-
టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!
సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిజ్‌లో పెడితే కనీసం ఓ వారం అయినా వాడుకోవచ్చు. అందులో అయితే కనీసం నాలుగురోజుల వరకు పాడవ్వకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టొదని హెచ్చరిస్తున్నారు కూడా. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. ఎందుకు పెట్టకూడదంటే.. ఫ్రిజ్‌లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని చెబతున్నారు పరిశోధకులు. 39 డిగ్రీల చల్లటి ఉష్టోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది. ఒకటి రెండు రోజులు ఫ్రిజ్‌లో ఉంటే పర్లేదు గానీ చాలా రోజులు ఫ్రిజ్‌లో ఉంటే మాత్రం టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు. అలాగే దాని డీఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు. మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధుల వచ్చేందుకు దారితీస్తుంది. ఎప్పడైతే సుదీర్థకాలం రిఫ్రిజిరేటర్లో టమోటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు. టమాటాలు పండినప్పడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్‌లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తిని నిలిచిపోతుంది.. దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది. టమాటాలు పండినప్పుడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే రిఫ్రిజిరేటర్లోని చల్లదనం ఈ ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపేస్తుంది. ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుదీర్ఘకాలం ఫ్రిజ్‌లో ఉన్న టమాటాలు విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాగా, తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోలపోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్‌పెట్టేలా..) -
భారీ ఊరట: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. జూలై 7.44 శాతం నుండి 6.83 శాతానికి తగ్గి స్వల్ప ఊరట నిచ్చింది. అయితే ఆర్బీఐ 2-6 శాతం పరిధితో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) తాజా డేటా ప్రకారం జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. జూలైలో 7.44 శాతం వద్ద 15 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అలాగే జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.అయితే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 26.14 శాతానికి దిగి వచ్చింది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు తాజా డేటా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేయనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం కొంతవరకు కారణం.అయితే, ఈ కాలంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు పండ్ల వంటి కొన్ని అవసరమైన వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయయి. ద్రవ్యోల్బణాన్ని గణించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆహార ధరలు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు బాగా ప్రభావితం చేశాయి.ముఖ్యంగా టొమాటోలు , ఉల్లిపాయలు వంటి ప్రధానమైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. -
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ!
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ! -
ఫోటోలు దిగితే టమాటలు ఫ్రీ..
-
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement