-
సామాజిక తెలంగాణ సాధనకు పోరాడాలి
మోత్కూరు సామాజిక తెలంగాణ సాధనకు బడుగు, బలహీనవర్గాలు పోరాడాలని తెలంగాణ ఉద్యమ వేదిక జిల్లా అధ్యక్షుడు యానాల లింగారెడ్డి కోరారు. సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఐక్య వేదిక మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మైండ్ గేమ్‌తో ప్రజలను పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ వేదిక మండల అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా ధర్మారం గ్రామానికి చెందిన మందుల నర్సింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉద్యమ వేదిక నియోజకవర్గ అధ్యక్షుడు గఫర్‌ఖాన్, కార్యదర్శి జి.రమేష్‌గౌడ్, తెలంగాణ ఉద్యమ స్టూడెంట్ వేధిక జిల్లా అధ్యక్షుడు నార్కట్‌పల్లి రమేష్ నాయకులు తొంట పాండు, బాలెంల పరుశరాములు, సందీప్, విజయచంద్ తదితరులు ఉన్నారు. -
సామాజిక రుగ్మతలపై పోరాడాలి
రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి ఘనంగా జిల్లా ‘లయన్స్’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కాజీపేట : సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను రూపుమాపేందుకు లయన్స్‌క్లబ్ సభ్యులు పాటుపడాలని పట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన జిల్లా లయన్స్‌క్లబ్ (320 ఎఫ్) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాత్రి హన్మకొండ కేయూ రోడ్డులోని పీజీఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ సంద ర్భంగా లయన్స్‌క్లబ్ నూతన గవర్నర్‌గా కేయూ మాజీ వీసీ వంగాల గోపాల్‌రెడ్డితో పాటు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్.సునీల్‌కుమార్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1గా పి.సంపత్‌రెడ్డి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్–2గా కే.సీ.జాన్‌బన్నీ, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీగా డాక్టర్ పి.సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా జిల్లా పురుషోత్తం తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజసేవ చేయాలన్న గొప్ప ఆశయంతో లయన్స్‌క్లబ్ సభ్యులు పోటీ పడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ ప్రత్యేక లయన్ డిస్ట్రిక్ట్‌గా ఆవిర్భవించిందని.. ఈ మేరకు క్లబ్ పేరును అంతర్జాతీయస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆయన ప్రభుత్వ పాఠశాలల కోసం రూ.6లక్షల విలువైన 300 డెస్కులు పంపిణీæచేశారు. అలాగే, తిరుమలాయపాలెం పాఠశాల అభివృద్ధికి రూ.50వేల చెక్కు అందజేశారు. ఈ మేరకు లయన్స్‌క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో కురవి వీరభద్ర లయన్స్‌క్లబ్, వరంగల్ ఆపద్బంధు లయన్స్క్ల బ్ ఆధ్వర్యంలో వరంగల్ డైమండ్స్ క్లబ్‌ను నూతనం గా ప్రారంభించి లోగోలు ఆవిష్కరించగా, ఆచార్య కె.రమణయ్య సంపాదకత్వంలో రూపొందించిన డైరీ, నూతన వెబ్‌సైట్‌ను జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. అలాగే తొలితరం లయన్స్ సభ్యు లు దేవులపల్లి దామోదర్‌రావు, పి.నారాయణరావు ను సత్కరించారు. ఆహ్వాన సంఘం చైర్మన్‌గా ఎన్.రాజిరెడ్డి స్వాగతం పలకగా పొట్లపల్లి శ్రీనివాసరావు, భూపతి మాస్టర్ ఆఫ్ సెర్మనీగా వ్యవహరించారు. తా డూరి రేణుక శిష్య బృందం శాస్త్రీయ జానపద నృత్యాలను ప్రదర్శించారు. కె.గోవిందరాజు, పోకల చంద ర్, డాక్టర్ కె.రాజేందర్‌రెడ్డి, దీపక్భట్టాచార్జ్, సురేష్, జావెద్ అలీ, విజయ్కుమార్శెట్టి, ప్రమోద్‌కుమార్, బీ.ఎన్.రెడ్డి, డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి, డాక్టర్ లవకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు సామాజిక సేవలో ముందు నిలుస్తున్న వరంగల్ ల యన్స్క్లబ్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో విశేష గుర్తింపు లభించినట్లయిందని క్లబ్ జిల్లా గవర్నర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్, కరీం నగర్, సికింద్రాబాద్, హైదరాబాద్‌తో కలిపి వరంగల్ లయన్స్‌క్లబ్ జిల్లాగా కొనసాగుతుండగా.. 1800 మంది సభ్యులు దాటిన నేపథ్యంలో ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఈమేరకు తొలి గవర్నర్‌గా గోపాల్‌రెడ్డి, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement