-
వైవీయూలో వింత పక్షి
వైవీయూ: వైఎస్సార్ జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో గుడ్లగూబను పోలిన ఓ వింత పక్షి కనిపించింది. వైవీయూ నుంచి గురుకులం వెళ్లే దారిలో గాయపడి ఉన్న ఈ పక్షిని తెలుగు విభాగం ఆచార్యులు తప్పెట రామప్రసాద్‌రెడ్డి, పరిశోధక విద్యార్థులు హిమాచలం, నరేష్, గంగాధర్‌రెడ్డిలు గుర్తించారు. వెంటనే వైవీయూ జంతుశాస్త్రం విభాగం వారికి పక్షిని అప్పజెప్పారు. ఈ పక్షి చూసేందుకు కాస్త గుడ్లగూబ ఆకృతిలోను, ముఖం మనిషిని పోలిన విధంగా ఉండటంతో పలువురు విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. -
స్వేచ్ఛా విహంగాలు (స్ట్రే బర్డ్స్)
ఎందుకు అనువదించానంటే? తెలుగునాట చలం ద్వారా రవీంద్రనాథ్ టాగోర్ కవిత్వానికి అభిమానులైన అనేకమందిలో నేనూ ఒకడిని. ఆ మార్ధవం, లాలిత్యం, తాత్వికత, మరీముఖ్యంగా కవిత్వం నన్నెంతో ఆకర్షించాయి. టాగోర్ ఇతర రచనలకోసం అంతర్జాలంలో వెతకగా దొరికినవాటిలో నన్ను ఆకర్షించినవి స్ట్రే బర్డ్స్, క్రిసెంట్ మూన్. స్ట్రే బర్డ్స్ 1916లో వచ్చింది. నేటికి సరిగ్గా వందేళ్ళు. ఇది రెండుమూడు వాక్యాలుండే 326 లఘు కవితల సంపుటి. ఒక్కో కవితా హైకూలా ఉంటుంది కానీ పాదవిభజన ఉండదు. ఏక వాక్యంలా సాగుతుంది. ఒక్కొక్కటి స్వేచ్ఛగా తిరిగే విహంగాల లాంటి ఆలోచనలకు అక్షర రూపాలు. ఇవి ఒక అందమైన పదచిత్రాన్నో లేక జీవితసత్యాన్నో తెలుపుతాయి. గుంపుగా ఎగిరే విహంగాలకు వేటి స్వేచ్ఛ వాటికుంటుంది. కానీ అన్నీ ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి. ఆ మార్గమే టాగోర్ కవితాత్మ. 1915లో టాగోర్ ఒకనాడు- నది ఒడ్డున ప్రశాంత జలాలనుండి అనంతాకాశంలోకి ఎగిరిపోతున్న కొంగల గుంపును చూసి, ఆ పక్షుల చలనం స్వేచ్ఛా జీవనానికీ, ఆలోచనకూ ప్రతీక అని భావించి ఈ పుస్తకానికి ‘స్ట్రే బర్డ్స్’ అన్న పేరు పెట్టాడంటారు. స్ట్రే బర్డ్స్లోని వాక్యాలలోని కొన్ని టాగోర్ ఇతర రచనలైన ‘కణిక’,‘లేఖన్’లలో కనిసిస్తాయి. వీటిని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి టాగోరే స్వయంగా అనువదించుకొన్నాడు. ఇతర కవితలను నేరుగా ఇంగ్లీషులోనే రచించాడు.తొలిసారిగా చదివినపుడు స్ట్రే బర్డ్స్ నన్ను సమ్మోహపరచింది. మరల మరల చదువుకొన్నప్పుడు ఆ కవితలలో గొప్ప సార్వజనీనత, తాత్వికత, సరళత కనిపించాయి. నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలని అనిపించి 2008లో అనువదించి, నా బ్లాగులో పెట్టినపుడు మంచి స్పందిన లభించింది. దీనిని ‘స్వేచ్ఛా విహంగాలు’ పేరిట ఇప్పుడు పుస్తకంగా తెచ్చాను. ‘అతను తన ఆయుధాలను/ తన దేవుళ్ళుగా చేసుకొన్నాడు/ అతని ఆయుధాల విజయం అతని ఓటమి’ అన్న వాక్యంలో టాగోర్ మానవజాతి ప్రస్థానాన్ని మూడు ముక్కల్లో చెప్పాడా అనిపిస్తుంది. ఈ పుస్తకం వచ్చిన సమయంలో మొదటి ప్రపంచయుద్ధం జరుగుతూన్నది. ఒక తుపాకి పేలటం మానవత్వం ఓటమిగా భావించాలన్న టాగోర్ మాట కాలదోషం పట్టని ప్రాపంచిక విషయం. ‘మృత్యువు అనే ముద్ర, జీవితం అనే నాణేనికి యోగ్యతనిస్తుంది/అప్పుడు మాత్రమే దానితో ప్రియమైన వాటిని కొనగలం’ అనే వాక్యంలో, జీవితాన్ని ప్రేమమయం చేసేది మృత్యువు మాత్రమేనన్న గొప్ప తాత్వికతను చాల సరళంగా చెపుతాడు టాగోర్. ‘చిన్నారి గడ్డిపోచా!/ నీ పాదం చిన్నదే కావొచ్చు కానీ/ పుడమి మొత్తం నీ అడుగుల క్రిందే ఉంది’ అనే వాక్యం పైకి ప్రకృతి వర్ణణలా అనిపించినా తరచి చూస్తే దానిలో జీవితం పట్ల ఉండాల్సిన ఆశావహ దృక్పథం వ్యక్తమౌతుంది.ఈ అనువాదం చేసేటపుడు రూపస్వేచ్ఛా, అక్కడక్కడా భావస్వేచ్ఛా తీసుకొన్నాను. ఇది నాకు అర్థమైన కోణాన్ని ఆవిష్కరించటానికి చేసిన ఒక ప్రయత్నంగానే భావిస్తాను. స్వేచ్ఛా విహంగాలు; మూలం: టాగోర్; పేజీలు: 68; వెల: 75; ప్రతులకు: అనువాదకుడు, 30-7-31, సూర్యనారాయణపురం, కాకినాడ. రచయిత: బొల్లోజు బాబా 9849320443
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement