-
పాప్ సింగర్ అరెస్టు..
గన్‌లోడ్ చేసి పోలీస్‌కే గురిపెట్టిన కుర్రాడిని అమ్మాయిలు లైక్ చేస్తే చెయ్యొచ్చు. గవర్నమెంట్ మాత్రం డిస్లైక్ చేస్తుంది. అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. పంజాబీ పాప్ సింగర్ శ్రీ బ్రార్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. నెలక్రితం అతడు విడుదల చేసిన మ్యూజిక్ వీడియో ‘జాన్’.. గన్ కల్చర్‌ను ప్రేరేపిస్తుందన్న ఆరోపణపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కోటీ నలభై లక్షల మంది చూసిన ‘జాన్’లో అంతగా మందుగుండు సామగ్రి ఏముంది?! ముంబై: పంజాబ్ సీఎం తన రాష్ట్రం మీద మాట పడనివ్వరు. తన రాష్ట్రాన్ని మాట అనిపించుకునేలానూ ఉండనివ్వరు. ఇప్పుడేమైందో చూడండి. పంజాబ్‌లో శ్రీ బ్రార్ అనే ర్యాప్ సింగర్ ఉన్నాడు. అతడు ‘జాన్’ అనే వీడియో సాంగ్ చేశాడు. పోలీస్‌ల పైనే గన్స్ ఎక్కుపెడతాడు బ్రార్ అందులో. యూత్ బాగా ఎట్రాక్ట్ అయింది ఆ సాంగ్‌కి! కోటీ నలభై లక్షల వ్యూస్ వచ్చాయి. ఎట్రాక్ట్ అయితే అయ్యారు.. గన్ కల్చర్‌కి అడిక్ట్ అవుతారేమోనని పోలీసులు బ్రార్‌ను అరెస్టు చేశారు. ‘‘మంచి పని చేశారు. అరెస్ట్ చేయాల్సిందే అతడిని’ అని సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇంత చిన్న విషయంలో సీఎం కల్పించుకోవడం పెద్ద విషయమే. ఆ వీడియోలోని తారాగణంలో, తాత్పర్యంలో ఉన్న ప్రభుత్వ ధిక్కార ధోరణులే అందుకు కారణం. ‘జాన్’ నెల క్రితమే విడుదలైంది. శ్రీ బ్రార్ తోపాటు వీడియోలో బార్బీ మాన్ అనే లేడీ ర్యాపర్, గుర్నీత్ దొసాంజ్ అనే పాప్ ఆర్టిస్ట్ నటించారు. అందులోని మందు గుండు సాహిత్యం మాత్రం బ్రార్దే. ఈ వీడియో సాంగ్‌లో గుర్నీత్ రెండు చేతుల్తో రెండు గన్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు. స్టేషన్‌లోని పోలీసుల్ని టపాటపామని లేపేసి, లాకప్ లాక్‌లను పేల్చేసి తన ‘అక్యూజ్డ్’ ఫ్రెండ్స్‌ని విడిపించుకుని వెళ్తాడు. ఈ హీరోయిజాన్నంతా బార్బీ ఆరాధన భావంతో చూస్తూ ఉంటుంది. ఈ దృశ్యాల వెనుక మన బ్రార్ రాసిన సాంVŠ రన్ అవుతుంటుంది. ‘నో డౌట్.. నో డౌట్ నీకు మీసాలొచ్చాయ్. నీ పొలంలో కొత్త ట్రాక్టర్ గర్జిస్తోంది. ఓ జాట్ కుర్రాడా.. నీకు నువ్వే ఒక బ్రాండ్. నేరాన్ని శ్వాసించే వాళ్లంతా నీ వైపే. అందుకే వాళ్లను విడిపించేందుకు వెళ్తున్నావ్. పోలీసులకు నువ్వేమిటో చూపించు..’ అని పంజాబీలో బార్బీ మాన్ పాడుతుంటుంది. ఈ సాంగ్.. గన్ కల్చర్‌ని ప్రోత్సహించేలా ఉందని శ్రీ బ్రార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు పెట్టింది పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ విక్రమ్ జీత్ దుగ్గల్. హింసను ప్రేరేపించడం, సంఘ విద్రోహశక్తులను పురికొల్పడం, గ్యాంగ్స్టర్లకు ఆశ్రయం ఇమ్మని వీడియోలో ఇన్‌డైరెక్టుగా చెప్పడం.. బ్రార్‌పై ప్రధాన ఆరోపణలు. ‘ప్రిన్స్ ఆఫ్ పటియాలా’ గా 2016లో పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు బ్రార్. చండీగఢ్ కుర్రాడు. కాలేజ్‌లో ఆర్ట్స్ స్టూడెంట్. కరన్ అవుజ్లా, దిల్‌ప్రీత్ థిల్లాన్‌తో కలిసి పాడిన పంజాబీ సాంగ్ ‘యార్ గ్రరీబాజ్’తో ఇతడొకడున్నాడని ఇండీపాప్ సీనియర్ ఆర్టిస్టుల దృష్టిలో పడ్డాడు. పెద్దగా ఆల్బమ్‌లు లేకపోయినా, వచ్చిన కొత్తల్లో చేసిన అరకొర సాంగ్స్.. ఇప్పుడతడిపై వచ్చిన ఆరోపణల్ని పోగొట్టి.. ‘కుర్రాడు మంచివాడే’ అనే ఆలోచన కలిగించేంత బలమైనవి కావు. బ్రార్ ఎన్నో రోజులు జైల్లో ఉండకపోవచ్చు. సీఎం అమరీందర్ సింగ్ శిక్షకు బెదరేలా చేస్తారు కానీ, శిక్ష విధించరని అంటారు. ఇక ‘జాన్’లోని బార్బీ మాన్‌కి బ్రార్‌ని మించిన ప్రొఫైలే ఉంది. ఫిరోజ్ పూర్ అమ్మాయి. పంజాబీ, భాంగ్రా, పాప్‌లో యువతను ఆకట్టుకునే స్వరాభినయం బార్బీది. 2020 జూన్‌లో రిలీజ్ అయిన బార్బీ సింగిల్ ‘తెరీ గలీ’ని ఒక్క నెలలో 2 కోట్ల 90 లక్షల మంది యూట్యూబ్ వ్యూయర్స్ చూశారు. ‘మేరీ సహేలీ’ ట్రాక్‌తో రెండేళ్ల క్రితం మొదలైన బార్బీ కెరీర్ ఇప్పుడు పీక్‌లో ఉంది. బీబీసీ చార్ట్‌లో ఆమె పేరు ఉంది. ఇప్పుడీ ‘జాన్’తోనూ ఆమెకు పేరు వచ్చిందే తప్ప, బ్రార్ సాహిత్యానికి గాత్రమిచ్చినందుకు పంజాబ్ ప్రభుత్వం ఏమీ అనలేదు. -
డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్
చండీగడ్ : అనారోగ్యం కారణంగా హాస్పటిల్‌లో చేరగా, పరీక్షలు నిర్వహిస్తే అతను మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పంజాబీ గాయకుడు గురీందర్ పాల్ సింగ్ అలియాస్ బడ్డా గ్రెవాల్ 30 గ్రాముల ఓపియమ్(నల్లమందు) తీసుకోవడంతో.. అనారోగ్యం కారణంగా సొహానాలోని ఎస్‌జీహెచ్‌ఎస్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు సోహనా పోలీసులు శుక్రవారం గురీందర్‌ను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్పిడిఎస్) చట్టంలోని 27, 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సబ్ ఇన్స్పెక్టర్ హర్జిందర్ సింగ్ తెలిపారు. మరోవైపు పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. దీనిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ప్రధాని మోదీకి గతంలో లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి హోంశాఖ, ఆరోగ్య, న్యాయ శాఖలతో చర్చించి మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరారు. -
మహిళకు బెదిరింపులు.. గాయకుడి అరెస్టు
తనను తుపాకితో బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో గాయకుడు క్రిస్ బ్రౌన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకర ఆయుధంతో బెదిరించి, దాడి చేసిన నేరానికి గాను బ్రౌన్‌ను అరెస్టుచేస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ పోలీసు డిపార్ట్మెంట్ (ఎల్ఏపీడీ)కి చెందిన లెఫ్టినెంట్ క్రిస్ రామిరెజ్ మీడియాకు తెలిపారు. లాస్ ఏంజెలిస్‌లోని టార్జానా ఎన్క్లేవ్ ప్రాంతంలోగల తన గేటెడ్ ఎస్టేట్‌నుంచి బయటకు రాబోయే ముందు బ్రౌన్ తనను తుపాకితో బెదిరించినట్లు ఆ మహిళ పోలీసులకు వివరించింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని రామిరెజ్ తెలిపారు. ఇప్పటికీ బ్రౌన్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని, అందువల్ల ఆయుధాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే ఒక దాడి కేసులో ఇరుక్కున్నా.. తాను నిర్దోషినని చెప్పిన బ్రౌన్, ఈసారి అసలు ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన డిటెటక్టివ్లకు సహకరించారని రామిరెజ్ తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement