-
క్రీడా బడ్జెట్లో రూ. 230 కోట్లు కోత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు. ► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది. ► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తోపాటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్ఎస్ఎఫ్) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది. ► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు. ► కామన్వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్‌ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు. ► గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్‌ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది. -
భారీగా పెరిగిన క్రీడా బడ్జెట్
న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే ఈసారి క్రీడా బడ్జెట్ పెరిగింది. శనివారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి భారీగా నిధులిచ్చారు. 2015-16 సంవత్సరానికి గాను రూ.384 కోట్ల పెరుగుదల కనిపించింది. ఓవరాల్‌గా క్రీడలకు రూ.1,541.13 కోట్లను కేటాయించగా... ఇందులో ప్రణాళికా వ్యయం రూ.1,389.48 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.151.65 కోట్లున్నాయి. గతేడాది ఈ మొత్తం రూ.1156.61 కోట్లుగా ఉంది. అలాగే ప్రణాళికా వ్యయం కూడా దాదాపు రూ.381 కోట్లు... ప్రణాళికేతర వ్యయం రూ.3.04 కోట్లు పెరిగింది. ఇక ప్రస్తుత క్రీడా బడ్జెట్లో రూ.886.57 కోట్లు క్రీడలకు ఖర్చు చేయనుండగా.... రూ.336.62 కోట్లు యువజన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తారు. సాయ్కు రూ.369.39 కోట్లు లభించనున్నాయి. జాతీయ క్రీడా సమాఖ్యలకు గతంలాగే రూ.185 కోట్లు కేటాయించారు. ప్రతిభాన్వేషణ, శిక్షణ పథకానికి రూ.5 కోట్లు, డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు రూ.11.60 కోట్లు, జాతీయ డోపింగ్ పరిశోధన ల్యాబొరేటరీకి రూ.8.9 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. -
మన క్రీడా బడ్జెట్ రూ.40.18 కోట్లు
నల్లగొండ స్పోర్ట్స్ :‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ‘మన ఊరు-మన క్రీడా’ బడ్జెట్ రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం నయాపైసా కూడా విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ‘పైకా’ నిధులు మినహా మరెలాంటి ఆర్థిక సహాయం రాష్ట్రం నుంచి అందలేదు. కేవలం మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే క్రీడలకు సంబంధించి క్రీడాకారుల ఎంపికకు మాత్రమే నామమాత్రంగా నిధులు విడుదలయ్యేవి. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా వ్యవహరించిన కిరణ్ కుమార్‌రెడ్డి స్టేడియాల అభివృద్ధి పట్ల కొంత కరుణ చూపించారు. ‘గ్రీన్ ఫీల్డ్ స్టేడియం’ల పేరిట జిల్లాలోని ఐదు స్టేడియాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకుగాను రూ. 6 కోట్లు నిధులు విడుదల చేశారు. వీటితోపాటు మరమ్మతుల కోసం మరో రూ.20 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఆ పనులు చివర దశకు చేరుకున్నాయి. ఇవి తప్ప ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు క్రీడల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సహాయమూ రాష్ట్రం నుంచి అందలేదు. తెలంగాణ రాష్ట్రంలో జీవం.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు మళ్లీ మంచిరోజులు రానున్నాయి. టీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా క్రీడలకు సైతం పెద్దపీట వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ‘మన ఊరు-మన క్రీడా’ పేరిట ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేశారు. కొత్త రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీలు సికింద్రాబాద్, కరీంనగర్లో మాత్రమే ఉన్నాయి. మన జిల్లాలో ‘హాకీ అకాడమీ’ ఉంది. దీనికి జిల్లా క్రీడల అధికారి (డీఎస్డీఓ) ఇన్చార్జి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో గ్రామ, మండల స్థాయిలో క్రీడా పాఠశాలలు, జిల్లా స్థాయిలో పలు రకాల క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేస్తే బాగుటుందన్న ఉద్దేశంతో అధికారులు పేరొందిన కొన్ని క్రీడలను ఎంపిక చేసి ప్రణాళికలు రూపొందించారు. మన క్రీడా ప్రణాళిక ఇదీ... పంచాయత్ యువ క్రీడా కేల్ అభియాన్ (పైకా) పథకంలో భాగంగా 2008-09 నుంచి 2010-11 వరకు జిల్లాలో 1178 గ్రామాలకు గాను కేవలం 102 గ్రామాల్లోని పాఠశాలల్లో మాత్రమే మైదానాలను అభివృద్ధి చేశారు. దీనికిగాను రూ.49,27,189 ఖర్చు పెట్టారు. ఇంకా 1076 గ్రామాల్లోని పాఠశాలల్లో మైదానాలు అభివృద్ధి పర్చాల్సి ఉంది. దీనికి గాను గ్రామానికి లక్ష చొప్పున రూ.10.76 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. పైకాలో భాగంగానే 2008 నుంచి 2011 వరకు 59 మండలాలకు గాను కేవలం 5 మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో మాత్రమే మైదాలను అభివృద్ధి పర్చారు. దీనికి గాను రూ.9 లక్షల 55 వేలు ఖర్చు పెట్టారు. ఇంకా 54 మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో మైదానాలను అభివృద్ధి చేసేందుకు రూ.27 కోట్లు అవసరం అవుతాయని అధికారుల అంచనా. ప్రభుత్వానికి నివేదించాం మన ఊరు-మన క్రీడా ప్రణాళికలో జిల్లా క్రీడల అభివృద్ధికి అవసరమైన అంశాలన్నింటినీ పొందుపర్చాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వాటిని రూపొందించాం. జిల్లాలో ప్రధాన క్రీడలు, మైదానాలను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు ఈ ప్రణాళిక దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం. - మక్బుల్ అహ్మద్, డీఎస్డీఓ పోస్టుల వివరాలు నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, భువనగిరి, నూతనకల్, తుంగతుర్తి, ఆలేరు, సూర్యాపేట స్టేడియాల్లో 40 మంది కోచ్‌లతోపాటు ఆయా స్టేడియాల్లో మినిస్టీరియల్ సిబ్బంది 20మంది అవసరం ఉంటుంది. క్రీడా పాఠశాలలు : అథ్లెటెక్స్, బాక్సింగ్, హ్యాండ్ బాల్, తైక్వాండో కోచ్‌లు : ఏడుగురు, మినిస్టీరియల్ సిబ్బంది : ఏడుగురు జిల్లా అకాడమీలు : వాలీబాల్, కబడ్డీ, హాకీ కోచ్‌లు : ముగ్గురు, సిబ్బంది : ముగ్గురు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement