-
గోవును జాతీయ జంతువు చేయాలి
-
గోవును జాతీయ జంతువు చేయాలి: ముస్లిం గురువు
అజ్మీర్: దేశంలో ప్రముఖమైన దర్గాలలో ఒకటైన రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ రెండు వివాదాస్పత అంశాలపై స్పందించారు. ఒకటి బీఫ్ వివాదం, రెండోది ముస్లిం మహిళల సమస్య అయిన ట్రిపుల్ తలాక్. ముస్లింలందరూ గో మాంసాన్ని(బీఫ్) తినడం మానేయాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. ఇతర మతస్తుల విశ్వాసాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లింలకు మత గురువు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరైన అజ్మీర్ ఉర్సు (ఖాజా మొయినుద్దీన్ చిస్తీ వర్దంతి) లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను, తన కుటుంబం ఇక జీవితంలో బీఫ్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మంగళవారం ప్రకటించారు. హిందువులకు పవిత్రమైన ఆవును చంపకూడదని.. గో మాంసాన్ని తినడం మానేసి హిందూ సోదరుల మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ముస్లింలకు పిలుపునిచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గో మాంసాన్ని నిషేధించిన అనంతరం పలు రాష్ట్రాల సీఎంలూ ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు సులువుగా విడాకులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తలాక్ చెప్పడమంటే మహిళల ఆత్మ గౌరవాన్ని తగ్గించడమే అవుతుందన్నారు. తలాక్ చెప్పడం మానేయాలని ముస్లిం భర్తలకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇందుకోసం ఖురాన్ ను అడ్డుపెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తలాక్ ను సవాల్ చేస్తూ ముస్లిం మహిళలు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని గుర్తుచేశారు. ఎంతో మంది ముస్లిం మత గురువుల సమక్షంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరడం, తలాక్ పద్ధతికి స్వస్తి చెప్పాలని ముస్లింలకు సూచించడం చర్చనీయాంశమైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement