-
ధోని 33 పరుగుల దూరంలో..
నాటింగ్‌హామ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో మరో రికార్డు నమోదు కానుంది. ఇంగ్లండ్‌తో గురువారం జరగనున్న తొలి వన్డేలో ధోని 33 పరుగుల సాధిస్తే పదివేల పరుగులు పూర్తవుతాయి. దీంతో అంతర్జాతీయ వన్డే చరిత్రలో పదివేల పరుగులు పూర్తిచేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా దిగ్గజాలు సచిన్, గంగూలి, ద్రవిడ్‌లు ఈ ఫీట్‌ను సాధించారు. ఓవరాల్‌గా పదివేల క్లబ్లో చేరిన 12వ ఆటగాడిగా ధోని చేరే అవకాశం ఉంది. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18426) ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో వికెట్ కీపర్‌గా.. ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో 33 పరుగులు సాధిస్తే పదివేల పరుగుల సాధించిన రెండో వికెట్ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధించనున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 318వన్డేలు ఆడిన ధోని 9967 పరుగలు పూర్తి చేశాడు.. ఇందులో10 శతకాలు, 67 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్ చేసిన కీపర్‌గా ధోని(107) తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సంగక్కర (99) రెండో స్థానంలో ఉన్నాడు. గతంలో పదివేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (భారత్)- 18426 (463 మ్యాచ్‌ల్లో) కుమార సంగక్కర (శ్రీలంక)- 14,234 (404 మ్యాచ్‌ల్లో) రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 13,704 (375 మ్యాచ్‌ల్లో) సనత్ జయసూర్య( శ్రీలంక)- 13,430 (445 మ్యాచ్‌ల్లో) మహేళ జయవర్దనే(శ్రీలంక)- 12,650 (448 మ్యాచ్‌ల్లో) ఇంజమాముల్ హక్(పాకిస్తాన్)- 11,739 (378 మ్యాచ్‌ల్లో) జాక్వస్ కలిస్( దక్షిణాఫ్రికా)- 11,579 (328 మ్యాచ్‌ల్లో) సౌరవ్ గంగూలి (భారత్)- 11,363 (311 మ్యాచ్‌ల్లో) రాహుల్ ద్రవిడ్(భారత్)- 10,889 (344 మ్యాచ్‌ల్లో) బ్రియాన్ లారా(వెస్టిండీస్)- 10,405 (299 మ్యాచ్‌ల్లో) తిలకరత్నే దిల్షాన్( శ్రీలంక)- 10,290 ( 330 మ్యాచ్‌ల్లో) -
అరుదైన రికార్డుకు చేరువలో గేల్..
బెంగళూరు: వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో పది వేల పరుగులను చేరడానికి గేల్ అతి కొద్ది దూరంలో నిలిచాడు. మరో 63 పరుగులు చేస్తే పది వేల మైలురాయిని గేల్ అందుకుంటాడు. ఇప్పటివరకూ అన్ని రకాల ట్వీ 20 మ్యాచ్ ల్లో క్రిస్ గేల్ చేసిన పరుగులు 9,937. ఇప్పటిదాకా ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్‌మన్ కు సాధ్యం కాని ఘనతను అందుకోవడానికి గేల్ కొద్ది దూరంలో ఉన్నాడు. ఐపీఎల్-10 సీజన్ ఆరంభంలో ఆర్సీబీ ఆడే మ్యాచ్‌ల్లోనే గేల్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరంభపు మ్యాచ్ ను ఆడుతున్న క్రమంలో గేల్ కొత్త రికార్డుపై ఆసక్తి నెలకొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement