-
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
-
SRH Vs CSK Highlights Pics: సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్.. ఫొటోలు
-
IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
నటరాజన్ బర్త్‌డే వేడుకలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో
టి నటరాజన్.. భారత క్రికెట్ టీమ్‌లో యార్కర్ కింగ్‌గా గుర్తింపు ఉంది. నేడు (ఏప్రిల్ 4) ఆయన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో తనతో పాటు ఉన్న ఆటగాళ్లతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ హీరో అజిత్ సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నటరాజన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ ఎంట్రీ ఎలా జరిగిందంటే.. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ అంతా ఒక స్టార్ హోటల్లో బస చేసింది. నేడు నటరాజన్ పుట్టినరోజు కావడంతో టీమ్ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే సన్‌రైజర్స్ బస చేసిన హోటల్లోనే హీరో అజిత్ కూడా ఉన్నారు. నటరాజన్ పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ వేడుకల్లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అజిత్‌ను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇంతలో అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్‌కు తినిపించాడు. తన అభిమాన హీరో అజిత్‌తో ఈ పుట్టినరోజు జరుపుకోవడం తన జీవితంలో మరిచిపోలేనదని నటరాజన్ పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వారందరూ అజిత్‌తో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్న నటరాజన్ ఈ ఏడాది ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపన రాణిస్టూ నట్టూగా పేరు పొందాడు, ఐపీఎల్లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్ స్థాయికి ఆయన ఎదిగాడు. నటరాజన్ సేలం సమీపంలోని చిన్నపంబట్టి అనే గ్రామానికి చెందినవాడు. నటరాజన్ కెరియర్ ప్రారంభంలో తన అమ్మగారు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముతుండగా.. తండ్రి ఓ కూలీ. బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి నేడు తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఓ సందర్భంలో తన అమ్మగారు సగర్వంగా చెప్పుకొచ్చారు. -
11 ఏళ్ల తర్వాత ధావన్..
సాక్షి, హైదరాబాద్ : విధ్వంసకర బ్యాట్స్‌మన్, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభం నుంచి ఆడుతున్నాడు. ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒంటి చేత్తో సైతం మ్యాచ్‌లను గెలిపించాడు. ఐతే కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 టైటిల్ నెగ్గడంలో అతని పాత్ర అమోఘం. ఇలా మంచి బ్యాటింగ్ రికార్డు ఉన్న ధావన్‌కు బ్యాట్స్‌మెన్, అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావించే ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకోవడానికి మాత్రం 11 ఏళ్లు పట్టింది. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికిచ్చే ఈ క్యాప్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ గబ్బర్ సొంతమైంది. ఈ సందర్భంగా ధావన్ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలవడం.. 11 ఏళ్లలో తొలి సారి ఆరేంజ్ క్యాప్ అందుకోవడంతో సంతోషంగా ఉన్నా. గత రాత్రి మ్యాచ్ అద్భుతం. ఈ ఊపు ఇలానే కోనసాగుతుందనకుంటున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధావన్ (45: 28 బంతుల్లో 8 ఫోర్ల)తో రాణించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ . (77 నాటౌట్: 57 బంతుల్లో 13ఫోర్లు, సిక్స్) అందివచ్చిన అవకాశంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి గబ్బర్ చేసిన పరుగులు 122. ఆటగాళ్ల వ్యక్తిగత జాబితాలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడంతో ధావన్‌కు గురువారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఆరెంజ్ క్యాప్ బహుకరించారు. 2 out of 2! What a game last night. The orange cap signifies that the team and you personally, both are going good in the IPL! First time in 11 years. Hope to keep the momentum going🏏🏏😃😃😉 pic.twitter.com/wEOyKFhSOj — Shikhar Dhawan (@SDhawan25) 13 April 2018
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement