, మారుతీ సుజుకి, జీఎంఆర్, ఇండియా బుల్స్ రియల్, రాడికా ఖైతాన్, శ్రీరేణుకా లాభపడుతున్నాయి. అటు టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బోష్ నష్టాల్లో ఉన్నాయి. -
స్టాక్‌మార్కెట్ల దూకుడు: రికార్డుల మోత
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్నిసెషన్లుగా జోరుమీద ఉన్న సూచీలు చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీ సాధించి, నిఫ్టీ కూడా 9900 స్థాయికి సమీపంలో మెరుపులు మెరిపిస్తోంది. ఆరంభంనుంచి దూకుడును ప్రదర్శిస్తున్న సెన్సెక్స్ ప్రస్తుతం 210 పాయింట్లు ఎగిసి 32008వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 9877 వద్ద తమ జోరును కొనసాగిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల లాభాల దౌడు తీస్తున్నాయి. ఐటీసీ టాప్ విన్నర్‌గా ఉంది. -
ఎయిర్‌లైన్స్ షేర్ల జోరు
స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నప్పటికీ, విమానయాన రంగ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బోయింగ్విమానాలను కొనుగోలు ఒప్పంద వార్తలతో స్పైస్ జెట్ భారీగా లాభపడింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో), స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్ షేర్లు 1.3 శాతం నుంచి 2.5 శాతం రేంజ్లో లాభాలతో ట్రేడవుతున్నాయి. దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ గత నెలలో 17 శాతం పెరిగిందన్న వార్తల విమానయన రంగ షేర్ల జోరుకు కారణమని నిపుణులంటున్నారు. ఇంట్రాడేలో స్పైస్ జెట్, ఇండిగో రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. స్పైస్‌జెట్‌కు జీవిత కాల గరిష్ట స్థాయిని, ఇండిగోకు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. ముందున్నది మంచి కాలమే... ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, జీఎస్టీ అమలు కారణంగా విమాన చార్జీలు తగ్గి మరింత మంది విమానయానం చేసే అవకాశాలు తదితర అంశాల కారణంగా విమానయాన రంగ షేర్లు జోరుగానే పెరుగుతాయని నిపుణులంటున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి విమానయాన రంగం బైటపడిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. జూన్ క్వార్టర్లో ఈ రంగ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయని పేర్కొంది. వ్యయాలు తగ్గుతున్నందున ధరల విషయంలో విమానయాన కంపెనీలు క్రమశిక్షణ పాటిస్తే మార్జిన్లు పెరిగే అవకాశాలున్నాయని వివరించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement