-
ఆకాశంలో స్విమ్మింగ్
-
ఆకాశంలో స్విమ్మింగ్ పూల్
ఆకాశంలో స్విమ్మింగ్ పూల్ ఏంటని ఆశ్చర్యంగా ఉందా? నిజంగా నిజమేనండోయ్..! ప్రపంచంలో తొలి 'స్కై పూల్'ను లండన్‌లో నిర్మిస్తున్నారు. రెండు విలాసవంతమైన పెద్ద భవంతుల మధ్య.. భారీ ఖర్చుతో అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 10 అంతస్తులున్న రెండు టవర్ల మధ్య 90 అడుగుల పొడవు, 4 మీటర్ల లోతు ఉండేలా ఈ స్విమ్మింగ్ పూల్ ను నిర్మిస్తున్నారు. ఇది థేమ్స్ నదికి సమీపంలో ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్‌లో నుంచి లండన్ నగరాన్ని వీక్షించవచ్చు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి పూర్తిగా ట్రాన్సపరెంట్ గ్లాస్ వాడారు. నీళ్లు, మనుషుల బరువును ఈ స్విమ్మింగ్ పూల్ తట్టుకుంటుందా? ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే ఈ స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొట్టడానికి ఎవరూ భయపడాల్సిన పనిలేదని నిర్మాణ సంస్థ బాలీమోర్ గ్రూపు తెలిపింది. ఈ గ్లాస్ బాడీ 8 అంగుళాల మందంతో పటిష్టంగా ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల కంటే ఏడు రెట్లు మందంగా ఉంటుంది. కాగా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం 2018 నాటికి పూర్తికానుంది. ఈ టవర్స్‌లోని అపార్ట్మెంట్లను మాత్రం వచ్చే సెప్టెంబర్ నుంచి అమ్మకానికి పెడుతున్నారు. ఒక్కో ప్లాట్ ప్రారంభ ధర ఎంతంటే అక్షరాల 6.20 కోట్ల రూపాయలు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement