-
‘జాన్సన్ అండ్ జాన్సన్’కు భారీ జరిమానా!
వాషింగ్టన్: ప్రముఖ పార్మస్యూటికల్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీని నష్టపరిహారం కింద 2.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా అమెరికా కోర్టు ఆదేశించింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల్లో ఒకటైన బేబీ టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించడం వల్ల అండాశయ కాన్సర్ వస్తుందని దాదాపు చాలా మంది వివిధ కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి 2018లో మిస్సోరి కోర్టు విధించిన 4.4 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని దాదాపు సగానికి పైగా తగ్గించి 2.1 బిలియన్ డాలర్లకు కుదించింది. ఈ సొమ్మును టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించడం వల్ల నష్టపోయిన వారికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. (అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు!) పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్ కారణంగా కాన్సర్ కలుగుతుందని తెలిసినా కస్టమర్లను ఆ విషయం గురించి హెచ్చరించకుండా కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోందని కోర్టులో కొంత మంది వినియోగదారులు కేసు వేశారు. దీనిపై విచారించిన కోర్టు దీని వలన జరిగిన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ నష్టానికి వెలకట్టలేమని కోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి ఈ విషయంలో పై కోర్టును సంప్రదిస్తామని వెల్లడించారు. (‘కరోనా పరీక్షలు తగ్గించమనలేదు’) అమెరికాలో అనేకమంది ఈ కంపెనీ, టాల్కమ్‌పౌడర్ వాడటం వలన కాన్సర్ వస్తుందని హెచ్చరించకుండా ఉత్పత్తులను అమ్ముతుందని కోర్టులో కేసులు వేశారు. దీని వలన అండాశయ క్యాన్సర్‌కు గురవుతున్నామని తెలిపారు. 2017లో ఈ కంపెనీ వల్ల తనకు కాన్సర్ వచ్చిందని కేసు వేసిన మహిళలకు మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించింది. అమెరికాలో కంపెనీ పై అనేక మంది కేసులు వేస్తుండటంతో బేబీ టాల్కమ్ పౌడర్లను యూఎస్ఏ, కెనడాలో విక్రయించబోమని ప్రకటించింది. ఈ రెండు దేశాలలో మినహా మిగిలిన దేశాలలో తమ ఉత్పత్తులు విక్రయిస్తామని పేర్కొంది. (జాన్సన్ అండ్ జాన్సన్‌కు రికార్డ్ జరిమానా) -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా
ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా పడింది. కంపెనీకి చెందిన టాల్కం ఫౌడర్‌ను వాడటం వల్ల ఓ కాలిఫోర్నియా మహిళ అండాశయ క్యాన్సర్‌కు గురైనట్టు తేలడంతో జాన్సన్ అండ్ జాన్సన్‌కు సెయింట్ లూయిస్ జడ్జి ఈ జరిమానా విధించారు. ఆ మహిళకు 70 మిలియన్ డాలర్లను(రూ.467కోట్లకు పైగా) చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. మూడు గంటల వాదోపవాదాల అనంతరం వరుసగా మూడోసారి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తనను తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. ఇప్పటికే ఈ కంపెనీకి వ్యతిరేకంగా 1,700 దావాలు ఫెడరల్ కోర్టుల్లో నమోదయ్యాయి. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. టాల్క్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా నమోదైన మొదటి రెండు కేసుల్లో కూడా కంపెనీకి భారీ జరిమానాలే పడ్డాయి. మూడో విచారణ కూడా ఈ తరహాలోదే కావడం, కంపెనీ ఆఫర్ చేసే ఫౌడర్ అండాశయ క్యాన్సర్ బారిన పడినట్టు తేలడంతో సెయింట్ లూయిస్ మరోసారి ఈ జరిమానా విధించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాధిత మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ ఫౌండర్‌ను వాడుతుందని, మూడేళ్ల క్రితం ఆమె అండాశయ క్యాన్సర్ బారిన పడినట్టు గుర్తించిందని కోర్టు పేర్కొంది. సర్జరీ, రేడియేషన్, కెమియోథెరఫీ చేపించుకున్నా ఈ వ్యాధితో వచ్చే రెండేళ్లలో ఆమె మరణించే అవకాశాలు 80 శాతం ఉన్నాయని న్యాయవాదులు చెప్పారు. శిక్షాత్మక నష్టాల కింద 65 మిలియన్ డాలర్లను, మెడికల్ వ్యయాల కింద 2.5 మిలియన్ డాలర్లను కంపెనీ భరించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని కంపెనీ అధికార ప్రతినిధి కరోల్ గుడ్ రిచ్ పేర్కొంటున్నారు. టాల్కం ఫౌడర్ వాడకం, అండాశయ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. జాన్సన్ బేబీ ఫౌడర్ అన్ని రకాల సురక్షితమైనవంటూ కంపెనీ ఊదరగొడుతోంది. .
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement